Why is Bengal called number one in modern India

Bengal history of modern indiaModern భారతదేశ చరిత్రలో bengal ఒక ప్రముఖ మైన స్థానం ఉంది. బ్రిటిష్ పాలన ఆరంభం నుండే భారతదేశంలో జనాభాలో కానీ విస్తీర్ణంలో కానీ అతి పెద్ద రాష్ట్రం or రాజ్యం బెంగాల్. అంతేకాకుండా దేశంలో ఆరోజుల్లో అత్యధిక జీడీపీ అత్యధిక ధనికమైన రాజ్యం కూడా బెంగాలీనే యావత్ భారతదేశం ఇప్పటి గురించి ఆలోచిస్తే బెంగాల్ అనేది రేపటి గురించి ఆలోచిస్తుంది అన్న సామెత కూడా ఆ రోజుల్లో వాడుకలో ఉండేది. అంతెందుకు దేశంలో మొదటగా బ్రిటిష్ వారు సుస్థిరమైన పరిపాలనకు పునాది వేసిన 1773 రెగ్యులేటింగ్ లైటింగ్ యాక్ట్ చేసి భారత గవర్నర్ లేదా పాలనాధికారి అనే ఏ పదాలు ఉపయోగించకుండా ఈ act ప్రకారం కేవలం బెంగాల్ గవర్నర్ (bengal governer)లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించారంటేనే ఆ రోజుల్లో బెంగాల్ పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే అప్పట్లో బెంగాల్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ లోని కొన్ని ప్రాంతాలు అని అర్థం చేసుకోవాలి.History of bengal wikipedia

1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొత్తం బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్న వారన్ హేస్టింగ్స్ నియంత్రించేలా అధికారాలు ఇచ్చాలంటేనే అప్పట్లో బెంగాల్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఎన్నో రాజ్యాలు ఉన్నప్పటికీ కేవలం బెంగాల్ కు మాత్రమే ఆ రోజుల్లో ఎందుకు అంత గొప్ప పేరు వచ్చింది. అటు యుద్ధాల్లో నైనా, ఇటు దేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటంలో నైనా, దేశభక్తుల విషయంలోనైనా, శాస్త్ర సాంకేతిక విషయాల్లో నైనా బెంగాల్ ను ఢీ కొట్టాలంటే చాలా కష్టమనే చెప్పాలి. అసలు దేశంలో బెంగాల్ కు ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటనేది? మరియు ఆధునిక కాలంలో బెంగాల్ అనేది భారతదేశ చరిత్రలో గొప్పగా చెప్పబడడానికి కారణాలు ఏమిటో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. వాటిలో మొదటిది
 దేశంలో మొదట సాంస్కృతిక పునరుజ్జీవమ్ రావడం :-
నిజానికి ప్రపంచంలో మొదటిసారిగా సాంస్కృతిక పునరుజీవం వచ్చింది ఇటలీలో అయితే భారతదేశంలో మొదటగా సాంస్కృతిక పునరుజ్జీ జీవం వ్యాప్తి చెందింది బెంగాల్లో. బెంగాల్లో సాంస్కృతిక పునరుద్జీవనం మొదటగా వ్యాప్తి చెందడానికి కారకుడు రాజా రామ్మోహన్ రాయ్ దాదాపు 1817 లోనే బెంగాల్లో సాంస్కృతిక పునర్జీవాన్ని వ్యాప్తి చేసి అప్పటివరకు ఉన్న మూఢనమ్మకాలన్నింటినీ చాలావరకు రూపుమాపేలా ప్రయత్నాలు చేశాడు. దీనికోసం అతడు బ్రహ్మ సమాజం అనే ఒక వేదికను మూఢనమ్మకాల నిరోధానికి స్థాపించాడు. 
అంతేకాకుండా మిరాతుల్ అక్బర్, సంవాద కొమ్ముది వంటి పత్రికలు కూడా స్థాపించి ప్రజల్లో ఎన్నో మూఢనమ్మకాలను రూపుమాపాడు. అంతేకాకుండా ఆంగ్ల విద్య గొప్పతనాన్ని గ్రహించి భవిష్యత్తులో ఇంగ్లీష్ చాలా అవసరమని భారతీయులు గొప్పగా తయారవాలన్నా, జ్ఞానవంతులు కావాలన్నా ఇంగ్లీష్ చాలా అవసరమని భావించి విలియం బెంటింగ్ చేత ఆంగ్ల విద్య కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించలా చేశాడు. ఇలా భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య తరువాత కాలంలో బెంగాల్ నుంచే వేగంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. అంటే కాకుండా రాజారాం మోహన్ రాయ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని తర్వాత కాలంలో అనేకమంది బెంగాలీ నాయకులు యావత్ భారతదేశంపై తమ ప్రభావాన్ని చూపారు అలా ప్రభావాన్ని చూపిన వారిలో కేశవ చంద్రసేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ సురేంద్రనాథ్ బెనర్జీ  వంటి వారి నీ ప్రముఖంగా చెప్పవచ్చు.
ఇలా దేశంలో మొదటగా మూడ నమ్మకాలు, అజ్ఞానమైన అంశాలు, అభివృద్ధిని ఆటంకపరిచే అంశాలను మొదటగా ప్రజలలోకి తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర గణనీయమైనది అని చెప్పవచ్చు ఇక రెండవ కారణం
మొగల్స్ ప్రభావం తక్కువగా ఉండడం:-భారతదేశాన్ని దాదాపు  1526 నుంచి 1707 ఔరంగాజేబు మరణం వరకు ఏక చక్రాధిపత్యం గా భారతదేశాన్ని పరిపాలించిన మొగల్స్ అటు నార్త్ లోను ఇటు సౌత్ లోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మొగల్ బెంగాల్ పై  మాత్రం ఎలాంటి దృష్టి పెట్టలేదు. వారు కేవలం బెంగాల్ ను సామంత రాజ్యం గానే ఉంచి సామంత రాజుల చేతులతోనే ఎలాగోలా నెట్టు కొచ్చినట్లు పరిపాలించారు. దీనివల్లే బెంగాల్ ను పరిపాలించే రాజులకు అటు నార్త్ రాజులతోనూ ఇటు సౌత్ రాజులతోనూ యుద్ధాల ప్రభావం, దాడుల ప్రభావం, దండయాత్రల ప్రభావం చాలా తక్కువ అని చెప్పవచ్చు. దీనివల్ల అక్కడి రాజులు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడం పైన ఎక్కువ దృష్టిని పెట్టే అవకాశం లభించింది. మొగల్ కన్ను కూడా దీనిపై పెద్దగా ప్రభావం చూపలేదు. 
అంతేకాకుండా ఇది తూర్పున చివరన ఉండడంతో ఢిల్లీకి దూరంగా ఉండటంతో ఎలాగూ మన కింద ఉంది కదా అని simple గా భావించారు. దీనివల్ల బెంగాల్ రాజులు తన స్వయం నిర్ణయాలతో విపరీతంగా అభివృద్ధి చేశారు. దీనివల్ల కూడా ఆ రోజుల్లో బెంగాల్ గొప్పగా చెప్పబడిందని చెప్పవచ్చు. ఇక రెండవది
సారవంతమైన నేల:-
బెంగాల్ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో హుగ్లీ నది, బ్రహ్మపుత్ర నది, దామోదర్ నది వంటి నదులు ప్రవహించే క్రమంలో కొట్టుకు వచ్చిన మట్టితో బెంగాల్ ప్రాంతంలో సారవంతమైన నేలలు వ్యాప్తి చెందాయి. ఇక్కడ అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే  ఆ రోజుల్లో టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడంతో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరుగా భూమి షిస్తూ ఉండేది. 

ఎ రాజ్యంలో అయితే భూమిశిస్తూ ఎక్కువగా కడతారో, పంటలు బాగా పండి సస్యశ్యామలం  అవుతాయో ఆ రాజ్యాలు ఆ రోజుల్లో బలంగా సంపన్న రాజ్యాలుగా విరసిల్లుతుండేవి. అదేవిధంగా బెంగాల్ కు కూడా అప్పట్లో ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తూ. మిగతా ప్రాంతాల కన్నా బెంగాల్ అప్పట్లో ఎక్కువగా పంటలు పండడం సస్యశ్యామలం అవడం సారవంతమైన నేలలు ఉండడం వల్ల అక్కడి రైతులు కూడా మరింత ధనవంతులుగా ఉండడం వల్ల tax బాగానే కట్టేవారు. దీంతో బెంగాల్ అత్యంత ధనిక రాష్ట్రంగా ఆర్ రాజ్యాంగ ఉండేది. 
అందువల్లే అక్కడ మొదట్లోనే ఆదాయం పంచుకోవడానికి 1764 బక్సార్ యుద్ధం తరువాతనే అప్పటి మొదటి బెంగాల్ గవర్నర్గా ఉన్న రాబర్ట్ క్లైవ్ మొదట్లోనే ద్వంద పాలన ప్రవేశపెట్టి మరింత ధనాన్ని రాబట్టగలిగేలా ప్లాన్ చేశాడు. ఆ తర్వాత 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం నియమితుడైన వారన్ హేస్టింగ్స్ ఏకంగా రెండు అడుగులు ముందుకేసి వేలం వేసే పద్ధతి లేదా జమీందారీ పద్ధతిని మొదటగా ఇక్కడే అమలు చేశాడు అంటేనే అప్పట్లో బెంగాల్ రైతులు ఎంత సంపన్నులో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా  ఇదే సమయంలో వారి దోపిడీ విధానాలతో కాలక్రమంలో దాన్ని ప్రాబల్యాన్ని కూడా కోల్పోయేలా బ్రిటిష్ వారు వారు మార్చేశారు. ఇలా ఆ రోజుల్లో బెంగాల్ యొక్క గొప్పతనం చెప్పడానికి వారి యొక్క సారవంతమైన నేల  కూడా ఒక విధమైన కారణంగా చెప్పవచ్చు. ముందు పంటలు పండితేనే కదా డబ్బు వచ్చేది ఆ విధంగా అర్థం చేసుకోవాలి.
ఇక తరువాత ది 
స్వతంత్ర బెంగాలీ రాజుల పరిపాలన దక్షిత:-
1707 లో ఔరంగజేబు మరణం తర్వాత మొగల్ సామ్రాజ్యం బలహీనపడుతూ వచ్చింది. దీంతో అతని తర్వాత వచ్చిన మొగల్ kings మలి మొగల్స్ గా పేరు పొంది అసమర్థులుగా మిగిలిపోయారు. దీంతో వారి బలం తగ్గుతూ రావడం గమనించిన స్వతంత్ర రాజ్యాలు ఒక్కొక్కటిగా స్వతంత్రత ప్రకటించుకో సాగాయి. ఇదే సమయంలో 1717లో మొదటిసారిగా స్వతంత్ర బెంగాల్ నుMurshid Quli Khan  స్థాపించాడు. ఇతడు దాదాపు 1717 నుండి 1727 వరకు బెంగాల్ ను  పాలించాడు. అలా స్థాపించిన బెంగాల్ తర్వాత రోజు రోజుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ 1745 సమయానికి ఆలివర్ధికాన్ కాలం కు బెంగాల్ మరింత ధనికంగా మారింది. తర్వాత 1756లో స్వతంత్ర బెంగాల్ కు ali vardhi khan కుమారుడైన 24 సంవత్సరాల sirajuddaula రాజవుతాడు. సిరాజ్ దౌలా అయితే తనకున్న బలం , బెంగాలీలా శక్తిని అంచనా వేసి ఏకంగా బ్రిటిష్ వారినే తమ రాజ్యం నుంచి బహిష్కరించాలని ప్రయత్నం చేశాడు. అందుకు అనుగుణంగానే వారిని తమ రాజ్యం నుంచి బహిష్కరణ చట్టం చేశాడు. కానీ బ్రిటిష్ వారు అతని ఆజ్ఞను పట్టించు కోకుండా యధాతధంగా తమ వ్యాపారాన్ని చేసుకుంటారు. దీంతో తన ఆజ్ఞను దిక్కరించినందుకుగాను 126 మంది ఆంగ్లేయులను పోర్ట్ విలియం కోట లోని ఒక చిన్న గదిలో బంధిస్తారు. ఆ గదిలో ఊపిరాడక 14 మంది తప్ప మిగతా అంతా మరణిస్తారు. దీన్ని చరిత్రలో కలకత్తా చీకటి గది ఉదంతం గా చెప్పడం జరిగింది. దీంతో ఎలాగైనా పగ తీర్చుకోవాలన్న కసితో అతని సైన్యాధికారి అయినా మీర్జాపరును లంచం తో వశపరచుకొని మోసంతో ఎంతో బలంగా ఉన్నప్పటికీ 1757లో ప్లాసీ యుద్ధంలో సిరాజ్ దోలాను ఓడించి చంపేస్తారు. ఆ తర్వాత మీర్జాపరును తర్వాత అతని అల్లుడైన మీర్ కాసింలను రాజులుగా చేస్తారు. ఇక్కడ వీరు భారత్ ను మోసం చేసిన విషయం పక్కన పెడితే  బెంగాల్ కు కొన్ని మంచి పనులు కూడా చేశారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది. మీరు కాసిం ఏ రోజుకైనా బ్రిటిష్ వారితో యుద్ధం వస్తుందని వారిని ఎదుర్కోవాలంటే వారికి దూరంగా ఉండి ఆయుధాలు కావాలని ఆలోచించి తన రాజధానిని బ్రిటిష్ వారి నుంచి కాపాడుకోవడానికి మురిసిదాబాద్కు మార్చి అక్కడ ఆయుధ కర్మ గారాన్ని అభివృద్ధి చేశాడు. గొప్పగా మరింత పునరుత్సాహంగా మారినట్లు అయిందని కూడా చెప్పవచ్చు. ఇదే సమయాల్లో బెంగాల్ సైన్యం కూడా చాలా గొప్పగా దాదాపు 60 వేల పైనే ఉండేది. కానీ మీరు జాఫర్ మోసం వల్ల ప్లాస్ యుద్ధంలో సిరాజ్ దోలా ఓడిపోవలసి వచ్చింది. అసలు బ్రిటిష్ వారితో sirajuddaula యుద్ధానికి వెళ్ళింది తన యొక్క సైన్యం రాజ్యం బలాన్ని ఆసరాగా చేసుకొని మాత్రమే. ఈ విధంగా ఆ రోజుల్లో బెంగాల్ గొప్ప సైనిక శక్తి ఉండడం వల్ల కూడా చరిత్రలో గొప్పగా చెప్పబడిందని చెప్పవచ్చు. ఇక తర్వాత ది 
కలకత్తా అభివృద్ధి చెందడం:-
నిజానికి దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో మొదటగా ఏర్పడింది నిర్మించబడ్డది కలకత్తా మహానగరం. దీన్ని దాదాపు 1690 లోనే జాబ్ చార్నాక్ దీని నిర్మాణానికి పునాది వేశాడు. ఔరంగజేబు నుంచి చాకచక్యంగా జాబ్ రియల్ అనే వైద్యుడు సహాయంతో గోవిందపూర్, సుతామతి, రాణిగంజ్ వంటి మూడు గ్రామాలను పొంది వాటిని తరువాత కాలంలో కోల్కత్తా అనే మహానగరంగా నిర్మించాడు. కాల క్రమంలో కలకత్తా మహానగరంగా మారిపోయింది ఆ తర్వాత తూర్పు తీరంలో బ్రిటిష్ వారికి ప్రధానమైన ఓడరేవుగా వస్తు సరఫరా గెడ్డంగిగా మారి పోయింది. తర్వాత దానిలో వారి రక్షణ కోసం కోటలు కట్టుకోవడం మొదలుపెట్టారు అలా వారు నిర్మించిన మొదటి కోట పోర్ట్ విలియం కోట.
bengali nationalism wikipedia
ఇలా వీరు కోటలు నిర్మిస్తూ కలకత్తా ను ఒక మహానగరంగా మార్చి ఏకంగా దాన్నే తమ రాజధానిగా చేసుకునేలా చేశారు. రాను రాను కలకత్తా మహా నగరంగా అభివృద్ధి చెందింది. రోజుల్లో కలకత్తా అంటేనే ఒక ప్రధాన ఆకర్షణ గా ఉండేలా చేశారు. అందుకే వారు ఎంతో కష్టపడి నిర్మించినందున వారి సగం సంపద ఆదాయం అక్కడి నుండే రావడంతో ఎలాగైనా మోసం చేసిన సరే బెంగాల్ ను పొందాలని ప్లాన్ చేసి మీర్జాపరును లంచం ఆశ చూపి అతనితోపాటు యావత్ దేశాన్ని నాశనం చేశారు. వీటన్నింటికీ కారణం ఆ రోజుల్లో బెంగాల్ అభివృద్ధి కారణమని చెప్పవచ్చు. ఇక తరువాతి కారణం
కలకత్తా ప్రధాన ఓడరేవు పట్టణంగా ఉండడం:-
అప్పట్లో బెంగాల్ అభివృద్ధికి సంపదకు పేరుకు మరో కారణం కోల్కత్తా హుగ్లీ నది ఆధారిత ఓడరేవుతోపాటు సముద్ర ఆధారిత ఓడరేవును కలిగి ఉండటం వల్ల ఆ రోజుల్లో దీనికి బ్రిటిష్ వారు కూడా దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

 History of bengal wikipedia
ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా నది సముద్ర ఆధారిత రవాణా మాత్రమే అభివృద్ధి చెందడంతో దానికి కావలసిన అన్ని అనుకూలతలు బెంగాల్ కు ఉండడం వల్ల కూడా అప్పట్లో బెంగాల్ అనేది ఒక ప్రముఖంగా చెప్పబడినది. ఇక తరువాతి కారణం 
దేశంలో అత్యధిక మంది మేధావులు కలిగి ఉండడం:-
బ్రిటిష్ కాలం నుంచి కూడా దేశంలో అత్యధిక మంది మేధావులు బెంగాల్ నుంచి పుట్టుకొచ్చారు వారిలో ప్రధానమైన వారు రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్, సురేంద్రనాథ్ బెనర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, బకించంద్ర చటర్జీ వంటి మహనీయులు ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రభావితం చేశారు. వీరితో పాటు ఇప్పటికీ కూడా దేశంలో అత్యధిక సంఖ్యలో నోబెల్ పురస్కారాలు అందుకున్నా రాష్ట్రం పశ్చిమ బెంగాలీ అంతే కాకుండా అసలు నోబెల్ ప్రైజ్ అందుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా బెంగాల్ తో సంబంధం ఉండే ఉంటుంది
bengali nationalism wikipedia
ravindra nath tagore image credit freepik)
. అనే విధంగా వారి జీవితాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకునే వారు రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ సివి రామన్, మదర్ తెరిసా, అమర్తి సేన్, వెంకట్రామన్ రామకృష్ణన్, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, హరి గోవింద కరోనా, అభిజిత్ బెనర్జీ వంటి నోబెల్ బహుమతి గ్రహీతలందరికీ కూడా ఏదో విధంగా బెంగాల్ తో సంబంధం ఉండే ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే బెంగాల్లో ఎక్కువ మంది మేధావులు జన్మించారని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాతి కారణంHistory of bengal wikipedia
  స్వాతంత్ర్య
ఉద్యమంలో బెంగాల్కు ప్రత్యేకతలు ఉండడం:-
దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో అన్ని ఉద్యమాలకు మూలమైన ఉద్యమం స్వదేశీ ఉద్యమం.
ఈ ఉద్యమం మూలంగానే మొదటిసారిగా భారతీయులంతా ఏకతాటిపైకి వచ్చేలా ఇది కృషి చేసింది అటు బ్రిటిష్ వారు 1906 లో మనలో మనకు చిచ్చు పెట్టాలని బెంగాల్ ను విభజించిన వందేమాతరం గేయంతో వ్యతిరేకతను మొదలుపెట్టి స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు తరువాత కాలాల్లో గాంధీ చేపట్టిన చాలా ఉద్యమాలకు మొదటి మెట్టు ఇదే అని చెప్పవచ్చు ఇలా దేశ స్వాతంత్ర పోరాటంలో బెంగాలీలా పాత్ర చాలానే ఉంది అంతేకాకుండా దేశ స్వతంత్రానికి తమ ప్రాణాలు అర్పించిన వారిలో బెంగాలీలు కూడా చాలా వరకు ఉన్నారు. దేశంలో వచ్చే ప్రతి ఉద్యమం ఆ రోజుల్లో ముందుగా బెంగాలీలోనే వచ్చేది అన్న మాటను నిజం చేస్తూ యావత్తు భారతదేశం ఇప్పటి గురించి ఆలోచిస్తే బెంగాల్ రేపటి గురించి ఆలోచిస్తుంది అన్నా సామెత పుట్టుకొచ్చింది. ఇక తర్వాతి కారణం
 కలకత్తా రాజధానిగా ఉండడం:-
నిజానికి అప్పటికి ఇప్పటికీ దేశంలో అతి పెద్ద సిటీ కలకత్తా దీని మూలంగానే బ్రిటిష్ వారు మొదట తమ రాజధానిగా కలకత్తానే ఎంచుకున్నారు. దీంతోదాన్ని ఎంతో గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేశారు కానీ కార్యక్రమంలో ప్రపంచంలో వస్తున్న యుద్దాల కారణంగా రాజధాని నగరం తీర ప్రాంతాల్లో ఉండకూడదు అన్న ఆలోచనతో 1911 లో ఢిల్లీకి రాజధాని మార్చారు. అయితే 1911 వరకు కూడా దేశ రాజధానిగా కలకత్తా నే ఉండటం వల్ల అప్పట్లో కలకత్తా చాలా గొప్పగా అభివృద్ధి చేయబడింది దీని మూలంగా కూడా దేశంలో వచ్చే ప్రతి తిరుగుబాటు ప్రతి ఆలోచన ప్రతి మలుపు బెంగాలీలోనే వచ్చేదని చెప్పవచ్చు. అంతేకాకుండా కలకత్తాకు విశాలమైన భూ భౌతిక అనుకూలతలో ఉన్నాయి దీంతో అది ఎంతో గొప్పగా చెప్పబడింది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశ చరిత్రలో బెంగాలీలకు చాలా గొప్ప స్థానం ఉందని చెప్పబడినది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !