Why popular of cricket in India

Cricket popularity India 


ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో రకాల క్రీడలు సాంప్రదాయ బద్ధమైన ఆటలు ఉన్నాయి. అలాగే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశంలో అనేక రకాలైన ఆటలు ఆడుతూ వస్తున్నారు. కానీ ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం మొదటి వరకు కూడా భారతీయులకు తెలియని ఒక ఆట ప్రస్తుత కాలంలో భారతీయులకు ఒక పిచ్చిగా ఒక వ్యసనంగా ఎందుకు మారింది. దాదాపు 18వ శతాబ్దం వరకు కూడా ఆ ఆట అంటే కూడా భారతీయులకు తెలియదు.
18 శతాబ్దంలో భారతదేశాన్ని తమ యొక్క వలస పాలిత ప్రాంతంగా మార్చుకున్న బ్రిటిష్ వారు మన దేశ ప్రజల యొక్క అలవాట్లు సాంప్రదాయాలలో తీవ్రమైన మార్పులను తీసుకొని రావడం జరిగింది. వీటి ద్వారా భారతీయుడు కూడా ఆంగ్ల వేషధారణకు లోనయ్యాడు.1854లో లార్డ్ మెకాలే ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రులకు ఒక లేఖ రాస్తూ భారతీయులు కేవలం రూపంలోనే భారతీయులని వారి యొక్క అలవాట్లు ఇంగ్లీష్ వారివని ఆ లేఖలో పేర్కొన్నారు. అలా అప్పట్లో తెచ్చిన మెకాలే కమిటీ వల్ల భారతీయులకు ఇంగ్లీష్ ఎంతో దగ్గర అయింది. దీంతో అప్పట్లో భారతీయులు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడంతో కొందరు ఆంగ్లేయులతో దోస్తులుగా కూడా మారారు. 
అలా స్నేహితులుగా మారిన ఆంగ్లేయులు ఏదో ఒక వ్యాపకంగా సరదాగా ఆడిన ఒక గేమ్ తరువాత తరాల్లో సగటు భారతీయుణ్ణి ఆ ఆటను ఆడేలా ప్రోత్సహించేలా చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కానీ తర్వాతి తరాల్లో అదే నిజమైంది . అప్పుడు ఆంగ్లేయులు సరదాగా ఆడిన ఆటే Cricket.. ఇప్పుడు భారత క్రీడా రంగాన్ని శాసిస్తున్నది కూడా Cricket. 
నిజానికి భారత జాతీయ క్రీడ హాకీ. ఒలంపిక్స్ లో 1929  నుండి 1960 వరకు  వరుసగా ఆరుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన ఘనత అప్పట్లో భారత హాకీ కి మాత్రమే దక్కింది. ఇప్పటికీ కూడా భారత అత్యధిక మెడల్స్ సాధించిన క్రీడ కూడా హాకీ నే. కానీ మన జాతీయ క్రీడ హాకీ లో ఎవరెవరు ఆట ఆడుతున్నారు ఎంతమంది ఉన్నారు అన్న విషయం కూడా దేశంలో ఉండే 25% జనాభాకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. అదే క్రికెట్ గురించి అయితే దాదాపు 11 మంది ప్లేయర్స్ యొక్క పేర్లను కూడా ఎలాంటి తడబాటుకు లోను కాకుండా దాదాపు 70% మంది సమాధానం చెప్పగలరు. చిన్న ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడికి కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళంగానే క్రికెట్ చూడటం ఒక అలవాటుగా వ్యసనంగా మారింది. ఇక ప్రత్యేకంగా యువత గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. 
ఇటీవల RCB ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే దాని యొక్క విజయోత్సవ ర్యాలీలో లెక్కకు మించి జనం రావడంతో దాదాపు 15 మంది ఆ తొక్కిసలాటలో మరణించడం జరిగింది. నిజానికి ఈ విజయోత్సవ ర్యాలీకి అక్కడి ప్రభుత్వం మహా అయితే ఒక లక్ష మంది వస్తారనుకున్నారు కానీ అక్కడ శృతిమించి దాదాపు మూడు లక్షల మందికి పైగానే జనాలు గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అసలు వీళ్ళకు ఇంత పిచ్చి రావడానికి కారణం ఏమిటి. జనాలు ఎందుకు క్రికెట్ ను ఇంతగా ఆరాధిస్తున్నారు. మిగతా ఏ క్రీడకు లేని పేరు ప్రఖ్యాతలు క్రికెట్కు మాత్రమే ఎందుకు దక్కాయి. జనాలు కూడా క్రికెటర్లను తమ దైవాలుగా ఎందుకు ఆరాధిస్తున్నారు. దేశంలో ఇతర క్రీడలైన Badminton కబడ్డీ హాకీ ఫుట్బాల్ వంటి క్రీడలకు లేని ఆదరణ క్రికెట్కు మాత్రమే ఎందుకు దక్కింది. అసలు ప్రపంచంలో అత్యధిక మంది జనాలు వీక్షించే క్రీడ అయిన ఫుట్బాల్nu కూడా మైమరిపించి మన భారతీయులు ఎందుకు తమ నెంబర్ వన్ ఛాయిస్ గా ఎంచుకుంటున్నారు ఇటువంటి అంశాలన్నింటినీ ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం. 

ఆట విధానం చాలా సులభంగా ఉండడం:-
The gameplay is very easy:-


నిజానికి Cricket కు మిగతా ఆటలకు గల పోలికలను తేడాలను గమనిస్తే మిగతా ఆటలకు కొంత డబ్బు మరియు కొన్ని రకాలైన నాణ్యమైన స్టేడియాలు, నాణ్యత కలిగి ఉన్న పరికరాలు, కొన్ని సేఫ్టీలు, నున్నటి తలాలు అవసరమవుతాయి. కానీ క్రికెట్కు మాత్రం అలాంటి నాణ్యత కలిగిన స్టేడియాలు, పరికరాలు, వంటివి అంతగా అవసరం లేదు. అంతేకాకుండా అంత సేఫ్టీ పరంగా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కర్ర కూడా బ్యాట్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక పది రూపాయలకు ఒక ప్లాస్టిక్ బాల్ కూడా వస్తుంది. మన వీధిలో ఖాళీగా ఉండే ఒక ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నా కూడా సరదాగా Cricket ను  ఆడేయవచ్చు. 
ఇక్కడ క్రికెట్ ఆడే దానికి ఎక్కడో రోడ్లపైన చిన్న చిన్న ఇంటి ఆవరణలో కూడా చిన్న ప్లాస్టిక్ బ్యాట్లతో కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా ఆడుతూ ఉంటారు. అంతే కాకుండా చిన్న పిల్లలు సరదాగా తల్లిదండ్రులతో కూడా ఈ ఆటను ఆడవచ్చు. ఇలా చిన్న పిల్లల నుండి పిల్లలకు ఒక బ్యాటరీ కొనివ్వడం తల్లిదండ్రులు కూడా ఒక అలవాటుగా మార్చారు. అంతేకాకుండా స్కూల్స్ కాలేజీల్లో కూడా సాయంత్రం పిఈటి పీరియడ్లో సరదాగా క్రికెట్ ను ఆడిపిస్తున్నారు. ఇలా సరదాగా ఆడే క్రికెట్ వాళ్లకు ఒక వ్యాపకంగా మారి ఇంటర్నేషనల్ క్రికెట్ పై ఆసక్తిని మరింతగా దగ్గరపరిచింది. 
ఇలా క్రికెట్ అంటే ఎక్కువ అభిమానంతో మిగతా క్రీడలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంతే కాకుండా ఇదే సమయాల్లో మిగతా క్రీడలకు కొన్ని రకాలైన వసతులు సౌకర్యాలు భారత్ లో అందుబాటులో లేవు. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే ఫుట్బాల్ నే చూసుకుంటే ఫుట్బాల్ ను ఆడాలంటే చాలా నాణ్యమైన స్టేడియాలు అవసరం. ఇంకా అలాగే బేస్ బాల్ , వాలి బాల్ వంటి ఆటలకు కూడా ఇలాంటి వసతులే అవసరం.
Also read: -శుభమన్ గిల్ బ్యాటింగ్ గొప్పతనం   
భారతదేశం  మొదటి నుంచి కూడా ఎక్కువ జనాభాతో సతమతమవుతూ పేదరికంతో ఉన్నది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వీటిపై పెద్దగా ధ్యాస పెట్టలేదు. దీనివల్ల కూడా ఎంతో సింపుల్ గా ఉండే ఒక కర్ర పది రూపాయల బాల్ సహాయంతో సరదాగా ఆడడం ఒక అలవాటుగా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా కబడ్డీ  రెజ్లింగ్ బాక్సింగ్ వంటి క్రీడలతో పోలిస్తే క్రికెట్ లో గాయాలు కొద్దిగా తక్కువనే చెప్పవచ్చు. దీనివల్ల కూడా ఎక్కువమంది క్రికెట్ వైపు మల్లారు. ఇక రెండవది

ప్రభుత్వాలు ప్రోత్సహించడం:-
Governments encourage:-

image credit getty images 
ప్రస్తుతం ప్రపంచంలోనే ఐసీసీ కి అత్యధికమైన క్రికెట్ ఆదాయం వస్తున్న దేశం ఇండియా. ఒక విధంగా చెప్పాలంటే ఐసీసీకి వస్తున్న ఆదాయంలో దాదాపు 60% ఆదాయం కేవలం ఒక్క ఇండియా నుండి మాత్రమే వస్తున్నది. ప్రస్తుతం క్రికెట్ ఆడే దేశాలు కూడా తరచూ టీమ్ ఇండియాతో మ్యాచులు ఆడేందుకు ఇష్టపడుతున్నాయి.
 అందుకు గల ప్రధాన కారణం క్రికెట్ ఆడే దేశాలు అన్నింటిలోకెల్లా అత్యధిక మంది జనాభా గల దేశం ఇండియా మాత్రమే. అందువల్ల ఏదైనా ఒక మ్యాచ్ జరుగుతుందంటే వీలైనంత ఎక్కువ మంది  అభిమానులు  క్రికెట్ చూసేందుకు ఆసక్తి చూపడంతో ఆ యొక్క దేశాల క్రికెట్ బోర్డులకు కూడా ఆదాయం వస్తున్నది. అంతేకాకుండా ఆన్లైన్లో యాడ్సెన్స్ మరియు వివిధ చానల్స్ ప్రసారాలలో కూడా అత్యధిక మంది క్రికెట్ ను వీక్షించేది భారతీయులే. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందంటే ఇక ఆరోజు ఐసీసీకి పండుగ అని చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే ఈ విధంగా విధంగా క్రికెట్ కమర్షియల్ గా మారడంతో అందుకు అనుగుణంగానే భారత ప్రభుత్వం కూడా క్రికెట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్నది. గ్రామాలు పట్టణాలలో ఉండే యువ క్రికెటర్లను ఎప్పటికప్పుడు సాన పట్టడానికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నది.
అంతేకాకుండా దేశ వాలి స్థాయిలో ప్రతి సంవత్సరం Vijay Hazare Trophy, Ranji Trophy, సి కె నాయుడు ట్రోఫీ వంటి వివిధ రకాల పేర్లతో  దేశవాళీ క్రికెట్ ను మరింత ముందుకు తీసుకు వెళుతూ భారత ప్రభుత్వం కూడా BCCI అనే బోర్డు సహాయంతో వీటిని నిర్వహిస్తూ వస్తున్నది. వీటివల్ల గ్రామీణం మరియు పట్టణాలు నగరాల్లో ఉండే క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికితీయుటలో ఈ విధమైన ట్రోపీలను నిర్వహించడంలోనూ BCCI ఎంతో పేరు సంపాదించుకున్నది.
 అంతేకాకుండా ఐసీసీని తలదన్నే విధంగా ఐసీసీ ని మించిన ఆదాయాన్ని సంపాదిస్తూ క్రికెట్ ను మరిన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఈ విధంగా BCCI చేపట్టే చర్యల వల్ల కూడా భారతదేశంలో క్రికెట్ అనేది ఉన్నత స్థానంలో ఉందని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా తరచూ ప్రతి నెలలో దేశవాళి, ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ మ్యాచులు జరుగుతూనే ఉంటాయి ఉంటాయి. అందువల్ల మిగతా క్రీడలతో పోలిస్తే క్రికెట్ అనేది కాస్త భిన్నంగా తయారయ్యి సగటు అభిమానులను తన వైపు తిప్పుకుంటున్నది. ఇదే మిగతా క్రీడలతో పోలిస్తే వాటిలో మ్యాచులు జరగడం చాలా అరుదైన అంశం ప్రస్తుతం మన దేశంలో ఒక్క క్రికెట్లో మాత్రమే ప్రతి సీజన్ లోని మ్యాచ్లు జరుగుతుంటాయి. ఇక మిగతా క్రీడల్లో ఇంతటి ప్రోత్సాహం గవర్నమెంట్ నుండి అందడం లేదనే చెప్పాలి. ఇది కూడా భారతదేశంలో అత్యధిక మంది క్రికెట్ వైపు మల్లడానికి ఒక విధమైన కారణం అని చెప్పవచ్చు.
మూడవది 

ఇండియన్ ప్రీమియర్ లీగ్:-
Indian Premier League:-

భారతదేశంలో 2008లో ప్రవేశపెట్టబడిన Indian Premier Leagueఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నది.
image credit: -getty images)rcb kohli 
ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ దాదాపు లక్ష కోట్ల పై మాటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఐపీఎల్ ను ఏ విధంగా ఆదరిస్తున్నారో. అంతేకాకుండా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు సాయంత్రం ఏడున్నర సమయానికల్లా అందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్ చూడడం ఒక వ్యసనంగా మార్చుకున్నారు. ఇది రాను రాను ఒక అలవాటుగా కూడా గత పది సంవత్సరాల నుండి ఇదే ట్రెండు కొనసాగుతున్నది. అంతేకాకుండా ఐపీఎల్ వేలంలో వివిధ రకాల క్రీడాకారులు ఆయా జట్ల ఓనర్లు భారీ సొమ్ముకు వెచ్చించి కొనడం కూడా యువతను ప్రభావితం చేస్తున్నది.
 ఈ IPL వల్ల చాలామంది యువత కౌమార దశ నుండే క్రికెట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ IPL ఆడేందుకు IPL లో అమ్ముడు పోయేందుకు తెగ శ్రమించేస్తున్నారు. ఒకవేళ ఈ ఐపీఎల్లో వారే గనక అమ్ముడుపోతే వారి జీవితం నట్లే. అందువల్ల ఎక్కువమంది క్రికెట్కు బానిసలు అయిపోతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క IPL వల్ల భారత ప్రభుత్వానికి కూడా విపరీతమైన ఆదాయం వస్తున్నది. దీనివల్ల ప్రభుత్వం కూడా దీన్ని మరింత విధంగా ప్రోత్సహిస్తూ వస్తున్నది. దీంతో 2008లో ప్రారంభమైన ఐపీఎల్ వ్యాల్యూ కంటే ఇప్పుడు దాదాపు 100 రెట్ల వ్యాల్యూకు ఇప్పుడు చేరింది.
దీనివల్ల భారత దేశంలో అటు బీసీ సీఐ కి ఇటు  రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భారీ లాభాలు వస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కూడా ఈ ఐపిఎల్ ను మరింతగా ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఈ ఐపిఎల్ ను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాల తరఫున లీగ్లను నిర్వహిస్తూ వస్తున్నాయి. అందుకు ఉదాహరణగా కర్ణాటకలో కర్ణాటక ప్రీమియర్ లీగ్, తమిళనాడులో తమిళనాడు ప్రీమియర్ లీగ్ లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ విధంగా వీటిని చూసి కూడా యువత క్రికెట్కు బానిసలు అవుతున్నారు అందువల్లే భారత దేశంలో క్రికెట్కు మరింత ఎక్కువగా క్రేజ్ ఉందని కూడా ఒక విధంగా చెప్పవచ్చు.నాలుగవది

 స్టార్ క్రికెటర్ల హవా :-
Star cricketers' mood:--

నేటి తరంలో
Dhoni image credit getty images) 
ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ టాప్ టెన్ ఆటగాళ్లలో ఐదు మంది భారత క్రికెట్లు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్లను కలిగి ఉన్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, గంగోలి, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, అనిల్ కుంబ్లీ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, బూమ్రా వంటి ప్రధాన ఆటగాళ్లంతా భారత క్రికెటర్ లే కావడంతో వారిని ఆరాధించే వారు కూడా ఎక్కువయ్యారు.
 ఇక్కడ మీరు ఇంతగా పాపులర్ రావడానికి కూడా మరొక కారణం భారతదేశంలో క్రికెట్ తో పోలిస్తే మిగతా క్రీడల్లో అంతగా చెప్పుకోదగ్గ ప్రధానమైన క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం. ఇది కూడా భారత  క్రికెట్ కు ఎక్కువమంది అభిమానులు రావడానికి పాపులర్ రావడానికి కారణమని కూడా చెప్పవచ్చు. గతంలో ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఆస్ట్రేలియా క్రికెట్ ప్రస్తుతం వారి యొక్క హవా కొద్దిగా తగ్గడంతో ఆ స్థానంలో ఇప్పుడు టీమిండియా పయనిస్తున్నది. ప్రస్తుతం ఐసీసీ యొక్క టీం పరంగాను ప్లేయర్స్ పరంగాను ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో అత్యధిక మంది టీం ఇండియా వారే ఇది కూడా భారత్లో క్రికెట్ హవా కొనసాగడానికి ఒక కారణం అని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఐపీఎల్ వల్ల ప్రాంచైజీ క్రికెట్ తో ఆయా టీంల యొక్క ఆటగాళ్లకు వారి ప్రతిభ ఆధారంగా వారికి అభిమానులు మరింత దగ్గరవుతూ అభిమానిస్తూ వస్తున్నారు. ఈ విధంగానే ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీకి, విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు భారతదేశంలో అత్యధిక మంది అభిమానులుగా మారారు. వీరు వారికి అభిమానులతో పాటు ఆయా టీంల యొక్క నమ్మకాలను నిలబెడుతూ అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు. అంతేకాకుండా క్రికెటర్లు ఆడేటప్పుడు నెలకొల్పే రికార్డులు కూడా వారికి అభిమానులను సంపాదించి పెడుతూ ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకుంటున్నారు. దీనిలో మరొక మెలిక ఏమిటంటే ప్రపంచంలో అత్యంత గొప్ప రికార్డులన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో భారత క్రికెటర్లయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ధోని వంటి ఆటగాళ్ల పేర్ల పైనే ఉండటంతో ఎక్కువ మంది భారత క్రికెట్ వైపు మల్లుతూ మరింతగా పాపులర్ చేస్తున్నారు. ఇక్కడ మిగతా  ప్రపంచ స్థాయి రికార్డులను నెలకొల్పిన వారు చాలా తక్కువ అని చెప్పాలి. అందువల్ల కూడా భారత్లో క్రికెట్ అనేది మరింతగా పేరు పొందింది.ఐదవది 

క్రికెట్ ట్రోపీలు (Cricket trophys):-

మొదటగా 1983 క్రికెట్ వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియాకు ప్రపంచం మొత్తం తో పాటు భారత్ లోను విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ ప్రపంచ కప్ లో జింబాబ్వే పై 17 పరుగులకే ఐదు వికెట్లు పడిన స్థితిలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 125 బంతుల్లో 175 పరుగులు చేయడంతో అప్పట్లో కపిల్ దేవ్ పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. అప్పుడు కపిల్ దేవ్ చేసిన బ్యాటింగ్  ఇప్పటివరకు కూడా ఎవరు చేయలేకపోయారు. నిజంగా అప్పుడు కపిల్ దేవ్ ఆడిన ఆట ఇప్పటికి కూడా ఎంతోమంది మదిలో మెదులుతూ ఉంటుంది. kapilldev getty images) 
అప్పటి కపిల్ దేవ్ ఇన్నింగ్స్ ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ ఇన్నింగ్స్ గా ఐసీసీ ప్రకటించింది. అంతేకాకుండా ఒక సాధారణంగా ప్రస్తుతం చూస్తున్న జింబాబ్వే నెదర్లాండ్స్ వంటి టీం లాగా ఉన్న టీమ్ ఇండియాను అరవీర భయంకరంగా మార్చి ఎవరు ఊహించని విధంగా అత్యంత బలమైన బ్యాటింగ్ ఉన్న వెస్టిండీస్ ను ఢీ కొట్టి ప్రపంచకప్ గెలవడంతో భారత క్రికెట్ ఆదరణకు అది మొదటి మెట్టని చెప్పవచ్చు. ఆ తర్వాత 20 సంవత్సరాల్లో పెద్దగా ఐసీసీ ట్రోపీలు రాకున్నా ఒక విధమైన ఆటతో ప్రేక్షకుల మద్దతును సంపాదించుకున్నది. ఆ తర్వాత Sachin టెండూల్కర్ బ్యాట్ తో అదరగొట్టడంతో ప్రపంచ క్రికెట్ తో పాటు భారత క్రికెట్ అభిమానులు కూడా మరింతగా తయారయ్యారు. ఆ తర్వాత గంగోలి కెప్టెన్సీలో 2002లో ఛాంపియన్ ట్రోఫీ గెలవడం 2003 వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్ చేరడం వంటి విజయాలతో భారత్ క్రికెట్ మరింతగా ఉన్నతంగా తయారైంది.

ఆ తర్వాత 2007లో Dhoni నాయకత్వాన టి20 వరల్డ్ కప్ సాధించడం వల్ల క్రికెట్ అభిమానులు మరింతగా ఎక్కువయ్యారు. వెంటనే 2011లో లో వన్డే వరల్డ్ కప్ ను మరలా Dhoni నాయకత్వాన సగర్వంగా గెలుచుకోవడంతో ఇక భారత్ క్రికెట్ ప్రస్థానం ఎదురులేని విధంగా తయారయింది. ధోని కెప్టెన్సీ వల్ల భారత అభిమానులు ఇక మరింతగా క్రికెట్కు చేరువయ్యారనే చెప్పవచ్చు.2013లో ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్ ట్రోపి నీ కూడా సగర్వంగా గెలుపొందడం వల్ల భారత క్రికెట్ ను ఆరాధించేవారు ఎక్కువైపోయారు. ఇక అప్పటినుండి ప్రతి ట్రోఫీలోనూ భారత్ కచ్చితంగా ట్రోఫీ సాధిస్తుంది అన్న నమ్మకంతో టోర్నీలో పాల్గొంటూ వస్తున్నది. కానీ కొన్ని దురదృష్టాలతో సెమీ ఫైనల్ లోని ఓడిపోతున్న భారత ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డులతో భారత క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లారు విరాట్ కోహ్లీ.2016 లో ధోని కెప్టెన్సీ తర్వాత విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టడంతో ఇక ప్రతి సిరీస్ లోను టీమిండియా కు విజయాన్ని ఒక అలవాటుగా మార్చాడు దీంతో భారత క్రికెట్కు 100 మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ సాధారణ టోర్నీలో రాణించిన ఐసీసీ ట్రోఫీలో మాత్రం ఫైనల్ సెమీ ఫైనల్ లో కొన్ని రకాల కారణాలతో ఓటమి మూట కట్టుకోవాల్సి వచ్చింది. అయినా కూడా భారత క్రికెట్ ప్రస్థానం కి ఎక్కడ లోటు అనేది లేదనే చెప్పాలి. ఆ తర్వాత Rohit Sharma కెప్టెన్సీలో వరుసగా మూడు ఐసీసీ ట్రోపీలు ఫైనల్ చేరడం అందులో రెండు సాధించడం వల్ల భారత క్రికెట్ను ఇక చిరస్థాయిలోకి తీసుకువెళ్లాడు.

2024 లో టి20 వరల్డ్ కప్ 2025 లో ఛాంపియన్ ట్రోఫీ కప్పులను Rohit Sharma భారత్ గెలుచుకొని అభిమానుల మనసులను ఎంతగానో ఆకర్షించింది. అంతేకాకుండా 2023 వన్డే వరల్డ్ కప్ లోను ఫైనల్ వరకు కూడా ఓటమి అనేది లేకుండా భారతదేశ జైత్ర యాత్ర కొనసాగింది కొనసాగింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, Rohit Sharma నెలకొల్పిన రికార్డులు భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకర్షించడంతో  క్రికెట్ అంటే ఒక పిచ్చిగా యువత మారిపోయారు. ఆ పిచ్చే  India లో క్రికెట్కు నంబర్ వన్ స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఒక విధంగా భారత్లో క్రికెట్ పాపులర్ రావడానికి కారణం Sachin టెండుల్కర్ అయితే ఈ ప్రస్థానం ను మరింత ముందుకు తీసుకువెళ్లిన వారు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలనే చెప్పాలి. ఇక భారత్ లో క్రికెట్కు ఉన్న పిచ్చి ఎలాంటిదంటే రీసెంట్ గా 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ట్రోఫీ సాధించిన ఆర్ సి బి తన ర్యాలీలో 15 మంది మరణించారు అంటే. దేశంలో  క్రీకట్  ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఈ విజయోత్సవ ర్యాలీకి 50 వేల మంది వస్తారని అంచనా వేస్తే దాదాపు మూడు లక్షల మందికి పైగానే స్టేడియానికి గుమ్మిగూడడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా వారిని కంట్రోల్ చేయలేక పోయింది. భారత క్రికెట్ పిచ్చికి ఇది ఒక ప్రధాన ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవే కాకుండా ఇంకో ఎన్నో కారణాలు భారత్లో క్రికెట్ పాపులర్ రావడానికి ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పిన ఐదు కారణాలు ప్రధానమైనవి.


Resources 
My own thoughts 
Image:- unplace, getty images, freepik, -pexals 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !