History of Hitler main mistakes

Hitler main mistakes 
   20 వ శతాబ్దంలో ప్రపంచం చూసిన అతి పెద్ద  నియంత hitler. జర్మనీ దేశానికి చెందిన ఈ నియంత రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కొన్ని సంవత్సరాలపాటు ఏకంగా ప్రపంచం గడగడలాడించాడు. అప్పట్లో ప్రపంచ పెద్దన్నలుగా చెప్పుకొనే బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలకు మూడు చెరువుల నీళ్లు త్రాగించాడు. ఒక విధంగా చెప్పాలంటే అప్పటివరకు అగ్రరాజ్యంగా రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్న బ్రిటన్ ను అగ్ర రాజా హోదా నుంచి క్రిందకి దించేసిన ఘనత కూడా హిట్లర్కే దక్కిందని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. ప్రాథమికంగా హిట్ సాధించిన అతి పెద్ద ఘనాల్లో ఒకటిగా చెప్పుకునేది ,అప్పట్లో రెండవ అగ్రరాజ్యం అంటే బ్రిటన్ తర్వాత అత్యధిక వలస రాజ్యాలు కలిగి ఉన్న ఫ్రాన్స్ ను అయితే పూర్తిగా ఆక్రమించి దాన్ని చాలా వరకు ధ్వంసం చేశాడు. నిజానికి హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఒక సాధారణ సైనికుడు.
 ఆ సైనిక జీవితం తోనే జర్మనీలో తన మొదటి అడుగు పడింది. అలా సైనికుడిగా జీవితం మొదలుపెట్టిన అతను మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల చేతిలో జర్మనీ ఓడిపోవడంను జీర్ణించుకోలేకపోయాడు. అలాగే గెలిచిన దేశాలు అసలు యుద్ధానికి కారణం జర్మనీనే అని వర్సఈల్స్ సంధి అనే ఒప్పందం చేసి అసలే ఓటమి బాధలో ఉన్న జర్మనీని మరింతగా అవమానిస్తూ దారుణమైన ఆంక్షలు జర్మనీపై విధించారు. దీనితో జర్మన్ల మనసు మిగిలిన దేశాలపై ప్రతీకారంతో రగిలిపోయింది. ఆ ప్రతీకారం ఎంతలా అంటే మనం చచ్చినా పర్వాలేదు చచ్చే ముందు మనల్ని ఇంతలా బాధ పెట్టిన దేశాలు మనం అనుభవించిన బాధలు పడేలా చేసే చావాలని వాళ్ళు మనసు ప్రతీకారం అనే భావనతో రగిలిపోయింది.
  ఇలాంటి ప్రతీకారాన్ని ఆసరాగా చేసుకొని హిట్లర్ తన వాక్చాతుర్యం, పోరాట పటిమతో, సైనిక లక్షణాలతో రాజకీయ రంగ ప్రవేశం చేసి 1933 కెల్లా జర్మనీకి ఛాన్సులర్ అయ్యి 1936 కి తిరుగులేని నియంతగా మారి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీపై అవమానకర రీతిలో విధించిన వర్స ఈల్స్ సంధి ఒప్పంద పత్రాలను చింపేసి చెత్త బుట్టలో వేసేసాడు. ఆ తర్వాత జర్మన్ సైన్యం ను చాలా బలంగా మార్చి యుద్ధ సామాగ్రిని విపరీతంగా తయారు చేసి, పెంచేసి, కటోరమైన శిక్షణ ఇప్పించి మిగిలిన మిత్ర సామ్రాజ్యాల పై యుద్ధానికి కాలు దువాడు. ఇదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కోల్పోయిన జర్మనీ సైనిక శక్తిని అంతకుమించి రెండు ఇంతలు పెంచేసి చాలా బలిష్టంగా శత్రు దుర్వేద్యమైన శిక్షణతో కఠోరంగా మార్చి ఏరి కోరి మరి 1939లో పోలాండ్ పై దాడి చేసి రెండవ ప్రపంచ యుద్ధాన్ని తీసుకువచ్చాడు. ఆ తర్వాత 1943 వరకు కూడా హిట్లర్దే విజయం. ప్రపంచ విజేత నెంబర్ వన్ గా జర్మణి అవుతుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే హిట్లర్ సాధించిన విజయాలు అప్పట్లో అలా ఉన్నాయి.
 ఆ విధంగా 1919లో కోల్పోయిన జర్మనీ యొక్క పరువును 1943లో నిలబెట్టి జర్మన్ల దృష్టిలో గొప్ప హీరో అయ్యాడు. అలాంటి స్థితిలో ఉన్న జర్మనీ 1944 కి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది. హిట్లర్ చేసిన ప్రధానమైన తప్పులు ఏమిటి అనేవి ఈ ఆర్టికల్‌లో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం
 సోవియట్ యూనియన్ కు మిత్ర ద్రోహం
 చేయడం:- 

నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం మొదట్లో యు ఎస్ ఆర్ అనగా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కేంద్రం లేదా అక్షరాజ్యాల తరపున మొదటగా ఉండాలని నిర్ణయించుకున్నది. అందువల్ల జర్మనీతో మొదట హిట్లర్ తోను జర్మనీతో సన్నిహితంగానే మిగిలిపోయింది. కానీ హిట్లర్ సోవియట్ యూనియన్ ను నమ్మలేదు. అంతేకాదు తనతో స్నేహంగా ఉన్న సోవియట్ యూనియన్ కు మిత్ర ద్రోహం చేశాడు. ఈ మిత్ర ద్రోహం చేయడానికి కూడా మరో కారణం ఉంది. అది 1942లో యు ఎస్ ఆర్ వాతావరణ పరిస్థితులు, సరైన ఫోకస్ పెట్టె ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన ఒక యుద్ధంలో ఓడిపోవడంతో హిట్లర్ చాలా చిన్న చూపు చూడడం మొదలుపెట్టాడు. నిజానికి ఆ యుద్ధం పై సోవియట్ యూనియన్ తన పూర్తి పనిని ప్రయోగించలేదు. కానీ హిట్లర్ మాత్రం ఆ యుద్ధాన్ని ఆసరాగా చేసుకొని సోవియట్ యూనియన్ శక్తిని తప్పుగా అంచనా వేశాడు. అలా 1943 కి ఏకంగా సోయట్ యూనియన్ నే ఆక్రమించాలన్న ఆలోచనతో అనుకున్నదే తడవుగా ussr పైకి తన సైన్యాలను రంగంలోకి దింపాడు. ఇంకా ussr ప్రపంచంలో చాలా పెద్ద దేశం చాలా ఎక్కువ సహజ వనరులు ఉన్నాయి. దాన్ని గనక గెలిస్తే ప్రపంచంలో సగాన్ని గెలిచినట్లే అని భావించి తమ పేరు చరిత్రలో నిలుస్తుందని కూడా అతడు భావించాడు. ఇంకా మొదట సోవియట్ యూనియన్ ను గెలిచి తర్వాత మిగిలిన దేశాలు అంత చూద్దామనుకున్నాడు. ఎందుకంటే సోవియట్ యూనియన్ వద్ద చాలా రకాల టెక్నాలజీ ఆయుధాలు ఉన్నాయి వాటిని ఉపయోగించి ఆ తర్వాత మిగిలిన దేశాలతో యుద్ధానికి వెళదాం అతడు భావించి ఉంది. ఇలా అతడు భావించి తనకి సపోర్ట్ చేస్తున్నాడు కూడా నమ్మకద్రోహం చేస్తూ తన ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ఇక రెండవ కారణం
సోవియట్ యూనియన్‌ను తక్కువగా అంచనా వేయడం:-

1942లో యూఎస్ఎస్ఆర్ ఆఫ్గానిస్తాన్‌తో యుద్ధంలో పాల్గొని ఓడిపోవడంతో అంత చిన్న దేశం చేతిలో ఓడిపోయింది ఇక మనకెంతలో పని అనుకొని యుద్ధానికి పూర్తి సైన్యాన్ని కూడా పంపలేదు. ఒకవైపు బ్రిటన్ తో పోరాడుతూనే సగం బ్రిటన్ ను కంట్రోల్ చేయగలిగిన మిగిలిన సగం ఆక్రమించే అవకాశం ఉన్నా కూడా అదే సమయంలో రష్యాని కూడా ఆక్రమించాలన్న కోరికతో బ్రిటన్(Britain) తో యుద్ధంలో ఉన్న సగం సైన్యం సోవియట్ యూనియన్ పైకి కూడా పంపాడు. నిజానికి హిట్లర్(Hitler)  ఇక్కడే పప్పులో కాలు వేశాడు. సోవియట్ యూనియన్ ప్రపంచంలో చాలా పెద్ద దేశం. ఇప్పుడు అదే సోవియట్ యూనియన్ దాదాపు 14 దేశాలుగా విడిపోయింది. అంత పెద్ద విస్తీర్ణం గల దేశాన్ని అతడు చాలా తక్కువగా అంచనా వేస్తాడు. ఇక అదే సమయంలో యూఎస్ ఎస్ ఆర్ తెలివిగా అప్పటివరకు వాడని ప్రపంచానికి తెలియని తమ నిజమైన టెక్నాలజీ ఆయుధాలు చాలా తెలివిగా ఉపయోగించాయి. తమ దేశ భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని మొదట్లో ఓడిన కూడా తమ దేశ విస్తీర్ణత భౌగోళిక పరిస్థితులు వివిధ రకాల రవాణా అంశాలు మార్పిడి సహాయాలతో చివరికి నెగ్గింది. ఇక్కడే హిట్లర్ చాలా పెద్ద తప్పు చేశాడు అంత పెద్ద దేశం పైకి తన పూర్తి సైన్యాన్ని కూడా ఉపయోగించలేదు. అలాగే రష్యా యొక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా బోర్డులు మరియు అక్కడి పర్వతాలు కొండలు మైదానాలు వంటి అంశాలన్నీ జర్మనీ సైనికులు సరిగ్గా అంచనా వేయలేరు చాలా ఇబ్బందులు పడటంతో వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న సమయంలో సోవియట్ సైనికులు రహస్యంగా మెరుపు దాడులతో జర్మనీ సైన్యాన్ని ఘోరంగా ఓడించారు. ఇక తర్వాత మూడవది
 వాతావరణ పరిస్థితులు పట్టించుకోకపోవడం:-

నిజానికి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గొప్ప సైనిక శిక్షణ సామర్థ్యం గల సైన్యం జర్మనీది మాత్రమే. అందువల్లే అతను ప్రపంచం కూడా భయపెట్టగలిగే శక్తివంతమైన నిత కాగలిగాడు. అయితే ఎంతటి గొప్పవాడైన కాలం ప్రకృతికి లొంగక తప్పదు అన్న విషయం హిట్లర్ యుద్ధకాంక్షలో ఉండి మర్చిపోయాడు. సోవియట్ యూనియన్ పై మొదట దాడి చేసినప్పుడు చాలా భూభాగం ఆక్రమించాడు. కానీ అదే సమయంలో శీతాకాలం రావడంతో ప్రకృతి రూపంలో జర్మనీకి ఒక శత్రువు ఎదురైంది. ఆ సమయంలో రష్యా యొక్క ఉత్తర భాగం తీవ్రమైన మంచు అత్యల్ప శీతోష్ణస్థి తులు నమోదయ్యాయి. ఆ శీతోష్ణస్థితి పరిస్థితులను వర్ణ పరిస్థితులను జర్మనీ సైనికులు తట్టుకోలేకపోయారు. అదనంగా ఆ టెంపరేచర్ను తట్టుకునే దుస్తులు జర్మనీకి లేవు. తీరా వారు అక్కడికి ప్రవేశించగానే చాలా అనారోగ్యాలకు ఉన్నారు. దీంతో వారికి ఎన్ని సామర్థ్యాలు ఉన్నా అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఏం చేయలేకపోయారు. అదే సమయంలో సోవియట్ యూనియన్ ఎక్కడికక్కడ గోతులు తవ్వుతూ పంటలకు నిప్పంటించి వారికి ఆహారం అందకుండా చేశారు. అలాగే రవాణా సౌకర్యాలు కూడా వారికి అనుకూలించకుండా చేశారు. రష్యాలో ఉండే రైల్వే వ్యవస్థను కేవలం వారికి మాత్రమే ఉపయోగించే విధంగా అప్పట్లో ఏక మార్గంలోనే నిర్మించారు. దీనితో లోనికి ప్రవేశించిన జర్మన్ సైన్యానికి ఎటు వైపు వెళ్ళాలో దిక్కు తోచలేదు. దీంతో హిట్లర్ చేసిన ఈ తప్పు వల్ల జర్మనీకి ఓటమి తప్పలేదు. ఇక నాలుగవ కారణం
సైన్యాధికారుల మాటలు పట్టించుకోకపోవడం:-
ఏ దేశమైనా యుద్ధం చేయాలంటే ప్రధానమైన కారకులు ఆ దేశం యొక్క సైన్యాధికారులు వారి అడుగుజాడల్లోనే ఆ దేశం యొక్క సైన్యం ముందుకు సాగుతుంది. ఇక్కడ హిట్లర్ చేసిన మొదటి తప్పు సైన్యాధికారుల మాటలు పట్టించుకోలేదు. సోవియట్ యూనియన్ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు అనుకూలించవని కొంత సమయం ఆగి వేసవికాలం అవ్వగానే దాడి చేద్దామని చెప్పినా సైన్యాధికారుల మాటలు హిట్లర్ లెక్క చేయలేదు. అలాగే వారికి పూర్తి స్వాతంత్ర్యం తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు. దీంతో వారు పూర్తి స్వాతంత్రంతో యుద్ధం చేయలేకపోయారు. ఇంకా హిట్లర్ సైనికుని పరిస్థితిని వారి దీనావస్థలను అంచనా వేయలేక చేజేతుల ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ఇక తర్వాత మిస్టేక్
యూదులను చంపడం:-
హిట్లర్ చేసిన అతి పెద్ద తప్పు యూదులను చంపడం మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి వీరే కారణం అని భావించి వారిని ఎక్కడున్నా విపరీతంగా హింసిస్తూ. చంపేశారు. ఇతడు దాదాపు ఒక కోటిపైనే యూదులను అస్విడ్స్ యంత్రాల సహాయంతో చంపించాడని చరిత్రలో చెప్పబడింది. నిజానికి వారి జాతిలోనే ఎవరో చేసిన తప్పుకు వారి జాతి నంతటిని చంపడం ఎంతవరకు కరెక్ట్, ఇది నిజంగా హిట్లర్ చేసిన చాలా పాప వినాసికమైన చర్య, దీనివల్లే ప్రపంచం మొత్తం హిట్లర్ను ఒక నరరూప రాక్షసుడు లా చూసి అతని యొక్క శత్రు దేశాలు మిగిలిన దేశాల మద్దతును కూడగట్టుకున్నాయి. తర్వాత మిస్టేక్ జాత్యహంకారం:-
ప్రపంచంలో అతిపెద్ద అత్యున్నత జాతి తమదేనని జర్మనీలోని నాజీల క్రింద పాలించబడాలని అతడు బహిరంగంగానే ప్రకటించాడు.
అలాగే అతని యొక్క ఒక కొటేషన్ చూస్తే ఈ ప్రపంచంలో బలమైన జాతికి మిగిలిన జాతులను పాలించే ఆక్రమించే శక్తిని దేవుడు కల్పించాడని అందుకే ప్రపంచంలోని జాతులు నాజీల కింద ఉండాలన్న దురహంకారాన్ని ప్రదర్శించి ప్రపంచంలోనే మానవతావాదుల ఆగ్రహానికి ఉపయోగపడుతుంది. దీనితో చాలా దేశాలు జర్మనీకి వ్యతిరేకంగా మారాయి.
తర్వాత మిస్టేక్ 
మేధావుల సేవలు ఉపయోగించుకోక పోవడం
హిట్లర్ చేసిన దురహంకారం, మరియు యూదులపై చేసిన హత్యకాండలు వంటి ఉదంతాలు చూసి అప్పటివరకు జర్మనీలోనే ఉన్నా చాలా మంది మేధావులు శాస్త్రవేత్తలు జర్మనీ శత్రు దేశాలకు వెళ్లి తమ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రతిభను ఆ దేశాలకు దార పోశారు.

ఆ విధంగా హిట్లర్ బారి నుండి తప్పించుకోవడానికి జర్మనీని వదలి వెళ్లిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ (albert insteen). అటువంటి గొప్ప శాస్త్రవేత్తల intelligence  సేవలను నిజంగా గనుక వాడుకొని ఉంటే అతడు విజయాలను సాధించే వాడే. కానీ అతడు శాస్త్రవేత్తల యొక్క విజ్ఞానాలను తమ దేశ రక్షణ వ్యవస్థకు జోడించలేకపోయాడు దీని వల్ల కూడా హిట్లర్ తన ఓటమిని చేజేతులా కొని తెచ్చుకున్నాడని చెబుతారు. ఈ విధంగా హిట్లర్ చేసిన దమన కార్యాల వల్ల తమ సొంత దేశ మేధావులే హిట్లర్ ఓటమి చెందాలని కోరుకున్నారు. మిత్ర దేశాలకు కూడా తమ వంతు సాయలను అందించాలని కూడా కొందరి అభిప్రాయం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !