India లో ఒకప్పటి Food నేటి Food మధ్య తేడాలు
Old,present Foods difference
మరి ఇంతవరకు బాగానే ఉన్నా అందరికీ ఆహారం అందుతున్న అందరూ సంపూర్ణంగా తింటున్న అందరికీ రోగాలు(diseases) సాధారణంగా ఎందుకు మారుతున్నాయి. ఒకప్పుడు అవే food తిని కనీసం హాస్పిటల్ మొఖం చూడని వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ నేడు ఎన్ని రకాల ఆహారాలు ఖరీదైన ఫుడ్స్ తింటున్న లేనిపోని health problems ఎందుకు వస్తున్నాయి. నాడు చాలీచాలక ఉన్నది, దొరికిందే తింటున్న ఆరోగ్యంగా ఉన్న మనుషులు, నేడు విపరీతంగా తిన్నది అరగలేని విధంగా అరిగించుకోలేని దుస్థితికి ఎందుకు దిగజారారు.
ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల(srikrishnadevaraya) కాలంలో 500 కేజీల బండరాయిని కూడా ఇటుకల్లా మోస్తున్న కూలీలు, అదే బండరాయిని ఐదుగురు కూడా ఎత్తలేని మోయలేని దుస్థితికి ఎందుకు దిగజారారు. అసలు లోపం ఎక్కడ ఉంది అప్పటి ఆహారం ఇప్పటి ఆహారం మధ్య తేడా ఏంటి? నేటి ఆహారంలో వస్తున్న మెయిన్ సమస్యలు ఏమిటి వీటికి పరిష్కారాలు ఏమిటి వంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ ఆర్టికల్లో (article)వివరంగా తెలుసుకుందాం
అటువంటి వాటిలో మొదటిది
ఆహార అన్వేషణ(Food search):-
ఒకప్పుడు మానవుడికి ఆహారమనేది అంత ఈజీగా దొరికేది కాదు. ప్రాచీన కాలంలో మానవుడు సంచార జీవితం గడుపుతూ ఇతర జంతువులను వేటాడుతూ పచ్చి మాంసాన్ని తినేవాడు. ఇదే క్రమంలో చెట్లు , కొండలు, గిట్టలు ఎక్కుతూ ఎల్లప్పుడూ ఇతర జంతువుల మాంసాన్ని , అడవుల్లో పెరిగేటటువంటి కొన్ని చెట్ల ఫలాలను, దుంపలను ఆకులను తింటూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండడం మూలంగా అతడి శరీరం కూడా చాలా బలంగా ఉండేది అందుకు అనుగుణంగానే అతడి శరీర అవయవాలు కూడా రూపాంతరం చెందాయి.
ఆ తర్వాత కార్యక్రమం లో మానవుడు స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ప్రకృతిని గమనించి నేలను తవ్వి దున్ని వ్యవసాయం(agriculture) చేయడం ప్రారంభించాడు. ఆ విధంగా పండిన ఆహారం తింటూ అతడు ఎంతో బలంగా వ్యాధులకు గురికాకుండా ఉండేవాడు. అంతేకాకుండా అక్కడ కొన్ని రోజులు వ్యవసాయం చేసి అక్కడ నేల సారం తగ్గిపోగానే మరలా వేరే చోటికి వెళ్లి అక్కడ అడవులు నరికి దున్ని వ్యవసాయం చేసేవాడు .
Also read: -ఇండియా లో ప్రస్తుతం కనుమరుగయినవి
అక్కడ నేల సారం తగ్గగానే మరలా మొదటి చోటుకు వచ్చి వ్యవసాయం చేసేవాడు. ఇలా పోడు వ్యవసాయం(shifting agriculture) చేస్తూ జీవనం సాగిస్తూ ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయం చేస్తూ కొద్దిగా పండిన పోషకాలు(nutritional) కలిగిన ఆహారం తింటూ జీవితాన్ని కొనసాగించేవాడు. ఇక ఆ తర్వాత కార్యక్రమం అభివృద్ధి చెందుతూ వచ్చిన అడవుల విస్తీర్ణం తగ్గుతూ వచ్చి వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరుగుతూ వచ్చిన సహజ వ్యవసాయాలకే(organic farming) ప్రాధాన్యమించాడు కానీ కార్యక్రమం రసాయన వ్యవసాయం వల్ల వాటిలో ఉన్న పోషకాలు తగ్గి అనేక వ్యాధులకు గురవుతూ పంటలోని నాణ్యత(quality) కూడా తగ్గిపోయింది.
రసాయన ఎరువులు(chemical fertilizers) :-
ప్రస్తుతం పెరుగుతున్న ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి కొనసాగించాలని తరచూ శాస్త్ర సాంకేతిక అంశాలను ప్రోత్సహిస్తూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే ప్రపంచంలో మొదటిసారిగా మెక్సికోలో హరిత విప్లవం(green revolution) ప్రారంభమైంది. దీన్ని ప్రసిద్ధ మెక్సికో శాస్త్రవేత్త అయినా నార్మల్ బోర్లాగ్(norman borlag) అభివృద్ధి పరిచాడు. ఆ తర్వాత మెక్సికోను ఆదర్శంగా తీసుకొని మిగతా దేశాలు కూడా తమ దేశాలలో ఆహార ఉత్పత్తి(food Production) పెంచడానికి ఈ Green Revolution లో నార్మల్ బోర్లాగ్ అనుసరించిన ప్యూహాలనే వారు అమలు పరిచారు.
ఇలా భారతదేశంలో 1960లో ఎమ్మెస్ స్వామినాథన్ గారు మొదటగా భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్(green revolution) ను ప్రవేశపెట్టారు. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అంటే అప్పటివరకు ఉన్నటువంటి సహజ ఎరువులు స్థానంలో కృత్రిమమైన రసాయన ఎరువులను ఉపయోగించడం ఇలా ఈ రసాయనాలను ఉపయోగించడం మూలంగా ఒక మొక్క లేదా పంట యొక్క వయస్సును తగ్గించి తక్కువ కాలంలోనే దాని ఉత్పత్తిని అత్యధిక మోతాదులో పెంచే విధంగా అభివృద్ధి పరిచారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ chemicalfertilizers ను ఉపయోగించడం వల్ల దానిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి తగ్గుతూ వచ్చాయి కేవలం ఆ ఉత్పత్తి పెరగడమే కానీ పోషకాలు మాత్రం ఇంతకుముందు ఉన్న విధంగా లేవని చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు.
Chemical fertilizers ప్రకృతి పై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతున్నాయి. ఇవి మానవులకు నేలకు తీవ్రమైన అనర్ధాలను నష్టాలను కలిగిస్తున్నాయి. దీని మూలంగా నేల యొక్క ఆరోగ్యం దెబ్బతిని మరలా వేసే పంటలో కూడా ఆ రసాయనాలు( chemicals ) ఉండడం వలన ఆ పంటపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అలాగే మానవులు ఈ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల అతనికి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అంతేకాకుండా వీటిలో శాస్త్రవేత్తలు కొన్ని మంచి ఫలితాలను మంచి ప్రొడక్షన్స్ అందించే విధంగా సూచనలు చేసిన రైతులకు వాటిపై సరైన అవగాహన లేకపోవడం ఉపయోగించాలి ఎంత మోతాదులో ఉపయోగించాలి అన్న విచక్షణ కూడా తెలియకుండా కేవలం విచ్చలవిడిగా ఈ రసాయన ఎరువులు (chemical fertilizers)ఉపయోగించడం మూలంగా కూడా లేనిపోని అనారోగ్య సమస్యలను చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న వాటిలో అత్యధికం సరైన అవగాహన లేకపోవడం వల్లే కలుగుతున్నాయని అనేక పత్రికలు తెలుపుతున్నాయి. శాస్త్రవేత్తలు ఈ రసాయన ఎరువులు ఒక విధమైన కొంత మోతాదులో సరైన పంట సమయంలో ఉపయోగించి వాడితే ఎలాంటి సమస్యలు కలగవని వారు చెబుతున్నారు. కానీ నేడు రైతుల్లో రసాయన ఎరువుల వినియోగంలో సరైన మార్గదర్శకాలు సరైన అవగాహన పరిజ్ఞానం అందడం లేదు ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం అనే చెప్పాలి. వీటి మూలంగా కెమికల్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీస్ ఓనర్లు విపరీతమైన లాభాలు అర్జిస్తూ రైతులను మాత్రం తీవ్రమైన అనారోగ్యాలకు గురి చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రసాయన ఎరువుల్లో కూడా విపరీతంగా యూరియా పాస్పరేట్ పొటాషియం ఉపయోగిస్తూ లెక్కకు మించి డబ్బును కూడా కోల్పోతున్నారు. ఇక తరువాత ది
సహజ ఎరువులు(natural fertilizers )
మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడా natural fertilizersను ఎంతో విరివిగా ఉపయోగిస్తూ వ్యవసాయం(agriculture)లో ఎలాంటి వడి దుడుకులకు లోను కాకుండా కేవలం ఈ ప్రకృతి పరమైన జంతువుల తేడా విసర్జన పదార్థాలను, మొక్కల ఆకులు కొన్ని రకాల కుళ్ళిన పదార్థాలను ఎరువులుగా ఉపయోగించడం మూలంగా నేల యొక్క సారం పెరిగి పోషకాలు పెరిగి వాటి మూలంగా పండే ఆహారం కూడా ఎంతో పోషకంగా ఉండేది.ఈ విధంగా natural fertilizers పంటల యొక్క పోషకాలను పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడేవి .
ఇవి తినడం మూలంగా రైతులు అప్పటి ప్రజలు ఎంతో ఆరోగ్యంగా బలంగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండేవారు. కానీ రాను రాను రసాయన ఎరువుల మూలంగా, పెరుగుతున్న పట్ట నీకరణమూలంగా, కనీస జీవన వ్యయం పెరగడం వల్ల ఈ సహజ ఎరువుల వ్యవసాయాన్ని నమ్ముకున్న వారికి సరైన ఆదాయాలు రాకపోవడంతో వారు కాలక్రమమైన రసాయన ఎరువుల వైపు మల్లాల్సి వచ్చింది. అంతేకాకుండా పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలు, మేకలు ,గొర్రెలు వంటి వాటిని పెంచడానికి పెరుగుతున్న నగరీకరణ వల్ల సరైన వసతుల లేమి, జంతువులకు కావలసిన అడవులు అంతరించడం చాలా దూరం మేత కోసం వెళ్లాల్సి రావడం వల్ల ఇప్పుడు చాలామంది పశువుల పెంపకం పై ఆసక్తి చూపడం లేదు. అందువల్ల సరైన మోతాదులో ఈ సహజ ఎరువుల ఉత్పత్తి కూడా స్తంభించి పోయిందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సహజ ఎరువులను ఎక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమతో సేకరించాల్సి వచ్చేది అందువల్ల కూడా చాలామంది ఎరువులపై మక్కువ చూపారని చెప్పవచ్చు. దీని మూలంగా రాను రాను పంటల యొక్క నాణ్యత పై ప్రభావం చూపుతూ పంటలలో ఉన్న పోషకాలు తగ్గుతూ అవి తిన్నా ప్రజలకు తీవ్రమైన వ్యాధులను అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇక తరువాత ది
నేల సారవంతత (soil fertilization)
ఒకప్పుడు వ్యవసాయం చేసేటటువంటి భూములు అనేవి ఎంతో సారవంతంగా ఉండేవి అప్పట్లో ఎక్కువగా సహజ ఎరువులు ఉపయోగించడం వలన నేలలో తేమను అదిమీ ఉంచే పట్టి ఉంచే సూక్ష్మజీవులను అట్టి పెట్టుకునే స్వభావం అధికంగా ఉండేది. ప్రధానంగా వ్యవసాయదారున్ని మిత్రునిగా చెప్పుకునే Earthworms నేలపై బొక్కలు చేస్తూ నేల యొక్క నీటి శాతాన్ని పెంచడంలోనూ నేలపై ఉన్నటువంటి ఎరువులను నేలలో ఇంకెలా, విచ్ఛిన్నం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుండేవి. కానీ నేటి కాలంలో ఈ Earthworms అలాగే కొన్ని రకాల లెగ్యుమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలకు స్థాపనలో తోడ్పడేటటువంటి రైజోబియం బ్యాక్టీరియా వంటి జీవులు ఇప్పుడు వాడుతున్నటువంటి మితిమీరిన పెరటిసైడ్స్ క్రిమిసంహారకాల మూలంగా ఇవి చాలా వరకు తగ్గిపోయి నేల సారాలు కూడా తగ్గిపోయాయని చెప్పవచ్చు. అంతేకాకుండా రైతులకు సరైన అవగాహన లేకపోవడం మూలంగా నేల పైన ఉండే అత్యంత సారవంతమైన హ్యూమస్ అనే వర్షం వేళల్లో కొట్టుకుపోవడం కూడా ఆహారపు పోషకాలపై పంటలపై ప్రభావం చూపుతున్నాయి. వీటి పైన కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. నేలను ఏటవాలుగా దున్నడం కొన్ని పంటలకు దున్నకుండా తవ్వడం ద్వారా , ఇప్పటికైనా అన్ని రకాల ఆకులు కుళ్ళిన పదార్థాలు ఉపయోగించి నేలసారం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక దేశం యొక్క ఆరోగ్యం అనేది ఆ దేశం యొక్క మట్టి నాణ్యత పై ఆధారపడి ఉంటుందని కూడా కాలాల్లో ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ నేల సారవంతం పెరిగితే ఆ నేలలో పండినటువంటి పంటల వల్ల అక్కడి ఆహారం కూడా ఎంతో నాణ్యతగా ఉంటుంది. పురాతన కాలం నుండి కూడా భారతదేశంలో ప్రజలు ఎంతో దేహదారుడంగా పనిచేశారంటే అందుకు ప్రధాన కారణం అప్పటి సారవంతమైన నేలలనే చెప్పాలి. ఎప్పటి కాలంలో ఈ సారవంతమైన నేరాల కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి వాటిలో ప్రధానమైనవి. విజయనగర సామ్రాజ్యం బహుమనీ సామ్రాజ్యాల మధ్య రాయచోటి అంతర్వేది అనబడే సారవంతమైన నేల కోసం వీటి మధ్య తరచూ గొడవలు జరుగుతూ 14వ శతాబ్దంలో ముద్గల్ యుద్ధం కూడా జరిగింది. తరువాత ది
కల్తీ లేక పోవడం(Absence of adulteration)
ఒకప్పటి కాలంలో కల్తీ అనేది చాలా తక్కువ అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే అసలు కల్తీ(Adulteration) అంటే కూడా ఆ కాలం మనుషులకు అసలు తెలియదు. అందువల్ల ఆహార పదార్థాలు వస్తువులు ఎంతో నాణ్యతగా ఉంటూ ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవి. కానీ నేడు ఇష్టమైన వ్యాపార దృక్పథంతో నేడు విచ్చలవిడిగా అసలు పదార్థాలకు బదులుగా నకిలీ పదార్థాలను కలుపుతూ ఆహార క్వాలిటీని తగ్గిస్తున్నారు. ఉదాహరణలుగా చూసుకుంటే కారానికి బదులుగా కారం లాగా ఉండే ఇటుక పొడిని కొద్దిగా దానిలో కలుపుతూ కొంత లాభం పొందాలని కొందరు ఆలోచిస్తున్నారు, అలాగే పసుపు బదులు కొన్ని సుద్దల కూడా దాంట్లో కలుపుతున్నారని, కొన్ని రకాల మాంసాల స్థానంలో వేరే రకాల మాంసాలను రెండు మూడు రోజుల మాంసాలను, వంటివన్నీ కలుపుతూ వారి స్వలాభం చూసుకుంటూ అనవసరంగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. నేడు కలియుగం అంటేనే కల్తీ యుగంగా మారిపోయేలా ఎక్కడ చూసినా ఏ ఆహారం చూసినా కల్తీ(Adulteration) కొద్దిగా నా ఉంటుంది అన్న విధంగా సమాజం మారిపోయింది అందువల్ల అటువంటి ఆహారం తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు వారు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇక తరువాత ది
వంట నూనెల వాడకం(Use of cooking oil):-
ఒకప్పటి ఆహారం తయారీలో వంట నూనెల(cooking oils) వాడకం చాలా తక్కువ. అంతేకాకుండా అసలు పూర్వకాలంలో మనుషులకు అసలు cooking oils కూడా తెలియదు. ఆ రుచులకు వారు అలవాటు పడ్డ దాఖలాలు కూడా లేవు. కానీ కాకరమైన మానవులు food లోని సరికొత్త రుచులను కూడా అన్వేషిస్తూ వాటి తయారీలో కూడా సరికొత్త పద్ధతులు మార్గాలను అన్వేషించాడు. అయితే ఇదే కాలంలో నోటికి రుచులను కనిపెట్టిన శరీరానికి మాత్రం అంతే స్థాయిలో లాభం చేకూర్చే విధంగా వాటిని కనిపెట్టలేకపోయాడని చెప్పాలి. నేటి కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న సరికొత్త cooking oils మన సామాజిక జీవితం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇప్పటి కాలంలో ఉపయోగిస్తున్నటువంటి ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ, ఆవాలు నూగులు అన్ని రకాల చెట్ల ఆకులు కాయల మూలంగా తీస్తున్న రసాలను నూనెలుగా వాడడం ఒక విధమైన ఆనవాయితీగా వస్తున్నది. కానీ మొదట్లో వీటి వలన అంతగా అనారోగ్య సమస్యలు వచ్చేవి కావు. కానీ కాలక్రమేనా అతిగా నూనెలను ఉపయోగించడం వలన చాలా రకాలైన అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. వీటి మూలంగానే ప్రస్తుతం సాధారణంగా వస్తున్న గ్యాస్ టేబుల్, ఉబకాయం, ఎస్డిటి వంటి సమస్యలు కూడా ఉన్నాయని కొందరి డాక్టర్ల అభిప్రాయం.
అంతేకాకుండా ఈ నూనెలో నేడు ఉపయోగిస్తున్నటువంటి విచ్చలవిడి రసాయన పదార్థాల మూలంగా కూడా తయారీలో ఇవి కూడా పాల్గొని ప్రభావాలకు కారణాలు అవుతున్నాయి. అంతేకాకుండా నేటి కల్తీ యుగంలో ఈ నూనెలను కూడా తమ వ్యాపారానికి అనుకూలంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అర్జించాలన్న ఒక విధమైన ఆశతో వీటికి అనను కూల పదార్థాలను కలుపుతూ అనారోగ్యాలతో ఆటాడుకుంటున్నారు. ఇది కూడా నేటి ఫుల్ క్వాలిటీ తగ్గడానికి ఒక విధమైన కారణం అని చెప్పవచ్చు. ఇక తరువాత ది
పాకెట్ ఫుడ్స్(pocket foods):-
నేటి ఆధునిక కాలంలో ఉరుకు పరుగు జీవితంలో మనిషి ఆహారం తయారు చేసుకోవడానికి వండుకోవడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నాడు. అంతేకాకుండా సంపాదనే ధ్యేయంగా ఉంటూ ఫుడ్ పై వివిధ షాపులు, మార్కెట్లు, హోటల్లో పై ఆధారపడుతున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా మనం ఆ హోటల్లు షాపులు మార్కెట్లలో కొన్నటువంటి పదార్థాలు ఎంతవరకు నాణ్యమైన వనే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేటి కాలంలో ఎక్కువగా బదిలీకి సులభంగా ఉండేందుకు పాకెట్లలో ఆహారాన్ని ఉంచి అమ్ముతున్నారు.
అయితే ఈ విధంగా నిల్వ చేసినటువంటి ఆహారం అనేది చాలా వరకు అనారోగ్యాలకు కారణం అవుతున్నది. ఆ ఆహార పదార్థాన్ని ప్యాకెట్చేయడానికి plastic పదార్థాలను ఉపయోగించడం వలన కొంత plastic ఆకారంతోపాటు కలవడం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇప్పటి అనారోగ్య సమస్యలకు ఒక విధంగా ప్యాకెట్ చేసిన ఆహార పదార్థాలు కూడా కారణమనే చెప్పాలి. అంతేకాకుండా కొన్ని షాపుల్లో వీటిని ఎక్స్పైరీ డేటును దాటి మరీ అమ్ముతున్నారు దీని మూలంగా కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండడంతో పాటు తీవ్రమైన డబ్బును కూడా కోల్పోతున్నారు. మధ్య ఒకానొక సర్వే ప్రకారం ప్యాకెట్ ఫుడ్సులలో దాదాపు 70% కలుషితమైనవి నని వెల్లడించడం నిజంగా చాలా బాధాకరమైన అంశం.
ఇలాగే నీళ్లు కూడా plastic బాటిల్స్ లలో తాగడం వల్ల అవి కూడా చాలా వరకు పొల్యూషన్ కు గురవుతున్నాయని కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఒకప్పటి కాలంలో ఇలాంటి పాకెట్స్ ఉండేవి కావు వారు కేవలం కొన్ని పెద్ద పరిమాణంలో ఉండే అరిటాకులు మర్రి ఆకులు వంటి ఆకులను ఫుడ్డు నిల్వ ఉంచేందుకు వాడేవారు. అవి కూడా కొన్ని రోజులు కొంత సమయం వరకే కానీ నేడు వాడే ఈ plastic ప్యాకెట్స్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తున్నాయి.
ఫుడ్ కలర్స్(food colours):-
నేటి కాలంలో ఆహారం అమ్మడం కూడా ఒక వ్యాపారంగా మారడం మూలంగా ఆ ఆహార పదార్థాలు అనేది బయట వారికి ప్రజలకు చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపించడానికి వివిధ రకాలైనటువంటి సరికొత్త కెమికల్ కలర్ పౌడర్(colour powder) లను కలుపుతున్నారు. ఇవి చూసే దానికి బాగున్న ఆరోగ్యపరంగా మాత్రం చాలా రకాలైన సమస్యలకు కారణం అవుతున్నాయి ఒకప్పుడు ఈ ఫుడ్ కలర్స్ (food colors)అంటే కూడా తెలియదు.
కానీ నేడు ఈ food coloring మూలంగా అనారోగ్య సమస్యలు ఏర్పడి ప్రజల జీవితాలు నష్టపోతున్నాయనే చెప్పాలి. ప్రత్యేకంగా ఈ ఫుడ్ కలర్స్ ను ఫాస్ట్ ఫుడ్స్ కొన్ని రకాలైనటువంటి మసాలా బిర్యాని వంటి వాటిలో ఉపయోగిస్తున్నారు. ఇక తరువాత ది
కానీ నేడు ఈ food coloring మూలంగా అనారోగ్య సమస్యలు ఏర్పడి ప్రజల జీవితాలు నష్టపోతున్నాయనే చెప్పాలి. ప్రత్యేకంగా ఈ ఫుడ్ కలర్స్ ను ఫాస్ట్ ఫుడ్స్ కొన్ని రకాలైనటువంటి మసాలా బిర్యాని వంటి వాటిలో ఉపయోగిస్తున్నారు. ఇక తరువాత ది
ఆహారపు అలవాట్లు(food habits)
ఒకప్పటి ప్రజలు ఒక విధమైన స్థిరమైన సమయంలో ఆహారాన్ని తింటూ దానికి తగిన శ్రమ తగిన నిద్ర పాటిస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కానీ నేడు ఊరుకు పరుగు జీవితంలో చాలా తక్కువ అని చెప్పాలి ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఎలా పడితే అలా ఉంటూ ఉండడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలతో తీవ్రంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతే కాకుండా అప్పటి ప్రజలు ఎక్కువగా చిరుధాన్యాలను తినేవారు కానీ నేటి కాలంలో అసలు చిరుధాన్యాలు తినేవారు ఎక్కడో పల్లెటూర్లలో తప్ప చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటున్నారు. వారు తయారు చేసుకునే తినుబండారాలలో కూడా ఎక్కువగా సహజ సిద్ధమైన పదార్థాలు పండిన పదార్థాల నుండి తయారు చేసుకునేవారు.
కాలంలో ఆధునికంగా వస్తున్న సరికొత్త ఫుడ్స్ వల్ల వారి food habits కూడా మారిపోయాయి ప్రస్తుతం ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడ్డారు. ఇవి నోటికి రుచి కల్పించిన శరీరానికి మాత్రం రుచి కల్పించలేకపోయాయి. ఇప్పుడు ఎక్కువమంది నూనెలో వేయించినటువంటి న్యూడిల్స్ ,బోండాలు, బజ్జీలు ,పిజ్జాలు బర్గర్లు వంటి వాటిని తింటూ కాలం వెలదీస్తున్నారు వీటి మూలంగా విపరీతమైన అనారోగ్య సమస్యలు ఊబకాయి సమస్యలు గ్యాస్ ట్రబుల్, బిపి ,షుగర్ లో వంటివి వస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా రాగి రొట్టెలు ,కుడుములు, సజ్జ రొట్టెలు, వంటివి తింటూ ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవారు. నేటి కాలంలో వస్తున్నటువంటి ఆధునిక స్వీట్స్ మూలంగా వాటిలో ఆధునిక తీయటి పదార్థాలను కలపడం వల్ల సరికొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
అంతేకాకుండా ఇప్పటి ఆహార పదార్థాలలో ఒకప్పటిలా మనిషికి కావలసినటువంటి ప్రోటీన్స్, సహజ మూలకాలు, ఖనిజ వనరులు, విటమిన్స్ అనేవి లభించడం లేదు అవి కేవలం నోటికి రుచిని కల్పించడం వరకే పరిమితమైపోయాయి కావలసిన అవసరాలను అవి తీర్చలేక పోవడం మూలంగా సరికొత్త అనారోగ్య సమస్యలతో పాటు దేహదారు డ్యాం కూడా తగ్గిందనే చెప్పాలి.
స్వచ్ఛమైన పాలు(clean milk)
ఒకప్పుడు ఆవులు గేదలు అనేవి పల్లెటూర్లలో చాలా వేగంగా పెరుగుతూ ప్రజల అవసరాలను తీరుస్తూ ఆహారపరంగా ఎంతో ఉపయోగపడేవి. కానీ నేటి కాలంలో విపరీతమైన పట్టణీకరణ మూలంగా గ్రామీణం నుండి వారు తెచ్చుకోలేకపోవడంతో వారు ఆధునికంగా దొరికేటటువంటి పాల ప్యాకెట్ల పై ఆధారపడాల్సి వస్తుంది ఈ పాల ప్యాకెట్లు(milk pakets) ఎంతవరకు నాణ్యత పరంగా మంచి వని దాని పైనే ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి పాలలో కల్తీ అనేది చాలా తక్కువ కానీ నేటి కాలంలో పాలల్లో కూడా కల్తీ జరుగుతున్నది అంతేకాకుండా పాలు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు దానిలో వివిధ రకాలైన రసాయన పదార్థాలను ఉపయోగిస్తుండడం మూలంగా దానిలో ఇంతకుముందు ఉన్నటువంటి పోషకాలు తగ్గుతున్నాయి కొన్ని milk ఎక్స్పైరీ డేట్ వల్ల అవి విషం లాక్ కూడా మారే సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా పాలపొడి అనేది పాలు అంతా పోషక పదార్థాలు కలిగి ఉండదని విషయాన్ని మరిచిపోతున్నారు.
పాలను నిల్వ ఉంచేటటువంటి ప్లాస్టిక్ తో తయారు చేయడం వల్ల కూడా మన యొక్క క్వాలిటీ అనేది కూడా కొంత తగ్గుతున్నదని చెప్పాలి. ఏది ఏమైనా ఫైనల్ గా ఒకప్పటి పాల స్వచ్ఛత నేడు లేదనే చెప్పాలి .లూయీ పాశ్చర్ పాలను నిల్వ ఉంచేటటువంటి పాశ్చరైజేషన్ పద్ధతిని కనిపెట్టిన నేటి ఆధునిక వ్యాపార శైలిలో వాటిని చాలా వరకు దుర్వినియోగం చేసే వ్యాపారులు లేకపోలేదు.
ఇక తరువాత ది
కాలుష్యం కలుషితం(pollution)
ప్రధానంగా ఒకప్పటి జీవితం నేటి జీవితానికి ప్రధానమైన తేడా పొల్యూషన్ ఇదే నేటి జీవితాలను చాలా వరకు నాశనం చేస్తున్నది ఎక్కడ చూసినా కాలుష్యం మూలంగా చాలా విధాలైన ఆహార పదార్థాలు నాశనమైపోతున్నాయి ఈ కాలుష్యం మూలంగా గా ప్రతి ఒక్కటి అనర్థాయకంగా మారుతున్నది. నేటి కాలంలో వస్తున్నటువంటి అడవుల నరికివేత , విస్తరిస్తున్న పట్టణీకరణ, ఫ్యాక్టరీల పెరుగుదల, రసాయన ఎరువుల వాడకం వల్ల ఈ కాలుష్యం అనేది విపరీతంగా సంభవిస్తున్నది. దీని మూలంగా పంట స్థాయిలోనే పంటలు అనేవి విషకారకాలుగా మారుతున్నాయి ఇవి కూడా ఫుల్ క్వాలిటీ తగ్గడానికి ఒక విధమైన కారణం అని చెప్పవచ్చు.
లాభా పేక్ష(Profit motive)
నేటి కాలంలో ప్రతిదీ వ్యాపారం అవడం మూలంగా ఆహారాన్ని కూడా తమ వ్యాపారంగా మార్చుకుంటూ తమకు లాభాలు రావాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి వివిధ రకాల పంథాలను అనుసరిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి ఫేక్ ప్రమోషన్స్, అప్లియేట్ మార్కెటింగ్ వంటివి ప్రధానమైనవి. కాకుండా ఎక్కడో దూరంగా ఉండి ఆహారంను సరఫరా చేయడం వల్ల కూడా దాని క్వాలిటీ అనేది ఎలా ఉందో అన్నదానిపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో లాభపేట్ తో వారు డూప్లికేట్ ప్రొడక్ట్స్ ని కూడా అమ్ముతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి లాభా పేక్ష లేకపోవడం వల్ల ఎలాంటి అవాంతరాలు ఉండేవి కావు కానీ నేడు ఎక్కువగా ఇవి పెరిగిపోయాయి .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి