Evidence that God exists
కొన్ని వందల సంవత్సరాల నుండి పూర్వికుల కాలం నుండి కూడా మన పెద్దలు God ఉన్నాడని నమ్ముతూ తమకు తోచిన విధంగా వివిధ ఆచరణీయ విధానాలలో God ని పూజించడం ఒక ఆనవాయితీగా ఆచారంగా కొనసాగుతున్నది. అలాగే దేవుడిని పూజించడం వల్ల తమ జీవితాలు మారతాయని తమలో మార్పులు వస్తాయని తాము ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని ఒక విధమైన నమ్మకంతో అత్యంత వినయంగా నేటికీ చాలామంది తమ యొక్క ఆచారాల్లో భాగంగా దేవుడిని సేవిస్తుంటారు.
అయితే ఈ మధ్యకాలంలో శాస్త్ర సాంకేతిక (scince and tecnology)రంగాలలో చాలా రకాలైన మార్పులు రావడంతో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధితో చాలామంది శాస్త్రవేత్తలు(scientists) మేధావులు దేవుడు లేడని దేవుడు ఉన్నాడన్నది విధమైన నమ్మకం మాత్రమేనని సైన్స్ (scince)పరంగా ఆలోచిస్తే దేవుడు ఉండడం అసాధ్యమని వారు చెబుతున్నారు.అలాగే దేవుడే గనక ఉంటే ఇప్పటి సరికొత్త టెక్నాలజీలు వంటివన్నీ సరికొత్త ఆవిష్కరణలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టే వారని వారి అభిప్రాయం. ఒకవేళ God ద్వారానే సృష్టి జరిగి ఉంటే నేటి సాంకేతిక విప్లవం(technology Revolution) , సరికొత్త సైన్స్ ఆవిష్కరణలకు కొన్ని వేల సంవత్సరాల ముందే బీజం ఎందుకు పడలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు మేధావులు చెప్పిన విషయాలను అటు ఉంచితే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కూడా కొందరు మేధావులు మైథాలజిస్టులు కొన్ని ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది.
God of Sri Krishna life story's
అలాగే మన చుట్టూ ఉన్న వాటిలో నా ఉద్దేశం ప్రకారం నేను గమనించిన కొన్ని అంశాలను బట్టి దేవుడు ఉన్నాడన్న భావనను సమర్ధించటంలో నేను గమనించిన కొన్ని అంశాలను ఇప్పుడు తెలియజేయడం జరుగుతున్నది. అటువంటి వాటిలో మొదటిది
1) అగ్గిలో దూకిన కాళ్లు కాలక పోవడం(Feet that jump into fire don't burn):-
సాధారణంగా నిప్పు అనేది ఏ ప్రాణి నైనా జీవంతో ఉన్న నిర్జీవంతో ఉన్న దహించి వేయడం దాని సహజ లక్షణం. కానీ నేను గమనించిన వాటిలో కొన్ని రకాల ఉత్సవాలు పండుగలలో చాలామంది నిప్పుల్లో తొక్కిన కూడా వారికి ఏమీ కాదు. అందుకు ఉదాహరణగా పీర్ల పండుగ(moharram festival) , బతుకమ్మ వంటి కొన్ని దేవతల ఉత్సవాలలో చాలామంది అలఓకగా అగ్గిలో నుంచి బయటకు వస్తారు. నిజానికి వారు సాధారణ సమయాల్లో అగ్గి అంటే చాలా భయపడతారు. కానీ ఆ సమయాల్లో ఆ దేవుడు దేవతల ఉత్సవాలలో దేవుడి కోసం ఉపవాసం ఉండడం వల్ల అత్యంత భక్తిశ్రద్ధలతో కరుణ హృదయంతో దేవుడిని పూజించడం వల్లే జ్వలించే నిప్పు కణం ను కూడా దేవుడి సహాయంతో దాటగలిగాము అని వారు జవాబు చెబుతారు. అలాగే వారు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కేవలం దేవుడి ఉత్సవాల సమయంలోనే ఇలా నిప్పుల కొలిమిని అవలీలగా దాటేయడం దేవుడు ఉన్నాడన్న వాదనకు బలం చేకూర్చే మొదట వాదన.God importance2)కొన్ని విధాలైన పూజ సమయాల్లో అప్పటికప్పుడు నృత్య ప్రదర్శన(folk dances in puja)
కొన్నిసార్లు దేవుడిని పూజిస్తున్న సందర్భాల్లో, సమయాల్లో, ఉత్సవాలు పండుగలలో అప్పటివరకు సాధారణంగా ఉన్న మనుషులు కూడా ఒక్కసారిగా దైవ సంబంధిత నృత్యాలు పాటలు ప్రదర్శించడం, సరికొత్త దైవ సంబంధ ఉగ్రరూపం దాల్చడం మరియు దేవుడి లాంటి స్వరంతో మాట్లాడడం తనకు తెలియని విషయాలు చూడనివి సంబంధం లేని విషయాలు కూడా 100% కరెక్ట్ గా చెప్పడం వినిపించడం చేసే విధానం బట్టి కూడా దేవుడు ఉన్నాడన్న నమ్మకం కలుగుతుంది.
Also read: -God ప్తె నమ్మకం కోల్పోయే కొన్ని moments అంతేకాకుండా వారి శరీరంలోకి దేవుడు ప్రవేశిస్తాడని ఆ సమయంలో దేవుడు ప్రవేశించడంతో నిజంగా తానే దేవుడనే భావనతో భక్తులను వారి వారి మార్గాల్లో వారి యొక్క కోరికలు నెరవేర్చుటకు మార్గం చూపించడం వంటివి చేస్తారు. సాక్షాత్తు దేవుడే మాట్లాడిన అనుభూతి ఆ సమయంలో కలుగుతుంది. ఒకవేళ దేవుడు లేకపోతే వారిలో అప్పటికప్పుడు ఆ విధమైన హావ భావాలు ఎందుకు వస్తున్నాయి.
వారి కంఠస్వరం లో మార్పు ఎందుకు వస్తుంది, అనే విషయం తేట తెల్లం అవుతుంది దీనికి కరెక్ట్ సమాధానం ఇప్పటికి కూడా ఎవరూ చెప్పలేకపోయారు అందువల్లే దేవుడు ఉన్నాడన్న వాదనకు బలం చేకూర్చే రెండవ ప్రతిపాదనగా భక్తుల శరీరంలోకి దైవం ప్రవేశించడంను చెప్పవచ్చు. మూడవది
God great opportunity 3)కొన్ని అద్భుతాలు దైవ దినల్లోనే సంభావించడం(Some miracles occur only on divine days'):---
కొన్ని రకాల పండుగలు ఉత్సవాల సమయాల్లో అదే రోజు ఆకాశంలో లేదా గుడి దగ్గర రాత్రి సమయాల్లో ఏదో మార్పు సంభవించడం మనం చాలా సార్లు గమనించే ఉంటాం వాటిని బట్టి కూడా దేవుడు ఉన్నాడు అన్న భావనను ఏకీభవించక తప్పదు. అటువంటి వాటికి ప్రధాన ఉదాహరణ ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి భక్తులకు కార్తిక మాసం చివర్లో సాక్షాత్తు అయ్యప్ప స్వాములవారే మకర జ్యోతి రూపంలో తమ భక్తులకు దర్శనం ఇస్తాడని నమ్మకం.
lists of hindhu gods అంతేకాకుండా ఖచ్చితంగా శబరిమల దగ్గర మకర జ్యోతి కనబడుతుంది. ఇంకా సిద్దేశ్వరం, తిరుపతి ఒంటికి క్షేత్రాల్లోనూ ఇలాంటి దైవ సంబంధ దర్శనాలు ఎన్నో కనిపిస్తాయి.
అంతేకాక కొన్ని పండగల్లో అదే రోజు కచ్చితంగా వర్షం కూడా పడుతుంది. ఆ వర్షం దేవుడు వల్లే కురిసిందని ప్రజల నమ్మకం. అన్ని రకాల గుడి సంబంధ కథలు నిర్మాణాల ద్వారా దైవం ఉన్నట్లు అనేక మార్గాల్లో చెప్పబడ్డాయి. అంతేకాక కొన్ని రకాల గుడి ప్రాంతాల్లో సూర్యకాంతి లోనికి పోకపోవడం
అక్కడ దేవుడి ఆజ్ఞతో అనేక సమస్యలకు పరిష్కారం చూపడం వంటివి కూడా దీనికి బలాన్ని చేర్చుతున్నాయి. నాలుగవది
4)తీవ్రవాతావరణ పరిస్థితులను తట్టుకోవడం(Withstand extreme weather Conditions):-
మన చుట్టూ ఉండే చాలా మంది తమ ఇష్టమైన దైవం కోసం అనేక దీక్షలు పాటిస్తారు. ఆ సమయంలో వారు ఎంతో వేడి తీవ్రమైన చలి పరిస్థితులను కూడా తట్టుకోగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు. ఆ విధమైన కెపాసిటీ శక్తి కేవలం దైవభక్తి వల్లే ఉందని చాలామంది అభిప్రాయం లేకపోతే అంతటి తీవ్ర వాతావరణ పరిస్థితులను వారు ఎలా తట్టుకోగలిగారన్న అనుమానం వస్తుంది.అంశం కు ప్రధాన ఉదాహరణ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్ష ఆచరించే భక్తులు విపరీత తీవ్రతలు ఉదయం నాలుగు గంటలకే చన్నీటి స్నానం చేయడం దైవ దీక్షలో ఉన్నప్పుడు శరీరం పై భాగంలో ఎలాంటి వస్త్రం లేకున్నా వారు చాలా తక్కువ శీతోష్ణస్థితి నీ తట్టుకోగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు.
Also read: -Indian Society లో 100 సంవత్సరాల నుండి ఒకేలా ఉన్నవి
అయితే కాకుండా వారికి ఆ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కలగవు. దీన్ని బట్టి కూడా దేవుడు ఉన్నాడన్న నిర్ణయానికి రావచ్చు. నిజానికి ఇలాంటి శీతోష్ణ స్థితిని దీక్షలోని వారు కాకుండా మిగతావారు అనుభవిస్తే వారిలో చాలా మందికి అనారోగ్య సమస్యలు కలగడం కాయం. ఐదవది
భూమి ఏర్పడడం(evolution of earth):-
సృష్టి ఆవిర్భావం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఏర్పడిందని చెబుతారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒకప్పుడు గ్రహాలు నక్షత్రాలు ఇతర సౌర సంబంధ సేకలాలు కలిసి ఉండేవని కార్యక్రమం గా పేలుడు సంభవించి ముక్కలు ముక్కలుగా విడిపోయాయి అని అబ్బే జార్జ్ లిమియేటర్ తన సిద్ధాంతం ద్వారా విశ్వ ఆవిర్భావ సిద్ధాంతమును బిగ్ బ్యాంక్ తీరి తో వివరించాడు.
ఒకవేళ ఈ సిద్ధాంతమే నిజం అనుకుంటే ఇలా మొక్కలు ముక్కలుగా విడిపోతే అవి కిందకు ఎందుకు పడవు లేక ఒకే చోటే ఉండాలి కానీ సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు, asteroids వంటివన్నీ ఒక క్రమ పద్ధతిలో ఆవిర్భవించేలా చలించేలా వాటికి కక్షలు మార్గాలు ఎలా వచ్చాయి? వర్ణం ఎలా వచ్చింది? అవి నిరంతరం దీర్ఘ వృత్తాకారంలో తిరుగుటకు గల ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది? ఇలాంటి అంశాలన్నింటినీ పరిశీలిస్తే మరల దేవుడున్నాడన్న నిజం తేట తెల్లం అవుతుంది.
ఇంకా జీవం ఆవిర్భవించడంలో మిగతా గ్రహాలలో లేని వాతావరణం జలవరణం వంటి ఇతర జీవసంబంధ గోళాలు జీవించుటకు అనుకూలమైన వాతావరణంలో భూమిపైనే ఉండటంతో మిగతా ఏ గ్రహాల్లోను ఉండకపోవడంతో ఇది దేవుడి సృష్టే అని కూడా చెప్పవచ్చు.
big bang theoryదీన్ని ఇంకొక ఉదాహరణతో చెబితే మనం ఒక గుండ్రని రాయిని పగలగొడితే అది క్రమరహితంగా వేరువేరు సైజు గల మొక్కలుగా విడిపోతుంది.
కానీ బిగ్ బ్యాంక్ సిద్ధాంతం ప్రకారం ఇదే నిజమైతే ఒకప్పుడు కలిసి ఉన్న విశ్వం ఎందుకు ఓకే క్రమ పద్ధతిలో నిర్మింపబడింది. ఇది ప్రశ్న దీనికి కూడా ఇప్పటివరకు ఎవరు ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు దీన్ని బట్టి కూడా దేవుడు ఉన్నాడన్న వాదనను శాస్త్రవేత్తలే సమర్ధించక తప్పేలా లేదు.
ఇక దేవుడు ఉన్నాడన్న బావనకు బలం చేకూర్చే మరో ఆధారం
వాస్తవ సమాచారం(true information) :-
కొందరు ఎల్లప్పుడూ దేవుడిని పూజిస్తూ ఉండేవారు మరియు దేవుడి యొక్క పూజా విధానాల్లో పాలుపంచుకునేవారు. మైథాలజీ లేదా దేవుడికి సంబంధించిన అన్ని రకాల జ్ఞానాలను అర్జించిన వారు. చెప్పేటటువంటి విషయాలు అనేవి చాలా సమయాల్లో చాలావరకు మన చుట్టుపక్కల నిజం అవడం మనం గమనించే ఉంటాం. అంతేకాకుండా 100% కచ్చితత్వంతో చెప్పగలిగి ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఇలా చెప్పే వారిలో నూటికి 80% మంది దేవుడు యొక్క సన్నిధిలో ఉండి దేవుడు యొక్క పూజా విధానాలను ఆచరణ విధానాలను ఎంతో నేర్పుతో భక్తితో తగిన నియమాలను ఆచరించే వారే. అంతేకాకుండా పురాతన కాలాల నుండి కూడా దేవుడిని ప్రార్థించే వారు దేవుడు యొక్క సేవకు తమ జీవితాన్ని అర్పించిన వారికి గ్రామాలలో రాజ్యాలలో చాలా ఉన్నతమైన స్థానం ఉండేది.
అంతేకాకుండా అప్పట్లోనే ఆరోజుల్లోనే రాజులు ,పండితులకు సాధ్యం కాని వాటిని కూడా ఇలా దేవుడిని నమ్ముతూ ఉండే, దేవుడు పూజకై తమ జీవితాన్ని అర్పించిన వారు పరిష్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ బట్టి కూడా దేవుడు ఉన్నాడన్న వాదనకు కొంత బలం చేకూర్చవచ్చు. లేకపోతే సాధారణ మనిషిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడో తనకు సంబంధం లేని విషయాలు తను చూడనటువంటి విషయాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం జ్ఞానం ఎలా వచ్చింది అన్నదే అసలు ప్రశ్న. దీన్ని మొత్తాన్ని మనం గమనిస్తే దేవుడు ఉన్నాడన్న వాదనకు ఒక విధమైన బలం చేకూర్చినట్లే అవుతుంది. ఇక తరువాతి అంశం
మానసిక ప్రశాంతత(Mental Health)
ప్రస్తుత ఊరుకు పరుగు జీవితంలో ప్రశాంతత అనేది చాలా ముఖ్యమైనదిగా అనేకమంది డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ నేటి కాలంలో ఈ మానసిక ప్రశాంతత కోసం ఎంతో ఖర్చుపెట్టినా ఎన్ని సౌకర్యాలు అవలంబించినా కానీ వారు అనుకున్న విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్టాటిస్ఫాక్షన్ చెందలేకపోతున్నారు. కానీ దైవ సన్నిధిలో ఉండి దేవుడి పూజకు తమ జీవితాలను అర్పించిన వారు దేవుడిపై అత్యంత వినయంగా పూజలు చేస్తూ గడిపేవారు చాలా వరకు అత్యంత అంతమైనా మానసిక ప్రశాంతత కలిగి ఉన్నారని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
కాకుండా మన రోజువారి జీవితంలో ఇళ్లలో మరియు వివిధ రకాల ప్రదేశాల్లో చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ దేవాలయాల ఆభరణాలు దేవుడి దగ్గర గల ఆవరణలో చాలావరకు మనసులు ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని, మనసుకు ఆనందింప జేసేలా దేవుడు సన్నిధి ఉండడం బట్టి కూడా కేవలం దేవాలయ ఆవరణలోనే మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల కూడా దేవుడు ఉన్నాడన్న భావనకు బలం చేకూర్చవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది సైకాలజిస్టులు మనసు అనేది స్థిరంగా ఒక ప్రత్యేక అంశంపై దృష్టి పెట్ట లేకపోతే మీ చుట్టూ ప్రక్కల ఉండే దేవాలయాలు మరియు దైవ సంబంధ ప్రదేశాలను దర్శించమని కూడా సలహాలు ఇస్తున్నారు అంటే దేవుడి సన్నిధి మనసును ఎంతో మారుస్తుందని కూడా అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా మనం ఒక ప్రయత్నంలో ఒక లక్ష్యం సాధించే క్రమంలో దేవుడి పైనే దృష్టి పెట్టి పూజలో నిమగ్నమైనట్టు మన ప్రయత్నంలో గనుక ఉంటే కచ్చితంగా దేవుడు నిజంగా సహకరించకపోయినా ఆ సమయంలో మన మనసు అనేది స్థిరంగా ఉండి విజయం వైపు నడిపిస్తుందని కూడా చాలామంది అభిప్రాయం. కంటే మనం దేవుడిపై ఒకనిష్టమైన దృష్టితో పూజ చేసినప్పుడు మన మనసులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది అందువల్ల విజయం కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా దేవుడు ఉన్నాడన్న భావనకు బలం చేకూర్చినట్లనే చెప్పాలి. ఇక తరువాతి అంశం
జీవిని సృష్టించడం(Creating a creatures)
నిజంగా ఈ భూమి మీద జరిగినటువంటి అద్భుతమైన దృశ్యం జీవిని సృష్టించడం అంటే వాతావరణ పరిస్థితులు జీవులకు అనుకూలంగా మార్చి జీవుడు వాటిని తట్టుకునే విధంగా వాటికి అవసరమైన విధంగా మార్చుకునే విసులుబాటులు కలిగించేలా వాటి శరీరాలను నిర్మించడం కేవలం దేవుడి దృష్టి వల్లే జరిగిందని చాలామంది శాస్త్రవేత్తల అభిప్రాయం .వాటికి ఇప్పటికీ కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు. ఉదాహరణకు మానవ శరీరాన్ని చూసుకుంటే మానవ శరీరంలోని ఒక్క చుక్క రక్తపు బొట్టు కృత్రిమంగా తయారు చేయాలంటే దాదాపు కొన్ని కోట్లు ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.
కానీ అదే రక్తం మనం తీసుకునే ఆహారం ద్వారా ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో కొన్ని రోజుల్లోనే తయారవుతుంది అంతేకాకుండా అది ఎంతో క్వాలిటీగా ఎంతో శక్తివంతంగానో ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం మానవుడిలో ఈ భూమ్మీద ఏ జీవికి లేనంత తెలివితేటలు పుట్టించడంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా తన జీవితాలను మార్చుకునే శక్తి సామర్థ్యాలను అందించడంలో దేవుడి పాత్ర గణనీయంగా ఉందనే చెప్పాలి. అంతేకాకుండా మానవ శరీరంలోని ప్రతి అవయవం ఒక్కో విధిని నిర్వర్తిస్తూ ఒక్కో విధమైన జ్ఞానవంత అవయవంగా తమ రోజువారి జీవితంలో ఉపయోగపడడం నిజంగా దేవుడు యొక్క గొప్పదనమని చెప్పాలి. అంతేకాకుండా మనలో చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది కోడి ముందా గుడ్డు ముందా అని కానీ దీనికి మైథాలజీ పరంగా ఆలోచిస్తే కోడే ఉందని చెబుతున్నారు. అది ఎలాగంటే కోడి గుడ్డులో ఉండే పై త్వచమైన కోడి గుడ్డు పెంకు అనేది ఒక్క కోడిలో తప్ప ఇంక ఎక్కడ తయారు కాదని గుర్తించడం వల్ల ముందు కోడి అన్న సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మొదటగా దేవుడే కోడి అనే జీవిని సృష్టించాడని కూడా చెప్పాలి.
ఇక్కడ మొదటగా దేవుడే కోడి అనే జీవిని సృష్టించడని కూడా చెప్పాలి. ఒకవేళ కోడి లేకపోతే గుడ్డు అనేది ఉండదు అలాగే గుడ్డును ఆవిర్భవించే విధంగా కోడి శరీరాన్ని నిర్మించడంలో దేవుడి పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. ఇక తరువాత ది
చరిత్రలో దేవుని ప్రస్తావన(Mention of God in History):-
మనం ప్రాచీన కాలం నుండి పురాణాల నుంచి కూడా దేవుడిని వివిధ రాజులు పండితులు ఋషులు పూజించడం, ప్రార్థించడం గమనించే ఉంటాం. ఒకవేళ దేవుడే గనక లేకపోతే వేల సంవత్సరాల నుండి వారు పూజలు ప్రార్థనలు ఎందుకు ఆచరిస్తున్నారన్న మనందరిలో మెదలాలి. అందువల్ల వీళ్లను దృష్టిలో ఉంచుకొని దేవుడు ఉన్నాడని చెప్పవచ్చు. వీళ్లంతా కూడా తమ జీవితం పరంగా ఎన్నో సమస్యలు ఉన్నా ఎన్నో బాధలు ఉన్నా కానీ వాటన్నింటినీ అనుభవించి దేవుడు పైనే దృష్టి పెట్టి మోక్షాన్ని పొందాలని అలా తీవ్రమైన తపస్సులు దీక్షలు ఆచరించారని కూడా మనం కొన్ని వందల సంవత్సరాల నుండి అనేక గ్రంథాలలో చదివే ఉంటాం.
అంతేకాకుండా భారతీయ రాజులలో కూడా అనేకమంది రాజులకు తమ రాత్రి వేళల్లో దేవుడు కలలోకి వచ్చి తమ పరిపాలన సంబంధమైన విషయాలు , సలహాలు, సూచనలు, ఇతర రాజులపై ఎలా గెలవాలి వంటి వాటికి సంబంధించిన అంశాలను తమకు దేవుడే చెప్పాడని కూడా వారు తమ ఆత్మ కథలో వెల్లడించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే శివాజీకి హైందవ ధర్మ పునరుద్ధరణ కొరకు కాలిక దేవి ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని ఇచ్చిందని కూడా చరిత్రలో చెప్పబడింది. అంతే కాకుండా తెనాలి రామకృష్ణుడు గొప్ప పండితుడిగా మారడంలో కూడా కాళికాదేవి కారణమని మనం అనేక కథల్లో చదివే ఉంటాం. అంతేకాకుండా విక్రమాదిత్యుడు, శాలివాహనుడు వంటి రాజులు కూడా ఈ దేవుడి అనుగ్రహం వల్లే గొప్ప స్థాయిలో ఉన్నామని వారి వారి గ్రంథాల్లో చెప్పడం జరిగింది వీటిని బట్టి కూడా దేవుడు ఉన్నాడన్న వాదనను బలంగా సమర్థించవచ్చు. ఇచ్చట నేను తెలిపిన అటువంటి అంశాలు అన్నీ నేను ఆలోచించి చెప్పినవే ఎవరిని ఉద్దేశించి మూఢనమ్మకాల వైపు మల్లమని చెప్పడానికి కాదు. ఇవి నా ఆలోచనలు మాత్రమే.
Resources
My own thoughts
Image credited:-
pexels, pexabay,
Edit: --thumbnailmaker
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి