What is Shubman gill batting speciality? Why popular?

Shubman gill batting speciality 

 ప్రస్థుతమ్ భారత్ లోనే కాకుండా ప్రపంచ cricket లోను మారుమోగుతున్న పేరు shubman gill. భారత cricket కు ఒకప్పుడు సచిన్, నిన్నటి వరకు విరాట్ కోహ్లీలు వెన్నెముకలైతే నేటి నుంచి భారత క్రికెట్కు వెన్నెముక shubman gill అవుతాడని ఇప్పటికే చాలామంది క్రికెట్ మేధావులు విశ్లేషకులు అంచనా వేశారు. Shubman gill wikipedia
అందుకు తగ్గట్లే ప్రస్తుతం క్రికెట్లో అద్భుతమైన ఆటతీరితో ప్రపంచం మొత్తం భారత క్రికెట్ ను చూసి భయపడే విధంగా తన బ్యాటింగ్ను మార్చుకున్నాడు గిల్. భారత క్రికెట్లో sachin చిన్న వయసులోనే 16 సంవత్సరాలకే అరంగేట్రం చేసి తన అద్భుతమైన ప్రతిభతో భారత్కు ఎన్నో మరుపురాని విజయాలు అందించి ప్రపంచం మొత్తం భారత్ ను చూసేలా చేశాడు. అంతేకాకుండా క్రికెట్ లోనే దేవుడిగా పేరు పొంది god of cricket గా చరిత్రలో నిలిచిపోయాడు.
ఆ తర్వాత 2014లో తన రిటైర్మెంట్ ఇచ్చాడు. అతని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానం ను పూడ్చే ఆటగాడు లేడా అన్న ప్రశ్న మొదలైన సమయంలో నేనున్నానంటూ భారత క్రికెట్ను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా సచిన్ టెండుల్కర్ ను మించిన సగటుతో క్రికెట్ లోనే క్రికెట్ రారాజుగా మారి అద్భుతమైన రికార్డులతో ఇటీవలే టి20 లు, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చాడు. క్రికెట్ లో సచిన్ దేవుడైతే virat kohli  కింగ్ గా పేరు పొందాడు. మరి ఇంత గొప్ప క్రికెటర్ రిటైర్మెంట్ ఇవ్వడంతో చాలామంది కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవడున్నాడు అన్న ప్రశ్న  మెదిలిన  సమయంలో నేనున్నానంటూ తన ఆటతో సగటు క్రికెట్ ప్రేక్షకునికి అనిపించే ఆటగాడు shubman gill .
(shubman gill image credit getty images)పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఈ ఆటగాడు మొదట 2018 అండర్ 19 ప్రపంచ కప్ తో వెలుగులోకి వచ్చాడు. ఆటోర్నీలో పృద్వి షా కెప్టెన్సీలో ఓపెనర్ గా ఆడిన ఈ ఆటగాడు ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసి భారత్కు అండర్ 19 ప్రపంచకప్ రావడంలో కీలకమైన పాత్ర వహించాడు.
Shubman gill batting popularity in World
 ఆ తర్వాత దేశ వాలి క్రికెట్ టోర్నీ లోను రాణించడంతో కోల్కత్తా నైట్ రైడర్స్ టీం అతడి ప్రతిబను గుర్తించి ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. అలా కలకత్తా నైట్ రైడర్స్ టీం లో మొదట సరైన అవకాశాలు రాకపోయినప్పటికీ రాను రాను అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకొని ఐపీఎల్లో అద్భుతమైన ఆట తీరు కనబరిచి టీమిండియా తెలుపు తట్టి నేడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఒక సాధారణ ఆటగాడిగా ఉన్న శుభమన్గిల్ నేడు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ గా మారి రాబోయే భవిష్యత్తులో సచిన్ కోహ్లీల స్థానంతో పోల్చే విధంగా మారడంలో అతని ప్రతిభ ఏ పాటిదో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం.Shubman gill records in england
 అంతేకాకుండా ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో మంది క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్నప్పటికీshubman till కు మాత్రమే సాధ్యమైనా బ్యాటింగ్ గొప్పతనం ఏమిటనేది ఒక్కొక్కటిగా వివరంగా ఈ ఆర్టికల్లో చూద్దాం. వాటిలో మొదటిది
 నిలకడైన బ్యాటింగ్:-
క్రికెట్ లో ఏ ఆటగాడికైనా గొప్ప పేరు తెచ్చేది అతడి యావరేజ్ బ్యాటింగ్. ప్రస్తుతం ప్రపంచంలో గిల్లాంటి బ్యాటింగ్ సగటుతో రాణిస్తున్న యువ క్రికెటర్లు చాలా తక్కువ అని చెప్పాలి. ప్రస్తుతంshubman gill యొక్క వన్డే బ్యాటింగ్ సగటు దాదాపు 60 గా ఉంది, అలాగే టెస్ట్ లోను 40 ప్లస్ గా, టి 20 లోను 30 ప్లస్ గా ఉంది రానున్న కాలంలో ఇతడు యొక్క యావరేజ్ టెస్టులు ,t20 లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక వన్డే బ్యాటింగ్ లో అయితే గిల్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డే లో అతడి బ్యాటింగ్ సగటు దాదాపు రెండు సంవత్సరాల నుండే 60 ప్లస్ గా నమోదు అవుతూ వస్తున్నది. గతంలో విరాట్ కోహ్లీకి కూడా వన్డేల్లో ఇంతటి సగటు లేదనే చెప్పాలి. అతడు కేవలం 24 సంవత్సరాల్లోనే వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటింగ్ స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాకుండా ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యం కాని విధంగా కేవలం 23 సంవత్సరాలకే వన్డేల్లో డబల్ సెంచరీ చేసిన ఘనత అతడికే దక్కింది. ఆ వయసులో అసలు ప్రస్తుతం భారత్లో క్రికెట్కు ఉన్న పోటీల్లో టీమిండియాలో అవకాశం రావడమే కష్టం అనుకున్న సమయంలో తన యొక్క బ్యాటింగ్తో ప్రతి ఒక్కరు తను కచ్చితంగా టీంలో ఉండాల్సిందే అని అనుకునే విధంగా చేశాడు. ఇప్పటివరకు ఎంతోమంది క్రికెట్ ఆడారు కానీ ఇంతటి తక్కువ వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా తక్కువ నే చెప్పాలి అటువంటి ఆటగాలలో shubman gill కూడా అత్యున్నత  స్థానంలో ఉంటాడనే చెప్పవచ్చు.Shubman gill wikipedia
(shubman gill image credit getty images)2023 వన్డే ప్రపంచ కప్ లో అలాగే 2025 ఛాంపియన్ ట్రోఫీ గెలవడంలో ఇతడి పాత్ర కూడా చాలా ఉందనే చెప్పవచ్చు. ఇప్పటికే అతడు కేవలం 55 వన్డే లోనే 8 సెంచరీలు 15 అర్థ సెంచరీలతో తనకంటూ ప్రపంచ క్రికెట్లో ఒక విధమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే 2022లో జరిగిన న్యూజిలాండ్తో వన్డేలో 208 పరుగులు చేసి అతి తక్కువ వయసులో ఆ ఘనత సాధించిన క్రికెటర్ గాను ఎంతో పేరు పొందాడు. ఇటువంటి double  సెంచరీ రికార్డు ప్రపంచంలో ఎంతోమంది లెజెండ్రీ క్రికెటర్ లకు  కూడా సాధ్యం కాలేదనే చెప్పాలి . ఇక ఇప్పటివరకు టెస్టుల్లో అతని బ్యాటింగ్ కొద్దిగా తక్కువగానే ఉన్నట్టు ఉన్న ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో అతడు ఆడిన ఆట ప్రపంచ క్రికెట్ లోనే ఒక నూతన శకంగా చెప్పవచ్చు.
Shubman gill cricbuzz rankings
ఇక ఈ మ్యాచ్ లో ఇతడు నాలుగు ఇన్నింగ్స్ లలోనే మూడు సెంచరీలతో అదరగొట్టాడు. ప్రత్యేకంగా రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులతోను, రెండో ఇన్నింగ్స్ లో 169 పరుగులతోను అదరగొట్టడంతో ప్రపంచ క్రికెట్లో విదేశీ టీం పైన రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేయడంతో పాటు ఒక డబల్ సెంచరీ నమోదు చేసిన రికార్డు గెలుకు మాత్రమే దక్కింది. గతంలో భారత్ నుంచి ఎంతోమంది విదేశీ గడ్డలపై క్రికెట్ ఆడిన కూడా కనీసం ఒక్కటంటే ఒక్క సెంచరీ నమోదు చేసిన వారు కూడా ఒక నలుగురు లేదా ఐదు మంది మాత్రమే, కానీ నేడు shubman gill ఒకే పర్యటనలో ఏకంగా మూడు సెంచరీలు నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా మరిన్ని మ్యాచ్లో ఉండటంతో ఇతడి యొక్క విధ్వంసక బ్యాటింగ్ ఇంకా మరింతగా నమ్మదయ్యే అవకాశం ఉంది. అయినా కూడా టెస్టుల్లో అతడు ఇప్పటికే 8 సెంచరీలు నమోదు చేశాడు. ఇక టి20 లోను జింబాబ్వేతో జరిగిన ఒక మ్యాచ్లో సెంచరీ నమోదు చేసి మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదవ భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక ఐపీఎల్ లో అయితే అతడి బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటికే అతడు దాదాపు నాలుగు సంవత్సరాలు 500 ప్లస్ పరుగులు సాధించాడు. కాకుండా 2023లో ఆరెంజ్ క్యాప్ కూడా అందుకోవడం జరిగింది. ఇక రీసెంట్ గా అతడి యొక్క బ్యాటింగ్ స్కిల్ తో ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా, ఇండియన్ టీం లో టెస్టుల్లో కెప్టెన్ గాను పగ్గాలు అందుకోవడం జరిగింది. ఇదంతా కూడా కేవలం గిల్ యొక్క బ్యాటింగ్ సగటు ఆధారంగానే చెప్పవచ్చు. నిరంతరం తనను తాను మెరుగుపరుచుకుంటూ సరికొత్త బ్యాటింగ్ స్కిల్ తో ఎక్కడ ఎలా ఆడాలో తెలుసుకొని ఇంతటి స్థాయికి చేరుకోగలిగాడు. ఇక అతడి బ్యాటింగ్ లో ఉన్న రెండవ గొప్ప లక్షణం
 పరిస్థితులకు అనుగుణంగా ఆడడం:-shubman gill యొక్క బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుందంటే అటు బ్యాటింగ్ పిచ్ లో నైనా ఇటు బౌలింగ్ పిచ్ లోనైనా రాణించే గొప్ప బ్యాటింగ్ అతడికే సొంతం. పరిస్థితులకు తగ్గట్టు వేగంగా ఆడాలన్న హిట్టింగ్ చేయాలన్న అలాగే పిచ్ కండిషన్స్ బౌలింగ్ అనుకూలించిన నిదానంగా ఆడాలన్న కేవలం గిల్క్ మాత్రమే సాధ్యమైంది.
Shubman gill rankings
ప్రపంచంలో ఇలా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ను మార్చుకునే సత్తా బ్యాటింగ్ టెక్నిక్స్ కేవలం కొందరికి మాత్రమే సాధ్యం అటువంటి వారిలో gill ను ప్రధానంగా చెప్పవచ్చు. అతడు ఆడే ఈ శైలి అటు విరాట్ కోహ్లీ ఆటతోనో కొన్నిసార్లు రోహిత్ శర్మ లాగా విధ్వంసక ఆటతోను రెండు రకాల ఆటలను ఆడుతూ క్రికెట్ అభిమానుల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ప్రపంచంలో పరిస్థితులకు తగ్గట్టు ఆడడంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియమ్సన్, భారత్కు చెందిన విరాట్ కోహ్లీ, వంటి ఆటగాళ్లు పేరు పొందితే వీరంతా కూడా నిలకడగా ఆడిన స్ట్రైక్ రేట్ కొద్దిగా తక్కువనే చెప్పాలి. కానీ శుభమన గిల్ మాత్రం అటు స్ట్రైక్ రేట్ లోను ఇటు నిలకడైన బ్యాటింగ్ లోను అద్భుతంగా రాణిస్తూ ఎంతోమంది ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అతడి బ్యాటింగ్ లో ఉన్న మూడవ కారణం
తక్కువ వయసులోనే టీమిండియా తలుపు తట్టడం:- Shubman gill wikipedia(shubman gill image credit getty images)
ప్రస్తుతం భారత్ లో ఉన్న పోటీ దృష్ట్యా చాలామంది క్రికెటర్లకు తమ జీవితంలో ఒక్కసారి అయినా టీమిండియాకు సెలెక్ట్ అయితే బాగుంటుంది అన్న కల ఉండే ఉంటుంది. అందుకోసం ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతోమంది రాత్రింబవళ్లు కష్టపడే ఆటగాళ్లు దేశంలో వందల్లో ఉన్నారంటే చెప్పవచ్చు. కానీ వారందరికీ కూడా అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేక మరలా మరలా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటుంటారు. కానీ గిల్ మాత్రం తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్తో కేవలం 18 సంవత్సరాల వయసుకే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి 19 సంవత్సరాల వయసుకే టీమ్ ఇండియా తలుపు తట్టాడు. ఇలా అతి తక్కువ వయసులో ఇండియా టీం లో స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లలో గిల్ కూడా ఒకడు. ఇక మిగతా ఆటగాళ్లు తక్కువ వయసులో ప్లేస్ సంపాదించుకున్న స్థిరంగా టీంలో నిలబడలేకపోయారుshubman gill మాత్రం తన యొక్క అద్భుతమైన బ్యాటింగ్ తో తక్కువ వయసులోనే నిలకడైన బ్యాటింగ్తో సీనియర్ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని విధంగా అద్భుత రికార్డులతో పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ 2022లో శుభమగ్గిల్ న్యూజిలాండ్ పై డబల్ సెంచరీ చేయడంతోనే నా స్థానం కనుమరుగు అవుతుందని అనిపించింది అని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెబుతూ తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావించాడు. అంటే ఒక సీనియర్ బ్యాట్స్మెన్ అతని బ్యాటింగ్ గురించి తన స్థానంలో సెలెక్ట్ అయిన అతడి సత్తా గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఇంత తక్కువ వయసులోనే అతడు డబల్ సెంచరీ చేశాడు అంటే భవిష్యత్తులో భారత్కు క్రికెట్ లో అద్భుతమైన విజయాలు అందిస్తాడని నేను అప్పుడే అనుకున్నానని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. నా స్థానం గల్లంతయిన నా స్థానంలో ఇంత గొప్ప ఆటగాడు రావడం నిజంగా చాలా గర్వకారణం అని కూడా అతడు చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా అతడి ఆట గురించి చెబుతూ ఇంత తక్కువ వయసులో ఇంత నిలకడైన బ్యాటింగ్ నిజంగా చాలా గొప్ప పరిణామం అని ఆ వయసులో తనకు కూడా ఆ బ్యాటింగ్ సాధ్యం కాలేదని చెప్పారు. మరి అలా ఉండడం వల్లే గిల్ యొక్క బ్యాటింగ్ ప్రపంచంలో మారు మోగుతున్నది.
ప్రపంచ రికార్డులు
(shubman gill image credit getty images)
తక్కువ వయసులోనే టీమ్ ఇండియా తలుపు తట్టినా కూడా భారత క్రికెట్ లో తనదైన శైలిలో అద్భుతమైన రికార్డులను సృష్టించాడు. వన్డేల్లో తక్కువ వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడు గిల్ మాత్రమే అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్ లోనే ఆ రికార్డును అందుకున్నాడు.
Shubman gill records in england's.ఇక ప్రపంచ క్రికెట్లో ప్రపంచ కప్ లో ఐసీసీ ట్రోపీలో అతి తక్కువ వయసులో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో ఆటగాడు గాని పేరు పొందాడు. ఇక భారత టి 20 లోను అత్యధిక స్కోరు సాధించిన రెండో భారత క్రికెటర్ గాను పేరు పొందాడు. అంతేకాకుండా ప్రపంచ వన్డే క్రికెట్లో అతి తక్కువ వయసులో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించగలిగిన భారత క్రికెటర్ కూడా శుభమగ్గిల్లే. టెస్టుల్లో విదేశీ గడ్డపై అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగాను మరియు కెప్టెన్ గాను పేరు పొందాడు.
 అంతేకాకుండా ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ మరో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి విదేశీ గడ్డలపైన అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగాను కెప్టెన్ గాను ఒకే మ్యాచ్ లోనే ఈ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో గిల్ కూడా ఒకడు. భారత్ నుండి ఈ ఘనత సాధించిన ఐదవ ఆటగాడు ఇతడి కంటే ముందు సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లో మాత్రమే సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అతడి రికార్డులు కూడా చాలానే ఉన్నాయి. వీటన్నింటి కారణంగా ప్రస్తుతం ఇతడి పేరు మారుమోగుతూ భవిష్యత్తులో భారత క్రికెట్ ను ప్రపంచ స్థాయిలో గుర్తుంది పోయేలా భారత్కు మరిన్ని చిరస్మరణీయ విజయాలు అందిస్తాడని ఆశిద్దాం.


Resources: -
 Images credit :- gettyimages Images
Content: -my own thoughts or google Resources, cricbuzz rankings information 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !