India లో కనుమరుగైన top Things, systems

Invisible things in India 

మనం ఎంత గొప్పగా ఉన్నా ఎంత చేసినా చేయకపోయినా కాల గర్భంలో కనుమరుగవ్వాల్సిందే. లేదా కాలానికి తలవంచాల్సిందే, ఈ వాక్యం యొక్క అంతర్యం చదివిన ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది 1947 కన్నా ముందు భారతదేశంలో (
india) గిరిజనులు(Tribals)  సరికొత్త సమూహాలుగా తమ యొక్క ప్రత్యేక వేషధారణతో మరియు ఆ ప్రాంత ప్రజలు ఆ యొక్క ఆచారాల్లో భాగంగా సరికొత్త వేషధారణ నృత్యాలు ప్రదర్శించే వారు. 
కానీ నేటి కాలంలో అవన్నీ రానఉ రాను అంతమయ్యాయి. ఒకప్పుడు పల్లె ప్రజలు ప్రదర్శించే కళారూపాలైనటువంటి జానపద కళలు (folk arts)మన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాయి. కానీ నేడు అవన్నీ కనుమరుగయ్యి కనీసం అవి ఎలా ఉంటాయో కూడా తెలియని విధంగా నేటి యువత ఉంటున్నారు. అలాగే ఒకప్పుడు దేశంలో అత్యంత విలాసాలతో గొప్పగా బ్రతికినటువంటి బ్రాహ్మణులు(brahmins)  రాను రాను ప్రస్తుతం దేశంలో వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అంత  కాకుండా మునుపటి గౌరవం ఆధిపత్యం అటు ఉంచితే అసలు వారి హక్కుల కోసం వారు పోరాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది. 
ఈ బ్రాహ్మణులు ప్రస్తుతం వివాహాలు కొన్ని రకాల పండుగలలో అయినా కనబడుతూ ఉండడం వల్ల వారి యొక్క ఉనికి కొంతైనా ఉంది. కానీ మిగతా వ్యవస్థలో అప్పట్లో చాలా గొప్పగా ఉండి నేడు రాను రాను పూర్తిగా అంతమైన కొన్ని మంచి వ్యవస్థలు చెడు వ్యవస్థలు మరియు ప్రకృతి పర్యావరణపరంగా జరిగిన మార్పులు అంతరించిపోయిన జీవులు వంటి వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 1947 కన్నా ముందు ఉండి నేడు కనుమరుగైనటువంటి వాటిని అత్యంత వివరంగా ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఆనాటి జ్ఞాపకాలు మరలా ఒకసారి గుర్తు చేస్తూ అత్యంత కులం కుశంగా అప్పటి ప్రజల జీవితాలు, నేటి సమాజంలో వచ్చిన మార్పులు రాను రాను అవి ఎందుకు కనుమరుగయ్యాయి వంటి అంశాలను ఉదాహరణలతో సహా వివరంగా చెప్పడం జరిగింది. అటువంటి వాటిలో మొదటివి 

ఉమ్మడి కుటుంబాలు(Joint family's):-

ఒకప్పుడు గ్రామీణంలో Joint family's  అనేవి చాలా సర్వసాధారణంగా ఉండేవి. కానీ రాను రాను ఇవి ప్రస్తుతం జరుగుతున్న సమాజ మార్పులు, ఉరుకు పరుకు జీవితాలు, ఉపాధి కోసం బయటకు వెళ్లడం, మరియు వేరేచోట job రావడం, మరియు వారి యొక్క ప్రత్యేక enjoyment  కోసం తమ సొంత వారి నుండి వేరవుతున్నారు. దీనివల్ల ప్రాచీన కాలంలో ఎక్కువగా ఉండే Joint family's  ప్రస్తుతం చాలా వరకు అంతరించాయి అనే చెప్పాలి. 
ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించడం వల్ల సమాజంలో చాలావరకు నైతిక విలువలు(ethics)  కట్టుబాట్లు సమాచారం మరియు మనసుల మధ్య ఆత్మీయ భావాలు, పలకరింపులు మానసిక ప్రశాంతత ఆనందాలు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలి. ప్రధానంగా ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించడంతో నేడు చాలా మంది యువత తమకు మార్గం నిర్దేశం చేసే పెద్దవారు లేకపోవడం అయినా వారు తోడు లేకపోవడం వంటి కారణాల వల్ల తప్పటడుగులు వేస్తూ అనేక చెడు అలవాట్లకు వ్యసనాలకు దుర్భసనాలకు గురవుతున్నారు. 
ఒకప్పుడు ఉన్నటువంటి ఈ ఉమ్మడి కుటుంబాలు గ్రామీణంలో ప్రతిరోజు పండుగ వాతావరణం గా ఉండేది ఒకరికి ఒకరు తోడు ఉంటూ కష్టాల్లో ఆదుకునే తత్వం, పంట పొలాల్లో అందరూ కలిసిమెలిసి పనిచేయడం, రాత్రి వేళల్లో కబుర్లు చెప్పుకోవడం వంటి ఎన్నో ఆహ్లాదకరమైన జీవితాలను వీటి వల్ల అప్పట్లో అనుభవించేవారు కాలంలో టెక్నాలజీ ఎక్కువగా అభివృద్ధి చెందడంతో ఈ ఆత్మీయ పలకరింపులు వంటివన్నీ తగ్గి కేవలం యువత సెల్ ఫోన్స్, TV  ,Social media కు అడిక్ట్ అయి చాలా వరకు తమ జీవితాలను ఒత్తిడిలోకి నెట్టి వేసుకుంటున్నారు.
Family's, joint family's ,elders
  ప్రస్తుతం ఎవరూ లేరు మనల్ని ప్రశ్నించేవారు ఎవరున్నారు అన్న ఈజీ పాలసీతో చాలామంది యువత తమ జీవన ప్రయాణంలో దారి తప్పుతున్నారు.
అంతేకాకుండా ఒక విధంగా కొన్ని సర్వేల ప్రకారం నేడు joint  కుటుంబాలు విచ్చిన్నమవడం వల్లే దాదాపు 60% ఒత్తిడి సమస్యలు, మరియు 30% అక్రమ సంబంధాలు వంటివి చోటు చేసుకుంటున్నాయి అని కూడా ఒక సర్వే వెల్లడించింది. ప్రధానంగా చిన్నపిల్లలు ఒకప్పుడు పెద్దవారి దగ్గర ఎన్నో ఆహ్లాదకరమైన ఆనందింపజేసే కథలు పాటలు వింటూ ఎంతో ఆనందించేవారు .
కానీ నేడు అలాంటి అవకాశం చెప్పాలి కేవలం వారు సెల్ ఫోన్ మొబైల్స్ ని చూస్తూ వాటిని సర్వస్వం అనుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం వల్ల చాలామంది జీవితాల్లో ఆనందం, పరస్పర సహకారం, ఎక్కడున్నావ్ వంటివన్నీ నశించాయని ఇప్పటి తరంలో చాలామంది మేధావి వర్గం వాపోతున్నారు. ఇక ఇప్పట్లో కనుమరుగైన మరో ప్రధాన అంశం 
రేడియోలు(redios):-
ఒకప్పటి సమాజంలో 17వ శతాబ్దంలో మార్కోని రేడియోను కనిపెట్టడం అనేది ఆధునిక ప్రపంచం లో ఒక సంచలనంగా చెప్పబడింది. ఎలాంటి సదుపాయాలు లేని సమయంలో ఎక్కడో ప్రపంచంలో జరిగినటువంటి సమాచారాన్ని కూడా క్షణాల్లో తెలుసుకునే విసులుబాటు దీనివల్ల కలిగేది. దీంతో ఆ రోజుల్లో ఈ రేడియో వాడకం చాలా గొప్పగా చెప్పబడేది సాయంత్రం వేళల్లో ఈ రేడియోలో వచ్చే వార్తలు వినడం ఒక అలవాటుగా ఉండేది. 
కాలక్రమేణా టెక్నాలజీ మారడంతో ఇంటర్నెట్ విపరీతంగా అందుబాటులోకి రావడం వల్ల, సాంకేతికపరమైన సరికొత్త మొబైల్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయడం వల్ల, అందరూ మొబైల్ ఫోన్లకు, కలర్ టీవీ లకు ఆడిట్ అయ్యి రాను రాను ఈ రేడియోను వాడడం మానేశారు దీంతో రేడియోలు ప్రస్తుతం దాదాపు కనుమరుగయ్యాయని చెప్పాలి.
Redios, రేడియో వాడకం, radio
నేటి కాలంలో ఈ కలర్ టీవీలు, మొబైల్ ఫోన్ల వల్ల ఉపయోగాలు ఉన్న అంతే సంఖ్యలో అనర్ధాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నేటి కాలంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు వీటివల్లే వస్తున్నాయి. ప్రధానంగా కంటిచూపు మానసిక అనారోగ్య సమస్యలు వంటివి కలుగుతున్నాయి. కానీ రేడియో వినడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి అప్పట్లో చాలావరకు వారు బయటపడి జీవితాన్ని అనుభవించారనే చెప్పాలి. కానీ ఒకపక్క టెక్నాలజీ అభివృద్ధి చెందిందని ఆనందపడిన మరోపక్క టెక్నాలజీ వల్ల దుర్వినియోగాలు సమస్యలు కూడా అలాగే ఉన్నాయన్న దాన్ని మర్చిపోలేక పోతున్నారు. తర్వాత వ్యవస్థ 
పటేల్ పట్వారి వ్యవస్థ(patel patvary system) 
ఒకప్పటి సమాజంలో గ్రామీణంలో అప్పట్లో రాజుల క్రింద మరియు పరిపాలకుల క్రింద అధికారుల కింద వీరు పని చేస్తూ ప్రజల వద్ద నుండి ల్యాండ్ టాక్స్ను వసూలు చేసేవారు. వీరు అలా వసూలు చేసే ప్రక్రియలో రైతులను దోపిడీకి కూడా గురి చేసేవారు. అయితే కొందరు మాత్రం రైతులతో సామరస్యంగానే ఉంటూ వారి అభివృద్ధికి కూడా పాటుపడిన వారు ఉన్నారు. ఇక ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఇవి వంశపారంపర్యంగా ఒకే వంశానికి లభిస్తుందడం వల్ల మిగతా వారికి వీరి పైన వ్యతిరేకం ఏర్పడింది.
 దీనివల్ల రాను రాను ప్రజల్లో మార్పు రావడం వల్ల పాలకులు కూడా ఈ వ్యవస్థనుండే ప్రజలను విముక్తి చేసి ప్రతిభావంతులనే నియమించాలన్న ఒక సరికొత్త సిస్టం అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ని నేడు మనం చూస్తున్నాము. ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అనగా విఆర్వో సిస్టంలను ఈ పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న విమర్శలను పరిగణలోకి తీసుకొని జ్ఞానవంతులు ప్రతిభవంతులనే ఈ పదవుల్లో నియమించాలని వ్యవస్థలకు చెక్ పెట్టాలని పోటీ పరీక్షల నియామకం ద్వారా ప్రస్తుతం ఈ వీఆర్వోలను నియమిస్తున్నారు. ఇలా ఒకప్పుడు ఉన్నటువంటి ఈ పటేల్ పట్వారి వ్యవస్థ నేడు పూర్తిగా కనుమరుగిపోయింది. 
ఈ పటేల్ పట్వారి వ్యవస్థను మన తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా 1982లో ముఖ్యమంత్రిగా నియమించబడిన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు వీటిని రద్దు చేశారు. తర్వాత ఇతని ప్రాంతాల్లోనే మిగతా రాష్ట్ర నాయకుడు కూడా ఆలోచించి దేశం మొత్తం మీద ఈ సిస్టం రూపుమాపడం జరిగింది. ఇక ఇప్పుడు కనుమరుగైన మరో అంశం 

Also read :-బ్రిటన్ అగ్ర రాజ్య హోదా ఎలా కోల్పోయింది

జానపద కళలు Folk arts 

పల్లె ప్రజలు ప్రదర్శించే కళారూపాలని జానపద కళలు అంటారు ఈ జానపద కలలు అనేవి ఆ దేశం ఆ ప్రాంతం ఆ గ్రామం యొక్క మరియు సంస్కృతి ఆచారాలను దేశం మొత్తం ప్రతిబింబించడంలో ఎంతో తోడ్పడతాయి. ఒకప్పుడు ఉన్నటువంటి ఈ జానపద కళల్లో ప్రధానంగా ఉన్నవి తోలుబొమ్మలాటలు, యక్ష జ్ఞానం, హరి కథలు, బుర్ర కథలు, పులి వేషాలు , పగటి వేషాలు వంటివన్నీ  అప్పట్లో భారతదేశంలో చాలా ప్రముఖంగా చెప్పబడ్డాయి.
Folk arts, Tribals, Folk games, entertainment
కానీ కార్యక్రమంలో మారుతున్న సమాజ పరిస్థితులు టెక్నాలజీ అభివృద్ధి ప్రజల యొక్క తీరికలేని సమయాలు మీడియా అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుతం ఈ కళారూపాలను ప్రదర్శించే వారు చాలా వరకు కనుమరుగైపోయారనే చెప్పాలి.
 అంతేకాకుండా వారి యొక్క జీవనోపాధిగా ఉండే ఈ కళారూపాలు ప్రస్తుతం వారి జీవితం కూడా చాలా దుర్బలంగా తయారైందని చెప్పాలి. పైన చెప్పిన కళారూపాలలో తోలుబొమ్మలాటలు ఎక్స జ్ఞానం అనేవి ఇప్పుడు పూర్తిగా కనుమెరుగైపోయాయి. తోలుబొమ్మలాటలో ప్రధానంగా వివిధ రకాల బొమ్మలు ప్రదర్శిస్తూ చారిత్రక గాధలను అప్పట్లో ఆముదపు దీపాలు వెలుతురులలో రాత్రి మొత్తం ప్రదర్శించేవారు. ఈ ప్రదర్శనలో ప్రజలను కడుపుబ్బ నవ్వించడానికి మధ్యలో జుట్టు పోలిగాడు, బంగారు అక్క, కేటుగాడు వంటి పాత్రలు ప్రజల మనసుల్లో ఇప్పటికీ ఎంతో స్థానం సంపాదించాయనే చెప్పాలి. కానీ రాను రాను ఇవన్నీ కధల్లో చెప్పుకోవడానికి పరిమితమైపోయాయి. ఇక జక్కులవారు ప్రదర్శించే కళారూపాలైన ఎక్స జ్ఞానం కూడా భారతదేశ సంస్కృతిని  ప్రతిబింబించడంలో ఎంతో తోడ్పడుతుంది.
 కానీ నేడు ఈ యక్ష జ్ఞానం కూడా పూర్తిగా కనుమరుగయింది ఈ కలలు నమ్ముకొని జీవనోపాధి ఉన్న వారి జీవితాలు కూడా చాలా దుర్భరంగా మారిపోయాయి. ఇక ప్రస్తుతం కాస్త కొస్తే కొన్నిచోట్ల హరికథ బుర్రకథలు కొంత మనుగడ సాగిస్తున్నాయి. హరికథను ప్రధానంగా భారతదేశంలో అభివృద్ధి చేసిన ఘనత ఆదిభట్ల నారాయణదాసు గారికి దక్కింది. ప్రస్తుతం ఈ హరికథలు కూడా చాలా వరకు కనుమరుగయ్యి ఎక్కడో కొన్నిచోట్ల కొన్ని పండుగలలో ప్రదర్శిస్తున్నారు.
 ఇక బుర్ర కథను భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందించినా ఘనత నాజరుకు చెందుతుంది ఇతడిని బుర్రకథ పితామహుడుగా చెబుతారు. వంత పాడేటటువంటి ఈ బుర్రకథలు కూడా నేడు నేడు చాలా తక్కువ స్థాయిలోనే మనుగడలో ఉన్నాయి. అప్పుడు భారతదేశంలో ఎంతో ఉన్నతంగా ఉండి నేడు కర్మణికైన వాటిలో జానపద కళలు కూడా ప్రధానమైనవి ఇప్పటికైనా భారతదేశం తమ యొక్క చరిత్ర సంస్కృతి గొప్పదనాన్ని వ్యాపించాలంటే వీరికి సరైన ప్రోత్సాహకాలు అందించి వారి జీవితాలను మెరుగులు దిద్ది మరల ప్రోత్సహించాలని ఆశిద్దాం. ఇక ఇప్పుడు కనుమరుగైనటువంటి మరో ప్రధాన అంశం
శిల్పుల కళ నైపుణ్యం(The art of sculptor skills):-
ఒకప్పటి India యొక్క చరిత్ర సంస్కృతిని ప్రతి పంపించడానికి భారతదేశంలోని అనేక చారిత్రక కట్టడాలు వాటిపై చెక్కబడిన sculptor skills  కళారీతులు, కల నైపుణ్యాలు ప్రముఖంగా చెప్పబడినవి. రాజ పుత్రులు , విజయనగర సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం కాలాల్లో ఎంతోమంది శిల్పులు తమ యొక్క శిలా కలా నైపుణ్యాలతో రాతిని తలచి అందమైన శిల్పాలుగా రూపొందించడంలో ఎంతో పేరు పొందారు. రాతిని తెరిచి అందమైన విగ్రహాలు బొమ్మలుగా మార్చడంలో ఎన్నో రోజుల శ్రమ కూడా దాగి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో చెప్పబడిన ఏకశిలా ఆలయమైన వరంగల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం(ramappa temple కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఈ రామప్ప దేవాలయంలో రామప్ప అనే శిల్పి దాదాపు 40 సంవత్సరాలు శ్రమించి నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజుల్లోనే శిల్పకళా నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి కానీ నేటి కాలంలో మన శిల్పుల యొక్క  కళ నైపుణ్యాలు ప్రదర్శించేవారు చాలా వరకు కనుమరుగైపోయారు. అంతేకాకుండా నేటి కాలంలో ప్రత్యేక ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినా కానీ పూర్వ కాలంలోని శిల్పల యొక్క సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించలేకపోతున్నారు. ఇక ఇప్పుడు కనుమరుగైనటువంటి మరో అంశం

పోషకాలు కలిగినటువంటి ఆహారం(nutritionally  food) :-

ఒకప్పుడు ఒక పంట పండాలంటే చాలా సమయం పట్టేది అంతేకాకుండా ఎక్కువ శ్రమ ఎక్కువ కూలీలు అవసరం అంతేకాకుండా అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరమైన విత్తనాలు లేకపోవడంతో దిగుబడి కూడా అంత తక్కువనే చెప్పాలి. కానీ అప్పటికి ఇప్పటికీ పోల్చితే అప్పటి ఆహారం మాత్రం చాలా విధాలైన పోషకాలను కలిగి ఉండేది. అంతేకాకుండా అప్పుడు పండించేటటువంటి తృణధాన్యాలు(ceraels), ఆహార ధాన్యాలు(food grains) చాలా ఎక్కువ పోషకాలను కలిగి ప్రజలకు కూడా ఎంతో ఎక్కువ శక్తిని అందించేవి అందువల్ల వారు వ్యాధి నిరోధక శక్తిని కూడా కలిగి ఉండేవారు. 
కానీ నేటి కాలంలో కేవలం పంటలు పెరిగిన ఉత్పత్తి పెరిగిన ఎవరికి తింటున్నామనే కానీ వాటిలో పోషకాలు చాలా వరకు నశించిపోయాయి అంతేకాకుండా నేడు వ్యాధి నిరోధక శక్తి కూడా తినడం వల్ల నశిస్తూ వస్తున్నది పోలిస్తే ఇప్పటి పోషకాలు చాలా వరకు తగ్గిపోయాయి అందువల్లే నీటి కాలంలో బిపి, షుగర్ ,గ్యాస్ ట్యాబ్ ,అనేవి చాలా సర్వసాధారణమైపోయాయి. ఇక ఈ పోషకాల సంగతి పక్కన పెడితే కల్తీ కూడా ఇప్పటి కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. ఇక తర్వాతి అంశం 

గుర్రాలు ఎడ్లబండ్ల ప్రయాణం(Horse and bullock cart travels):-

ఒకప్పుడు ఎక్కడైనా దూరప్రాంతాలకు వెళ్లాలంటే నేటి కాలంలో ఉన్నటువంటి బస్సులు రైళ్లు విమానాలు అందుబాటులో ఉండేవి కాదు. అందువల్ల ఎక్కువగా అప్పట్లో ప్రజలు గుర్రాలు(horse) ఎడ్లబండ్లపై (bulls)ఆధారపడేవారు. వీటి వల్ల చాలా వరకు కాలుష్యం కూడా తగ్గుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇవి ఎంతో తోడ్పడుతుండేది. 
కేవలం ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడంలో కొంత సమయం లేటవుతుంది అన్న ఒక్క విషయం మినహాయించి ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా ఉల్లాసభరితంగా ఉండేవి. అంతేకాకుండా జంతువులకు కూడా మంచి గిరాకీ ఉండేది కానీ నేటి కాలంలో వచ్చిన టెక్నాలజీ(technology)  తో సరికొత్త ఆధునిక ట్రావెలర్స్ అందుబాటులోకి రావడంతో ఇవన్నీ కూడా చాలా వరకు కనుమరుగయ్యి ప్రస్తుతం కాస్త కోస్తా కొంత కొన్ని రకాల పల్లెటూర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. తరువాతి అంశం
అందమైన చేతిరాత(beautiful writing
ప్రతి ఒక్కరు పలకలు లేదా కొన్ని తాటాకులు చెక్కలు రాళ్లపైన ఇసుకలో రాతను ఎంతో వినయంగా ప్రాక్టీస్ చేసేవారు. కానీ రాను రాను నేడు పుస్తకాలు కొన్ని రకాలైనటువంటి పలకలు అందుబాటులోకి వచ్చిన ఇప్పటి ఇంటర్నెట్ యుగం వల్ల అప్పటిలాగా మంచి అందమైన చేతిరాతను రాయలేకపోతున్నారు ఇది కూడా నేటి కాలంలో మారి పోయిన వాటిలో ప్రధానంగా చెప్పవచ్చు. తరువాతి అంశం

భూస్వాములు, జమీందారులు(Landowners, landlord's):-

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక డబ్బు, సంపద కలిగి ఉన్న వారిని జమీందారులు(landlord)  అని, అత్యధిక భూములు కలిగి ఉన్న వారిని భూస్వాములు(land owners) అని అనేవారు. వీరి యొక్క ఆస్తులు పలుకుబడిని ఉపయోగించి అప్పటి పరిపాలకుల నుండి పటేల్ పట్వారిలు, టాక్స్(tax) వసూలు చేయి అధికారులుగా, గ్రామ పెద్దలుగా చలామణి అవుతూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేసేవారు. అంతేకాకుండా చాలా మంది పేదవారు, రైతులను తమ క్రింద బానిసలుగా మార్చుకునేవారు. 
కొందరైతే రైతుల యొక్క పెట్టుబడికి వడ్డీలను విపరీతంగా వసూలు చేస్తూ చివరికి వాళ్ళ భూములను కూడా అక్కడే ఉంచుకునేవారు వీటివల్లనే రాను రాను ప్రజల్లో మార్పులు వచ్చి భూస్వామి ఉద్యమాలు జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు దేశంలో విపరీతంగా వచ్చి ప్రస్తుతం ఈ వ్యవస్థలో దాదాపు నశించిపోయాయని చెప్పాలి. అంతేకాకుండా దేశంలో వచ్చినటువంటి భూస్వామ్య విధానాలు దున్నేవాడిదే భూమి వంటి చట్టాలు కనిష్ట భూ పరిమితి చట్టాలు వంటివన్నీ వీళ్లను ఎంతగానో ప్రభావితం చేశాయి. ప్రధానంగా అప్పటికాలంలో చెడుగా ఉండి ఇప్పుడు కనుమరుగైన వాటిలో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఇక తరువాతి అంశం

 రాబందులు(vultures) :-

ఒకప్పుడు India  లో రాబందులు అనేవి విపరీతంగా ఉండేవి. ఒక మనిషి మరణించిన తర్వాత అతడి యొక్క అంతిమ సంస్కారాల్లో ఈ రాబందులు కీలకమైన పాత్ర వహించేవి అంతేకాకుండా వివిధ రకాల పశువులు జీవులు మరణించిన తర్వాత వాటిని అవి ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి కాలుష్యం కాకుండా చూడడంలో ఇవి ఎంతగానో తోడ్పడుతుండేవి. కానీ రాను రాను ఫెర్టిలైజర్స్ కెమికల్స్ వల్ల డైక్లో క్లినిక్ రసాయన పదార్థం వల్ల రాబందులు(vultures)  ప్రస్తుతం చాలా వరకు నశించిపోయాయి.
Vultures, Vultures in India
వీటి మూలంగా ప్రస్తుతం వ్యవసాయ పంటలపై కొన్ని రకాల మిడతలు పంటలకు విఘాతం కలిగించే జంతువులు విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయానికి కొంత నష్టం కలిగిస్తున్నాయని చెప్పాలి. ఒకప్పుడు ఉన్నటువంటి రాబందులు(vultures)  ఈ కీటకాలు పంటలకు హాని చేసేటటువంటి జంతువులను ఆహారంగా తీసుకుంటూ రైతులకు ఎంతగానో ఉపయోగపడేవి. అంతేకాకుండా దహన సంస్కారాలకు కూడా ఇవి ఎంతో ఉపయోగపడేవి. కానీ నేడు ఇవి చాలా వరకు అంతరించాయనే చెప్పాలి 2006 లోనే ఇవి అంతరించిపోయాయని భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థ (Wildlife Conservation Society of Indian) ప్రకటించింది వీటి ఆశుకి కనక తెలిపితే వారికి విరాళం కూడా ప్రకటించింది

 రాచరికం(monarchy ) :-

ఒకప్పుడు దేశాన్ని వంశపారంపర్యంగా ఒకే వంశస్థులు ఒకే కుటుంబ సభ్యులు పరిపాలించడం అనవైతిగా ఉండేది. అంతేకాకుండా ఈ కాలాల్లో కొందరు మంచి పనులు చేస్తే కొందరు చెడ్డ పనులు చేస్తే ప్రజలకు విగాతం కూడా కలిగించిన వారు చాలామంది ఉన్నారు. కేవలం రాజ్యపాలన కాంక్షతో దేశాన్ని కూడా నాశనం చేసిన రాజులు ద్రోహులు కూడా అప్పట్లో ఎందరో ఉన్నారు.
Monarchy kings, Indian kings, famous kings
కానీ రాను రాను ప్రజల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రపంచంలో వచ్చిన విప్లవోద్యమాలు ప్రజాస్వామ్య పరిపాలన సిస్టమ్స్ మూలంగా ప్రస్తుతం భారతదేశంలో ఈ రాచరిక(Monarch) వ్యవస్థ పూర్తిగా కనుమరిగిందని చెప్పాలి. భారతదేశంలో రాచరిక వ్యవస్థను(Monarch)కనుమరుగు చేసిన వారిలో ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను చెప్పవచ్చు ఎందుకంటే అతడు ఆ రోజుల్లో స్వాతంత్రం తర్వాత ఉన్నటువంటి 562 స్వదేశీ రాచరిక వ్యవస్థలు దేశంలో విలీనం చేసి రాచరిక వ్యవస్థలకు  స్వస్తి చెప్పాడు. ఇక తరువాతి అంశం

Gone సంచుల వాడకం

నేడు ప్లాస్టిక్ అనేది ఎక్కడపడితే అక్కడ విపరీతంగా లభిస్తూ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న వాటిలో మొదటి స్థానంలో ఉంది. దీని వల్ల ప్రజల్లో కూడా చాలా రకాలైన అనారోగ్య సమస్యలు(health problems)  వస్తున్నాయి. ప్లాస్టిక్ ను మొదటిసారిగా లియో బేక్లాండ్ కనిపెట్టడంతో వస్తువులను సులభంగా తీసుకు వెళ్ళడానికి ప్రజలకు ఇది ఒక సులభ సూచకంగా చెప్పిన దీని వలన పర్యావరణానికి చాలా చెడు కలుగుతున్నది. ఒకప్పుడు అసలు ఈ ప్లాస్టిక్ (plastic) అనేది తెలిసేది కాదు వారు విస్తరాకులు అరిటాకులు కొన్ని రకాల పెద్ద సైజు ఆకులను ప్లేట్లుగా వాడేవారు. అలాగే గోనెసంచులను ఇప్పటి ప్లాస్టిక్ సంచల స్థానంలో ఉపయోగించడంతో కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉండేది అంతేకాకుండా వారి ఆరోగ్యాలు కూడా ఎంతో మెరుగు అవుతూ చాలా బాగుండేవి కానీ ప్రస్తుతం విపరీతమైన ప్లాస్టిక్(plastic)  వినియోగం దేశాన్ని కాలుష్య కోరల్లో ముంచి వేస్తున్నది. ఇక తర్వాతి అంశం

కల్తీ (Adulteration):-

నేడు కలియుగం అంటే కల్తీ(Adulteration)యుగంగా మారిపోయింది లేని పదార్థాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పాలి నేడు మార్కెట్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో ప్రజల ఆరోగ్యాలను, లెక్కచేయని దౌర్భాగ్యులు చాలా వేలల్లోనే ఉన్నారు. కేవలం లాభా పేక్ష కారణంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఒకప్పుడు ఈ కల్తీ (Adulteration)అనేది చాలా తక్కువ కాదు అసలు లేదనే చెప్పాలి ఆ రోజుల్లో కల్తీ(Adultetion)అంటే కూడా చాలామందికి తెలియదు. అందువల్లే అప్పట్లో ఆహార పదార్థాలు మార్కెట్లో(markets) షాపుల్లో కొన్న పదార్థాలు ఎంతో క్వాలిటీ గా ఉండి ఆరోగ్యవంతంగా ఉండేది కానీ నేడు కొన్నవి డూప్లికేట్ ప్రొడక్ట్స్ గా(duplicate products)  ఉండి ప్రజల జీవితాలు ఆరోగ్యాలను (healthy) చాలా వరకు నాశనం చేస్తున్నాయి.

ఈటెలు బల్లెలు బాణాలు (Spears, spears, arrow)

ఒకప్పుడు దేశంలో ఉండే పల్లెటూరి వాసులు ఎక్కువగా ఈటలు బాణాలను వేట మరియు రక్షణ పరంగా ఉపయోగించేవారు అసలు వీటిని ఉపయోగించే వారే చాలా తక్కువ అని చెప్పాలి. ఇవి రక్షణ పరంగా ఎంతో ఉపయోగపడేవి నేడు ఎక్కువగా పల్లెటూర్లలో గొడ్డలిని ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు యుద్ధాల్లో కూడా ఎక్కువగా ఈటలు బాణాలు, ఉపయోగించేవారు కానీ రాను రాను వస్తున్న మార్పులతో వీటికి పెట్టేసారు. వీటి వల్ల యుద్ధాలు జరిగినా మరణాలు అనేవి కొద్దిగా తక్కువనే చెప్పాలి. కానీ నేడు వస్తున్న ఆయుధాల మూలంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
తరువాత అంశం 

బానిసత్వం వెట్టి చాకిరి:-

 ఒకప్పుడు దేశంలో బానిసత్వం వెట్టి చాకిరి అనేవి చాలా ఎక్కువగా ఉండేవి కానీ రాను రాను కొన్ని రకాల సంస్కరణ వాదులు ఆవిర్భవించడం ఉంచడం మూలంగా నేడు వెట్టి చాకిరి బానిసత్వాలు చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పాలి. అంతేకాకుండా భారతదేశం తీసుకుని వచ్చిన వ్యక్తి చాకిరి బానిసత్వ నిరోధ చట్టాలు కూడా వీటికి ఎంతగానో తోడ్పడ్డాయి.
రికామెండేషన్ జాబులు(Recomendation job's):-
రాజుల వద్ద జాబులు సాధించాలంటే వారికి తెలిసిన వారు వారి సైన్యాధికారులు రెవెన్యూ అధికారులు వారి యొక్క బంధువులకే ఎక్కువగా జాబులని ఇచ్చేవారు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ప్రతిభా ఆధారంగా ప్రజలకు జాబులను కేటాయించేవారు. కానీ రాను రాను ఇప్పుడు వచ్చిన మార్పుల వల్ల పోటీ పరీక్షలు సిస్టం వల్ల జాబులకు చాలా వరకు చెల్లి సీటు అయింది. కానీ నేటి కాలంలో కూడా కొన్నిచోట్ల అవినీతి చర్యలతో ఈ రికమండేషన్ జాబులు కొనసాగుతున్నాయి అయినా దాదాపు ఈ రికమండేషన్ జాబులు అనేవి అంతరించాయనే చెప్పాలి. ఇక తరువాతి అంశం
గ్రామ్ ఫోన్(gram phone):-
17 శతాబ్దంలో అలెగ్జాండర్ గ్రహంబెల్ ఈ గ్రామ్ ఫోన్((gram phone)  కనిపెట్టడం వల్ల మొబైల్ వేస్తాను టెక్నాలజీ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకుని ఎక్కడ ఉన్నా సులభంగా తెలుసుకొని విసులుబాటు కలిగి ఉండేది. కానీ కార్యక్రమంలో సాంకేతిక ఆవిర్భావం వల్ల నేడు వచ్చిన మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడంతో ఇవి త్రాడుబలే ఉన్నటువంటి ఈ ఫోన్లను ప్రస్తుతం ఎక్కడో చాలా తక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు.  
ప్లేగు మసూచి పూర్తిగా నిర్మూలన:-
 ఒకప్పటి కాలంలో భారత దేశంలో ప్లేగు వ్యాధి మెసేజ్లు చాలా ఎక్కువగా ఉండేవి సరైన వ్యాక్సిన్లు సరైన టీకాలు అందుబాటులో లేకపోవడంతో ఈ జబ్బుల కారణంగా విపరీతంగా మరణాలు సంభవించేవి. ప్లేగు వ్యాధి వ్యాధి గుర్తుగానే హైదరాబాదులో చార్మినార్ నిర్మించారని కూడా కొందరి నమ్మకం. అంతేకాకుండా బ్రిటిష్ వారి కాలంలో వచ్చినటువంటి ప్లేగు వ్యాధి మూలంగా కొన్ని లక్షల మంది జనాలు మరణించారు. ప్లేగు వ్యాధి మూలంగా జనాలు విపరీతమైన అనారోగ్య సమస్యలకు గురై దిక్కు మొక్కు లేకుండా చాలా తీవ్రమైన బాధతో మరణించే విధంగా ఉండేది. కానీ నేడు దీనికి టీకా ఇది పూర్తిగా కనుమరిగిందని చెప్పాలి. 
ఇక మసూచి వ్యాధి కూడా ఆక్రొమోగాలి స్థితి అంటే గుడ్లగూబ ముఖంలో మనిషి మొఖం మారిపోవడంతో అంద విషయంగా కనబడుతూ సమాజ చిట్కారాలకు గురవుతూ మనిషి చాలా బాధను అనుభవించేవాడు. కానీ దీనికి ఎటువంటి ఎడ్వర్డ్ జర్నర్ వ్యాక్సిన్ కనుగొనడం మూలంగా నేడు పూర్తిగా కనుమరుగయింది భారతదేశంలో ఈ వ్యాధి నిర్మూలన 1996లోనే జరిగిపోయింది. ఇక తరువాతి అంశం
ఆకలి దారిథ్యం చాలావరకు నిర్మూలన(hunger and poverty) :-
ఒకప్పుడు దేశంలో ఆకలి దారిద్యం అనేవి చాలా విపరీతంగా ఉండేవి కొన్నిచోట్ల అయితే కేవలం రెండు పూటలే ఆహారం తింటూ ఒక పూట పస్తులు పనుకున్న వారు కూడా వేళల్లో ఉండేవారు. కానీ నేడు ఆ పరిస్థితి నుంచి భారతదేశం ముందుకు జరిగిందనే చెప్పాలి.1960 దశంలో వచ్చిన హరిత విప్లవం అంతేకాకుండా నేటి కాలంలో వచ్చిన సరికొత్త సంఖ్యల జాతి వంగడాలు టెక్నాలజీ విత్తనాలు ఆకలి(hunger)  నుంచి అనేకమంది భారతీయులను కాపాడాయి. ఇక పేదరికాన్ని(poverty)  నిర్మూలించడానికి భారతదేశంలో స్వాతంత్రం తరువాత ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం మూలంగా ప్రస్తుతం చాలా వరకు తగ్గిపోయింది. ఇవే కాకుండా ఇంకా భారతదేశంలో అప్పటికి ఇప్పటికీ రకాలైన మంచి చెడు వ్యవస్థలు కనుమరుగైపోయాయి. వీటిలో ఎన్నో ఉన్నా ఇప్పుడు చెప్పినవి ప్రధానమైనవి అని చెప్పవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !