God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ప్తె నమ్మకం కోల్పోయే moments 

ఈ సృష్టిలో అత్యంత శక్తివంతుడు సృష్టి లయకారుడు సృష్టిని నిర్మించడం నాశనం చేయడం సృష్టిలోని జీవాన్ని సృష్టించాలన్న నశింపజేయాలన్నా మంచిని పెంచి చెడును నాశనం చేసే అత్యంత శక్తివంతుడే దేవుడు(god).
ఈ ప్రపంచం మొత్తం ఆయన కిందనే ఉంటుందని ఆయన ఆధ్వర్యంలోనే సృష్టి లయలు కొనసాగుతున్నాయని పురాతన కాలం నుంచి చాలా మంది మేధావులు, కవులు, Mythologists భావన.
 అంతేకాకుండా Mahabharatam, Ramayanam, Bhagavatam వంటి ఇతిహాసాలలోను ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో ఎక్కడైతే దుష్టులు, నీచులు, మోసగాల్లో, కిరాతకులు ,వంచకులు పెరుగుతారో అలాంటి వారి నుండి ఈ లోకాన్ని కాపాడడానికి నేను ఆవిర్భవిస్తూ ఉంటానని వీటిలో శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణని అవతారం లో ఉండి చెబుతాడు.
అంతేకాకుండా మంచి వాళ్లకు మేలు జరగడం ఆలస్యం అవచ్చేమో కానీ కీడు మాత్రం జరగదని కూడా భారతంలో కృష్ణుడు(Krishna)  చెప్పాడు. అయినా నేటి సమాజంలో మంచి వాళ్లకు మేలు సంగతి పక్కన పెడితే కొన్ని రోజులైనా జరగకుండా నన్ను ఆ God రక్షించగలుగుతాడా అని వాపోయే గుణవంతులు ఎందరో.
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది కృష్ణుడు చెప్పినట్లు కర్మ ఫలం అనుభవించకుండా నిన్ను ఏ దేవుడు దెయ్యం కూడా కాపాడలేదన్న చేదు వాస్తవం ఇప్పటి ఆధునిక సమాజంలో నిజంగా వర్తిస్తున్నదా. అసలు ఇలాంటి ప్రశ్న నీకెందుకు కలిగింది అని నన్ను చాలామంది అడగవచ్చు కానీ నా చుట్టూ ప్రక్కల నేను గమనించిన కొన్ని అంశాలు చూస్తే అసలు దేవుడు ఉన్నాడా అన్న అనుమానం నా మదిలో మెదిలింది.ఆ అంశాలను ఈరోజు ఈ బ్లాగులో వివరించడం జరిగింది. 
ఈ అంశాల వల్ల మిమ్మల్ని దేవుడిని తక్కువ అంచనా వేసి చూపడం లేదు. నిజంగా దేవుడు లేకపోతే ఈ సమాజంలో అందరూ అధర్మలుగా వంచకులుగా మారే అవకాశం లేకపోలేదు.అలా మారకుండా మనల్ని నియంత్రించే ఒక శక్తి స్వరూపమే దేవుడు. దేవుడు లేడు అనే చాలామందిని అనేక దుష్ట చర్యలకు పూరిగొలుపుతుంది. కావున నేను నిజంగా దేవుడు లేడని చెప్పడం లేదు కానీ నేను గమనించిన కొన్ని అంశాలను బట్టి ఎంతో మేలు చేసి తీవ్ర మనోవేదన అనుభవిస్తూ దేవుడు కొంతైనా దారి చూపలేని వారిని దృష్టిలో ఉంచుకొని రాస్తున్న చేదు నిజాలు అని అర్థం చేసుకోగలరు.
God పై నమ్మకం కోల్పోయే వాటిలో మొదటిది

1)హంతకులే హీరోలవ్వడం(Murderers becoming heroes):-

ప్రపంచ చరిత్రలో గొప్ప రాజులుగా పరిపాలకులుగా పేరు ఉన్న Ghazni Muhammad, Genghis Khan, Stalin ఎంతో మందిని తమ అధికారం కోసం నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కానీ వారు హంతకులైన ఒక మనిషి ప్రాణం తీసిన ప్రపంచం దృష్టిలో చాలా గొప్ప పాలకులుగా మిగిలారు.ఇదే సమయంలో చాలామంది నీతి నిజాయితీగా ఉన్న అనేకమంది సామాన్యులు వీరి చేతిలో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నిజంగా దేవుడు ఉంటే వీరి చేసిన పాపాలకు ప్రాణంతో ఉండగా శిక్షను ఎందుకు అనుభవించలేకపోయారు. 
అలాగే శిక్ష సంగతి పక్కన పెడితే అత్యంత రాజ విలాసాలు అనుభవించగలిగారు.దీన్ని బట్టి ఒక విధమైన హంతకులు హీరోలుగా చలామణి అవడం ఏంటనే ప్రశ్న మనందరి మధ్యలో మెదలక మానదు. వీరే కాకుండా మన ఇండియాలో కూడా Aurangzeb, ajatha shatruvu, Ashoka, the Delhi Sultansలో కూడా చాలామంది పితృ సోదర హంతకులను కూడా గొప్ప రాజులు గానే చరిత్రలో చెప్పబడ్డారు.అలాగే ఆజాత శత్రువు తన తండ్రి అయిన బంబి సారుని (bimbi sara)హత్య చేసి  రాజయ్యాడు. Alauddin Khilji తన మామ అయిన జలాలుద్దీన్ కిల్జీని హత్య చేసి రాజయ్యాడు. ఇతడే కాకుండా తుగ్లక్ వంశంలో గొప్పవాడైన Muhammad bin Tughlaq కూడా తన అధికారం కోసం తన తండ్రి అయిన జియాజుద్దీన్ తుగ్లక్నో హత్య చేసి సింహాసనం అధిష్టించాడు. 

Also read :-ఆధునిక భారత్ లో బెంగాల్ ఎందుకు number 1

వీరంతా  కూడా సింహాసనం అదృష్టంచడానికి వారి సొంత మనుషులను కూడా చంపేశారు. అయినా కానీ దేవుడు ఉంటే వీరికి ఎందుకు శిక్షలు పడలేదు.
వీరే కాకుండా ఔరంగజేబు అయితే తన ముగ్గురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తా రాసుకో  లాంటి గొప్ప పండితుడు మంచి మేధావి అయినా   కూడా గొప్ప భక్తుడైనా  దేవుడు కూడా అతన్ని జేబు బారి నుండి రక్షించలేకపోవడం చాలా దురదృష్టకరం.ఇక చరిత్రలో గొప్ప రాజుగా చెప్పబడే అశోకుడు(ashoka) కూడా తన యొక్క 99 మంది సోదరులను హత్య చేసి రాజు గాడిని కొన్ని శాసనాలు తెలుపుతున్నాయి. కానీ కొన్ని శాసనాలు మాత్రం అవన్నీ అవాస్తవాలని చెబుతున్నాఈ. కాకపోతే అశోకుడు మాత్రం తన యొక్క ప్రాయశ్చిత్తానికి తర్వాత మంచి మార్గాన్ని అనుసరించాడు. ఇక్కడ మిగతా వారంతా కూడా చాలా కర్కోటకులుగా క్రూరులుగానే ప్రజల దృష్టిలో చెప్పబడ్డ వారికి ఎటువంటి శిక్షలు పడ్డ దాఖలాలు కూడా లేవు.ఇక రెండవది

2)భక్తులు బాధలు అనుభవించడం(Devotees experience sufferings)

ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో ఉపవాసాలతో శారీరక మానసిక సుఖాలకు దూరంగా ఉంటూ నిత్యం దేవుని పూజిస్తు ఉన్నా కూడా వారు అనేక బాధలకు గురవుతున్న, దోపిడీలకు దారిద్రం లోకి నెట్టబడుతున్న, వారి కంట కన్నీరు పెడుతున్న ,దేవుడు చూస్తూనే ఉన్నట్లు వారి జీవితంలో మార్పులు తేలేక పోవడం వల్ల కూడా కొన్నిసార్లు దేవుడు లేడు అన్న వాదన కలుగుతుంది. 
కొందరు తమ జీవితం మొత్తాన్ని దేవుడుకు అర్పించిన వారు దేవుడు వల్ల సాధించింది ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు చాలామంది మదిలో మెదులుతున్నాయి.ఇంకా ప్రత్యేకంగా కొందరు మహిళలు ఎంతో పవిత్రంగా ఉంటూ దేవుడికి ప్రత్యేక పూజలు భక్తితో సేవించినా కూడా వారు చాలా విధాలైనా అఘాయిత్యాలకు దారుణమైన నేర ఘోరాలకు గురవడం చాలా బాధ కలిగించే విషయం. ఆ సమయంలోనైనా వారిని దేవుడు ఎందుకు రక్షించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఇంకా ఈ మధ్య చాలా మంది అనుకోకుండా అపరిచితుల ట్రాకులొ పడి తమ జీవితాన్ని కోల్పోతున్నారు.
అలాగే అనేకమంది గ్యాంగ్ రేప్స్ వంటి దారుణాలకు గురవుతున్న ఆ సమయాల్లో దేవుడు తన శక్తితో వారిని శిక్షించి తన భక్తులుగా ఉన్న వారిని అయినా కాపాడాలి కదా ఈ ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూనే ఉంటుంది. ఇక మూడవది

3)తప్పుకు శిక్ష ఏది  (What is the punishment for a mistake):-

నేటి సమాజంలో దారుణమైన హత్యలు ,రేపులు, మానభంగాలు చేసిన వారికి ఎందుకు సరైన శిక్షలు పడడం లేదు.ఆ సమయంలో బాధితులు అనుభవించిన బాధలో సగం బాధనైనా వారు అనుభవించేలా దేవుడైన తన మాయాజాలంతో చేయవచ్చు కదా ?కానీ నేటి కలియుగంలో ఇటీవల తరచు వార్తల్లో అనేక ఘోరమైన వార్తలు వింటుంటాం.వాటిలో యూపీలో జరిగిన కతువీా హత్యాచార ఘటనలో 14 సంవత్సరాల ఆడపిల్లను దాదాపు 20 మంది కొన్ని రోజులు రేప్ చేసి హత్య చేసిన ఇప్పటికి వారికి సరైన శిక్షలు పడ్డ దాఖలాలు లేవు.
 అలాగే నేటి కాలంలో ఎంతోమంది యువతలు దారుణ హత్యాచారాలకు హత్యలకు హింసలకు గురవుతున్న వారందరూ కూడా బిక్కుబిక్కుమంటూ లోలోపల కుమిలిపోతున్నారే కానీ దేవుడి నుంచి కాస్తైనా ఉపశమనం లభించడం లేదు.ప్రత్యేకంగా నేటి కాలంలో దారుణమైన శిక్షలు పడ్డ బడా బాబులు చాలా తక్కువ మందే ఉన్నారంటే మన న్యాయవ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.కనీసం చట్టం దృష్టిలో కూడా డబ్బున్న వాడు పేదవాడు అనే విధంగా నేటి న్యాయస్థానాలు వ్యవహరిస్తున్నాయి.
Also read: -భారత్ లో గత 100 సంవత్సరాలలొ కనుమరుగయినవి  
నిజంగా దేవుడే అనే వాడే ఉంటే మోసపూరితమైన లంచాలు తీసుకుని న్యాయవ్యవస్థను బ్రష్టు పట్టించే లాయర్లు జడ్జీలు రాజకీయ నాయకులకు సరైన బుద్ధి కలిగించే విధంగా వారికి శిక్షలు అనుభవించేలా చేయాలి కదా. కానీ నిజానికి ఇలా జరగడం లేదు. నేటి సమాజంలో డబ్బున్న వాడికి న్యాయస్థానంలో చాలా తక్కువ సమయంలోనే ఆ కేసులో నుండి బయటపడగలుగుతున్నాడు.ఇక పేదవారి మాత్రం బిక్కు బిక్కుమంటూ అక్కడే చేయని నేరాలకు కూడా శిక్షలు అనుభవించాల్సిన దారుణమైన ఘటనలు నేడు మనం తరచూ చూస్తున్నాము. వీటిని చూస్తుంటే నిజంగా దేవుడు ఉన్నాడన్న ప్రశ్న చాలామందికి అనుమానంగానే ఉంటున్నది. నాలుగవది

4)దేవుడి భక్తులు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు(Why are God's devotees unable to become rich):-

దేవుడిపై ఎంతో భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ ఎన్నో ఉపవాసాలు ఎన్నో పూజలు చేస్తూ తమ జీవితం మొత్తాన్ని దేవుడుకి అర్పించిన కూడా వారు కనీస సంపాదన కూడా సంపాదించలేకపోతున్నారు. ఇదే సమయంలో కనీసం దేవుడి పూజ అంటే కూడా తెలియని చాలామంది అసలు దేవుడు అంటే కూడా తెలియని వారు ప్రపంచంలో వేలమంది కోటీశ్వరులుగా ఉండడం మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం.
వీటికి ప్రధాన ఉదాహరణగా Bill Gates దాదాపు పది సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అపర కుబేరుడు గా అంత ఎక్కువ సంపాదన సంపాదించిన కూడా తను ఏ రోజు కూడా పూజ చేసింది లేదు. కనీసం ఏ గుడి తలుపు కూడా తట్టలేదు. ఇదే సమయంలో దేవుడి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి ఎంతో సేవ చేసి మొత్తాన్ని కూడా దేవుడికి అర్పించినా కూడా దేవుడి దగ్గర ఉండే చాలామంది భక్తులు పూజారులు చాలా పేదవారిగానే దాన్ని ముగించాల్సి వస్తున్నది. అంతేకాకుండా వారి యొక్క అంతిమ సమయంలో చాలా మనోవేదన కు కూడా గురవుతూ ఎంత దయనీయ జీవితం గడిపిన వారు ఉన్నారు.

నిజంగా దేవుడి ద్వారా మారతాయి అంటే ఈ ప్రపంచంలో పూజారులే చాలా ధనవంతులు కావాలి. కానీ నేడు అది జరగడం లేదు దీనిని బట్టి కూడా దేవుడు లేడు అన్న వాదనకు గట్టి ఉదాహరణ దొరికిందనే చెప్పవచ్చు. ఇక చివరిది
5)కర్మ ఫలం ఎందుకు అనుభవించలేకపోతున్నారు:-

Why are you unable to experience the fruits of your karma?

దేవుడిని నమ్మే చాలా మంది మరియు దేవుడి ద్వారా చెప్పబడే చాలా గొప్ప మాటలు కర్మ ఫలం అనుభవించకుండా నిన్ను ఏ దేవుడు దయ్యం కూడా కాపాడలేరని కచ్చితంగా దాన్ని అనుభవించాల్సిందే అని మన గ్రంధాల్లో చదివి ఉంటాం. మహాభారతంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్పిన మాటలు కానీ ప్రస్తుత కాలంలో మనం తరచూ వార్తల్లో ఎంతో కష్టపడి జీవితాంతం ఎంతో శ్రమించినా కూడా ఆ విజయం ప్రతి ఫలాలు వారుఅనుభవించలేకపోవడం నిజంగా చాలా బాధాకరం. దీనికి ఉదాహరణగా గత సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో మండలం ఫస్ట్ వచ్చిన ఒక విద్యార్థిని చివరి పరీక్ష ముగిసిన రోజు అనుకోకుండా యాక్సిడెంట్ లో మరణించడం నిజంగా చాలా బాధ కలిగించే విషయం. కనీసం ఆ అమ్మాయి తను పడిన కష్టానికి ఆ ప్రతిఫలాన్ని కూడా అనుభవించలేక చూడలేక అర్ధాంతరంగా చాలా తక్కువ వయసులోనే మరణించడం చాలామంది కళ్ళల్లోంచి నీళ్లు రావడం ఇటువంటివారిని దేవుడు త్వరగా ఎందుకు తీసుకుపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఇంతే కాకుండా చాలామంది గొప్ప గొప్ప పరీక్షల్లో, పనుల్లో ప్రారంభించిన కాలం నుంచి కూడా ఎంతో ఓర్పు సహనం కష్టంతో పట్టుదలతో శ్రమించినా కూడా దాని యొక్క అంతిమ ఫలితాలు అంతిమ ఫలాలు అంతిమ విజయం వారి కళ్ళతో చూడలేకపోవడం, అనుభవించలేకపోవడం చూస్తే నిజంగా దేవుడు ఉన్నాడాఅన్న అనుమానం కలుగక మానదు.దేవుడిపై నమ్మకం కోల్పోయే మరో అంశం.

దేవుడిని దుర్భాషలాడిన ఏం కాక పోవడం  What is wrong with cursing God:-


సాధారణంగా మన సమాజంలో పెద్దవారిని గౌరవించడం పెద్దవారితో కొద్దిగా మర్యాదగా మాట్లాడడం, పెద్దవారిని గొప్ప వారిని గౌరవించడం వంటివి సమాజంలో మన బాధ్యత. కానీ కొందరు హద్దు మీరు ప్రవర్తిస్తూ పెద్దవారిని తమ కన్నా ఉన్నత స్థాయి వారిని కూడా అనేక  దుర్భాషలాడుతూ ఉంటున్నారు. ఇక వీరందరూ అంటే మనుషులని కొద్దిగా పక్కన పెట్టవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు నాస్తిక వాదులు దేవుడు లేడనే పుకార్లు పుట్టిస్తూ దేవుడిని కూడా నానా మాటలతో దుర్భాషలాడుతున్నారు. 
అయినా కానీ వాళ్లకు ఎలాంటి శిక్షలు పడడం లేదు అంతేకాకుండా నిజంగా దేవుడే గనక ఉంటే వాళ్లకు ఎందుకు శిక్షలు పడటం లేదు దేవుడు సృష్టిలో గొప్పవారైతే ఇటువంటి ఎందుకు భయపడడం లేదు. అన్న అంశాలను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేవుడి పేర్లతో మోసాలు చేస్తున్న దొంగ బాబాలు కూడా ప్రస్తుతం వేల సంఖ్యలో ఉన్నారని ఒక సర్వే కూడా వెల్లడించింది. అంతేకాకుండా దేవుడి సేవలో ఉంటూ దేవుని ముసుగులో ఉంటూ మోసాలు పాపాలు దౌర్జన్యాలు దొంగతనాలు చేసే వాళ్ళు కూడా కొన్ని వేలల్లోనే ఉన్నారంటే నమ్మాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా దేవుడే ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఒక తరుణంలో చాలామంది మదిలో మెదులుతూనే ఉంటుంది. తర్వాతి అంశం

దేవుడి కోసం ప్రాణాలర్పించిన ఫలితం శూన్యం

The result of sacrificing one's life for God is nothing.
కొందరు దేవుడి కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, ఆనందాలను, ఆప్యాయతలను కూడా వదులుకొని, నిరంతరం దేవుడు కోసమే తీవ్రమైన దీక్షలను అవలంబిస్తున్న, దేవుడి అనుగ్రహం పొందాలి అనుకున్నా కానీ, వాళ్లు ఆ అనుగ్రహం సంపాదించ లేకపోవడం కూడా నిజంగా దేవుడు ఉన్నాడన్న ప్రశ్నకు తావు ఇస్తున్నది. ఒక విధంగా వాళ్లు అంత పెద్ద దీక్షలు చేసిన సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు .నిజంగా దేవుడు దీక్షలో ఉంటే మరణం అనేది ఎందుకు సంభవిస్తుంది అన్న ప్రశ్నలు కూడా చాలామంది మధ్యలో మెదులుతున్నాయి. అంతేకాకుండా కొందరైతే ఇదే దీక్షలో ఉండి తమ ప్రాణాలు కోల్పోయిన తరువాత అయినా తమ కుటుంబానికైనా దేవుడు అనుగ్రహం పొంది బాగుంటారు అనుకుంటే వాళ్ల జీవితాలు కూడా మెరుగు కాకపోవడం గాడ్ పై నమ్మకం కోల్పోయే మరో మూమెంట్ గా చెప్పవచ్చు.
ఉగ్రవాదులు(terrorists)
ప్రస్తుతం ప్రపంచంలో జనజీవానికి ఇతర జీవులకు అత్యంత నష్టం కలిగిస్తున్న వారు ఉగ్రవాదులు కానీ వాళ్ళు ఇంతటి దౌర్జన్యాలు చేస్తున్న కానీ వారి జీవితాల్లో ఎందుకు శిక్షలు పడడం లేదు వారి జీవితాలు ఎందుకు బాగుంటున్నాయి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి నిజంగా దేవుడు గనుక ఉంటే ఎంత మందికి అన్యాయం చేసిన వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
మహాభారతంలో Lord Krishna చెప్పిన దాన్ని బట్టి కచ్చితంగా కర్మఫలం అనుభవించాల్సిందే అన్న వాదన కొందరి విషయాల్లో ఎందుకు జరగడం లేదు. దీన్ని బట్టి కూడా దేవుడు ఉన్నాడా అన్న అనుమానానికి బలమైన సమాధానం దొరికినట్ అయింది. ఇలా  ఆలోచిస్తే ఇంకా చాలా వరకు ఉన్నాయి .వాటిలో ఇప్పుడు నేను కొన్నింటిని మాత్రమే తెలపడం జరిగింది.
వీటితో పాటు నేటి కాలంలో తను నమ్మిన మిత్రులను సొంత వారిని కూడా ఎన్నో విధాలుగా హింసలకు గురి చేస్తూ ఎంతో మోసాలు చేస్తున్న కూడా వారు సుఖంగానే ఉండడం కూడా దేవుడిపై నమ్మకం కోల్పోతున్నారు.ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ లో చెప్పినవన్నీ నా యొక్క ఊహ శక్తితో క్రియేటివిటీగా రాసినవే అంతేకానీ దేవుడు లేడని చెప్పడం కాదు. ఇటువంటి కొన్ని సమయాల్లో మనకు ప్రశ్న ఎదురవుతుంది అని ప్రశ్నించడం కోసమే దీనిలో చెప్పడం జరిగింది. నిజంగా దేవుడే గనక లేకపోతే ఈ సమాజం ఎప్పుడో గాడి తప్పేది. 
వీటితో పాటు నేటి కాలంలో తను నమ్మిన మిత్రులను సొంత వారిని కూడా ఎన్నో విధాలుగా హింసలకు గురి చేస్తూ ఎంతో మోసాలు చేస్తున్న కూడా వారు సుఖంగానే ఉండడం కూడా దేవుడిపై నమ్మకం కోల్పోయే మరో అంశం . ఇప్పటివరకు నేను చెప్పినవి దేవుడు లేడు అన్న వాదనను బలపరిచేవి. ఇంతకుముందు పోస్టులో దేవుడు  వాదనను బలపరిచేటటువంటి కొన్ని విషయాలను తెలపడం జరిగింది వాటిని కూడా గమనించగలరని తెలియపరచడమైనది.
Resources: -my own thoughts 
Images credit :-pixabay  ,freepik 
Images edit: --thumbnailmaker 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !