Youtube fake content ప్తె ఎలా alert కావాలి
Youtube fake content alert tips
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ Youtube . ప్రస్తుతం సొసైటీలో యూట్యూబ్ తమ రోజు వారి జీవితంలో భాగంగా వీక్షిస్తున్న వారి సంఖ్య ప్రపంచంలో దాదాపు 70% పైగానే ఉంటుంది.2025లో google ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 2024వ సంవత్సరంలో అత్యధిక మంది వీక్షించిన మరియు గూగుల్ లో సెర్చ్ చేసిన పదం Youtube అని చెప్పడం జరిగింది.
గత సంవత్సరం మొత్తం మీద ప్రపంచంలో దాదాపు 19 మిలియన్స్ మంది google సెర్చ్ ఇంజన్లో అనే పదాన్ని వెతికారని గూగుల్ తన యొక్క ట్రెండ్ అనాలసిస్ ద్వారా వివరించింది. మరి ప్రపంచంలో యుట్యూబ్కు ఇంతలా ఆడిట్ అవ్వడానికి మరో కారణం సులభంగా ప్రపంచంలో జరిగే విశేషాలు మరియు ఎంటర్టైన్మెంట్ లో భాగంగా సినిమాలు షార్ట్ స్టోరీస్ వెబ్ నిర్మిస్తున్న నటిస్తున్న అన్నింటిని సులభంగా మన కళ్ళముందు కు తీసుకొని రావడంలో Youtube విశేషంగా కృషి చేస్తున్నది. అంతేకాకుండా చాలా తక్కువ సమయం లోనే ఏం ప్రపంచంలో జరుగుతుందో యూట్యూబ్ ద్వారా కొన్ని సెకన్ల వ్యవధిలోనే తెలుస్తున్నది.
అంతేకాకుండా మన రోజు వారి జీవితంలో మన యొక్క ఎదుగుదలకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన సామాజిక జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకొనుటలో యూట్యూబ్ అనేది నెంబర్ వన్ స్థానంలో ఉందనే చెప్పవచ్చు. ఎక్కడో మనకు సుదూరంలో ఉన్న ప్రఖ్యాత డాక్టర్లు మోటివేషనల్ స్పీకర్లు వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థానంలో ఉన్నవారు మరియు కొన్ని రకాల కోర్టులతో మాట్లాడడానికి మరియు వారి యొక్క సూచనలు పాటించడానికి చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అసలు ఖర్చు లేకుండా కూడా చూసే విధంగా మనకు యూట్యూబ్ మంచి వేదికగా మారింది.అంతేకాకుండా చాలా మంది ప్రతిభవంతులకు తమ యొక్క స్కిల్ ను ప్రదర్శించడానికి యూట్యూబ్ అనేది మంచి వేదికగా మారింది. ఈ యూట్యూబ్ వేదికగా చాలామంది తమ యొక్క ప్రతిభతో కొత్త కొత్త వీడియోలను సృష్టిస్తూ ప్రజలకు మరింత జ్ఞానాన్ని అందించడంతోపాటు వారు కూడా తమ యొక్క ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా వివిధ రకాల వ్యాపారాలు కార్పొరేట్ సంస్థలు వివిధ రకాల విద్యాసంస్థలు వివిధ రకాల ఆన్లైన్ వెబ్సైట్లు వంటి వాటన్నింటికీ కూడా వాటి యొక్క లాభాలకు యూట్యూబ్ ని కూడా వాడుకుంటున్నారు. యూట్యూబ్ ను మొదటిసారిగా ఫిబ్రవరి 14 2005న స్టీవెన్సన్, చాంద్ హార్లీ జావేద్ కరీం లు అమెరికాలో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు.
ఈ ముగ్గురు మేధావులు కూడా యూట్యూబ్లో కనిపెట్టకముందు పేపాల్ అనే సంస్థలో ఉద్యోగులుగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాను రాను ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొంది ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం అన్నింటిని దాటి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రతిరోజు ఉదయం లేవగానే అక్షరాస్యుడైన నిరక్షరాస్యుడైన తమ రోజువారి జీవితంలో కచ్చితంగా యూట్యూబ్ ని ఏదో ఒక విధంగా వీక్షిస్తున్నాడు. పైన చెప్పిన విధంగా యూట్యూబ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ, ఎంతో మంది జీవితాలు మారినప్పటికీ, ఎంతోమందికి కెరియర్ పరంగా, మరియు జీవితం పరంగా, ఆరోగ్యం పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో విధాలైనా మంచి సౌకర్యాలు మంచి సలహాలు అందినప్పటికీ యూట్యూబ్ వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. అంతేకాకుండా యూట్యూబ్లో మనం చూసేది నిజమైన కంటెంట్ లేదా ఫేక్ కంటెంట్ అని నిర్ధారించడానికి కొన్ని నియమాలు కలవు. అంతేకాకుండా యూట్యూబ్లో కొంతమంది స్కామర్స్ ఫేక్ కంటెంట్తో మనకు తప్పుడు సమాచారం ఇచ్చి మైన ఆశలు చూపి మన నుండి డబ్బును కూడా లాగేస్తుండడం మనం రోజు వారి జీవితంలో గమనించే ఉంటాం.
ప్రస్తుతం విస్తృతమైన సోషల్ మీడియా కాలంలో ఇవ్వడం పెరిగిపోయిన ఫేక్ వెబ్సైట్లు యాప్స్ వల్ల ప్రజలు తీవ్రమైన గందరగోళానికి గురవడంతో పాటు వారి యొక్క వ్యక్తిగత ప్రైవసీకి కూడా దెబ్బ వాటిల్లుతున్నది. వీటన్నింటినీ కూడా డబ్బు కోసం యూట్యూబ్లో చాలామంది కోసం ప్రమోషన్ చేస్తూ అమాయక ప్రజల్ని నిండా ముంచేస్తున్నారు. ఇటీవల యూట్యూబ్ లో చెప్పిన విధంగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో దానిలో తన వ్యక్తిగత సమాచారాన్ని అందించడం వల్ల అతని అకౌంట్లోని దాదాపు 50 లక్షలు డబ్బు మాయం అవడం మనం గమనించే ఉంటాం. నిజంగా ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మనం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే యూట్యూబ్లో ఉన్న ఫేక్ కంటెంట్ వ్యాప్తి చెందిస్తున్న యూట్యూ బర్ల నుండి మనల్ని మనం కాపాడు కోవచ్చు. అంతేకాకుండా మన గ్రామీణంలో ఉండే చాలా మంది యూట్యూబ్ లో చూసి ఆశాస్త్రీయ నాటు వైద్యాల వల్ల తమ రోగం మాయమ్మ మవ్వడం అటు ఉంచితే చివరికి తమ ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. వీటి వల్ల చాలామంది డాక్టర్లపై కూడా నమ్మకం కోల్పోయి కేవలం నాటు వైద్యస్తులు, మంత్రగాలను కొందరు ఆచరిస్తుండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటీవల వార్తల్లో ఒక వ్యక్తి పాము కాటుకు గురై ఆస్పత్రికి వెళ్ళకుండా యూట్యూబ్లో చెప్పిన విధంగా చేయడంతో చివరికి తమ ప్రాణం కూడా కోల్పోవాల్సి వచ్చిందని వారి బంధువులు వాపోయారు. అంతేకాకుండా ఇటీవలే కొందరు విద్యార్థులు అనవసర సోషల్ మీడియాకు గురై యూట్యూబ్ లో చూసినా ఒక ఫేక్ కంటెంట్ వీడియో వల్ల ఎగ్జామ్ డేట్స్ కూడా మర్చిపోయి చివరికి ఎగ్జామ్ కూడా కోల్పోవాల్సి వచ్చింది.
మరి కొన్నిసార్లు యూట్యూబ్ ని కనుక నమ్ముకుంటే ఇలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మరి అటువంటిప్పుడు యూట్యూబ్లో చెప్పిన కంటెంట్ అనేది నిజమా అబద్దమా అనేది గుర్తించడం ఎలాగో ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది
నైపుణ్యం మరియు అనుభవం(Skills and experience) :-
ఏ రంగంలో అయినా నైపుణ్యం అనేది మరియు ఎక్స్పీరియన్స్ అనేది వారి యొక్క తెలివితేటలకు జ్ఞానానికి మూలం. వారు సుదీర్ఘంగా అదే రంగంలో గనక ఉంటే వారికి ఆ విషయం పైన పూర్తి అవగాహన ఉంటుంది. అంతేకాకుండా వారు దానిపైన ఎన్నో ప్రాక్టికల్స్, కేస్ స్టడీస్ చేసి ఉంటారు కనుక వారికి చాలా వరకు దానిపై గ్రిప్ ఉంటుంది. అందువల్ల మనం యూట్యూబ్ లో ఎవరినైనా నమ్మేటప్పుడు ముందు వారి సాధించిన ఘనతలు ఏమిటి వారి యొక్క ఎక్స్పీరియన్స్ నైపుణ్యాలు ఏమిటి వంటి అంశాలను క్రియాశీలంగా గమనించాలి. వారు తమ యొక్క స్వలాభం వ్యాపార దృష్టితో మనకు ఆ విషయాలు చెబుతున్నారా లేక మన యొక్క సంక్షేమం కోసమ లేక మన బాగు కోసం ఆలోచించి వారు మనల్ని ముందుకు తీసుకువెళ్లే సంకల్పంతో మనకు వివరిస్తున్నారా అనేది శీఘ్రంగా ఆలోచించిన తర్వాతే మనం వాటిని నమ్మాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది తమలో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేకపోయినా విస్తృతమైన ఇంటర్నెట్ ఆన్లైన్ కంటెంట్ ను ఉపయోగించుకొని తమకు తోచిన విధంగా సలహాలిస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అనవసరంగా వారి జీవితాలతో ఆటలాడుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా సులభంగా మనీ సంపాదించవచ్చు.అన్న ఒక థాట్ తో చాలామంది ప్రజలను ఆకర్షించడానికి వివిధ రకాల కొత్త కొత్త పోస్టులతో Youtube thambails తో ఆకర్షిస్తున్నారు. ఈ విధంగా చాలామంది అమాయకులు అనవసరంగా వారి యొక్క ఫేక్ కంటెంట్ కు ఆడిట్ అవుతున్నారు. వారు చెప్పే రంగంలో గనక వారికి సరైన ఎక్స్పీరియన్స్ , నాలెడ్జ్ లేకపోతే ఇటువంటి వారిని అస్సలు నమ్మకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటి వారిని గనుక నమ్ముకుంటే వారి యొక్క ఫేక్ అడ్వైసెస్ వల్ల మన జీవితంలో చాలా వరకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
ఆ ఛానల్ కు ప్రజల్లో పాపులారిటీ ఉందా(popularity of peoples) :-
మనం చూస్తున్న వింటున్న కంటెంట్ నిజమైనదా కాదా అని నిర్ధారించుకోవడానికి మరో ముఖ్యమైన పాయింట్ చూస్తున్న ఛానల్ కు ప్రజల్లో మంచి పాపులారిటీ ఉందా అన్న విషయం కూడా ఒకసారి గమనించుకోవాలి. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ చానల్లో అప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లను కొన్ని ఫేక్ thamblins తో ప్రజలను ఆకర్షిస్తూ అనవసరంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ను sprend చేస్తున్నారు.
అప్పటికి అప్పుడు వారు వీవర్స్ ను మరియు సబ్స్క్రైబ్ను పెంచుకోవడానికి ఇటువంటి దరిద్రపు ఆలోచనలు చేస్తూ ప్రజల సమయాన్ని వారి యొక్క ఎమోషన్స్ ను నాశనం చేస్తున్నారు. అందువల్ల వీలైనంతవరకు ఫేక్ న్యూస్ స్పెండ్ చేయకుండా అత్యంత రియాలిటీగా వాస్త వికతకు దగ్గరగా ఉండే ఛానల్ నన్ను మాత్రమే ఫాలో అవ్వాలి. లేకపోతే వారి ఇచ్చే అనవసర సూచనలు, అనవసర ఇన్ఫర్మేషన్ మనల్ని తప్పు ద్వారా పట్టిస్తాయి. ఇటువంటి ఛానల్ లపై యూట్యూబ్కు కంప్లీట్ చేయాలి.
తర్వాతది
నిజ నిజాలు అర్థం చేసుకోవడం(Understand truths):-
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం రోజు చూస్తున్న న్యూస్ పేపర్ లోని అంశాలలో ఉన్న అంశాలను బట్టి మనం వాస్తవికతను అర్థం చేసుకోవచ్చు.Youtube original channel initiatives
వాటిని బట్టి కూడా యూట్యూబ్ లో వచ్చే కొన్ని ఫేక్ చానల్స్ వీడియోస్ అను గుర్తించే అవకాశం ఉంది. మనం ఎక్కువగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలంటే ప్రభుత్వ అధికారిక టీవీ ఛానళ్లు, ప్రభుత్వ అధికారుల యొక్క అధికార యూట్యూబ్ ఛానల్ ను ఫాలో అవ్వాలి ఎందుకంటే వారు మాత్రమే ఖచ్చితమైన నిజమైన సమాచారాన్ని మనకు అందించగలరు. మిగతా వారంతా కూడా చాలామంది తమ స్వలాభం కోసమే పనిచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మారుతున్నారు. తర్వాతది Youtube wikipedia information
ఫేక్ ప్రమోషన్స్(fake promotion's) ;--
ప్రస్తుతం సోషల్ మీడియా విశేషంగా అభివృద్ధి చెందడంతో ఇంటర్నెట్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో వెబ్సైట్లు యాప్స్ పుట్టుకొచ్చాయి. ఈ యాప్స్ వెబ్సైట్లు కొన్ని ఫేక్ వి కూడా కలవు. వీటి ద్వారా కొందరు కామర్స్ మన యొక్క వ్యక్తిగత డేటాను పంది మన యొక్క బ్యాంకు ఖాతాలోని డబ్బును కొట్టేస్తున్నారు. అంతేకాకుండా కొందరు యూట్యూబర్లు డబ్బు కోసం కక్కుర్తి పడి టేక్ వెబ్సైట్లో యాప్ లను డౌన్లోడ్ చేసుకోమని యూజర్స్ ను ప్రలోభ పెట్టేస్తున్నారు.
దీంతో వారు వారి యొక్క సమయంతో పాటు డబ్బును కూడా కోల్పోతున్నారు. అందువల్ల ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ ను సులభంగా డబ్బు సంపాదించవచ్చు అన్న ప్రలోభాలకు వీలైనంతవరకు లొంగవద్దు. అంతేకాకుండా యాప్ లో అయినా ముందుగా మన మంచి డబ్బుని ఆశిస్తున్నారంటే అది ఫేక్ వెబ్సైట్ అని గమనించాలి. ఎందుకంటే నిజానికి రూల్ వెబ్సైట్లు మన నుండి ఎలాంటి డబ్బును ఆశించవు. వారు కావాలనే వారికి లాభం వచ్చేందుకు వారు సొమ్ము చేసుకునేందుకు వారు తమ వీడియోలను అడ్వర్టైజ్ చేస్తున్నారు. వీటిని అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది.
తర్వాతది
Data safety issues: -
యూట్యూబ్ ఛానల్ కింద ఇచ్చే టాస్కులు, మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అన్ని విధాలమైన ఫార్మా పెండింగ్ లను చాలా వరకు నమ్మవద్దు. అవి 100% జెన్యూన్ అని నమ్మితేనే వాటిని ఫిల్ చేయండి.
cyber security Image credit pixabayఎందుకంటే ఆ డేటాను ఆధారంగా చేసుకొని మన వ్యక్తిగత సమాచారాన్ని వారు లాక్కొని ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువల్ల కొత్తవారు మనకు తెలియని వారు చెప్పే కొత్త కొత్త టాస్క్లను పూర్తిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేటి కాలంలో ఫేక్ వెబ్సైట్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కువైపోయాయి వల్ల వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా అప్ర మొత్తం అవ్వాలి.
Money manege ment issues:-
ప్రస్తుతం యూట్యూబ్లో చాలామంది లెక్కకు మించి భూపరంగా వీడియోలు చేస్తున్నారు. వీరిలో చాలామంది ట్రేడింగ్ యాప్స్ నో ప్రమోట్ చేస్తూ యూజర్లను నష్టాలు పాలు చేస్తున్నారు. ఇలా ఫేక్ ట్రేడింగ్ జాబ్స్ తో వాటిపై అవగాహన లేక చాలామంది ప్రజలు నష్టాలపాలు అయ్యి తమ సర్వస్వాన్ని కోల్పోతున్నారు. Youtube wikipedia information
నిజానికి డబ్బు పరంగా మనీ పరంగా ఫైనాన్స్ పరంగా ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటిపై పూర్తి అవగాహన ఉన్న వారి యొక్క సలహాలను మాత్రమే ఆచరించాలి. ఎవరో చెప్పారని గుడ్డిగా కనుక వారి సలహాలను పాటిస్తే మనం పప్పులో కాలు వేసినట్టే, ప్రస్తుతం ఆన్లైన్ ట్రేడింగ్ అనేది చాలా విస్తారంగా వ్యాపించి ఏ యాప్ నిజమైనది ఏ యాప్ ఫేక్ అనేది చెప్పడం కూడా కష్టంగా మారింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఏది నిజమైనది అనే నిజమైన నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే ఆన్లైన్ ట్రేడింగ్ లో విస్తారమైన అనుభవం కలవారు, ఫైనాన్స్ ఎలా సలహాలను పాటిస్తూ, అలాగే న్యూస్ పేపర్ ను చూస్తూ వాటన్నింటి కలవిడిగా మనం ఈ ట్రేడింగ్ లోకి ప్రవేశించాలి. అంతేకానీ గుడ్డిగా యూట్యూబర్లు చెప్పిన విషయాలు కనుక ఫాలో అయితే మాత్రం చాలా ఆర్థికంగా వెనుకబడాల్సి వస్తుంది. అందువల్ల వీటికి చాలా దూరంగా ఉండాలి. డబ్బు అనేది ఇప్పుడు శాశ్వతం అయిపోయింది.
ప్రతి ఒక్కరూ సులభంగా డబ్బు సాధించడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు అందువల్ల ఈ అన్వేషణ మార్గాలను ఆసరాగా చేసుకొని కామర్స్ దొంగ గ్యాంగులు ఫేక్ ఐడీలతో ఫేక్ యాప్స్ తో లాభాల ఆశ చూపి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ తో వారిని నష్టాల పాలు గురి చేస్తున్నారు. ఇటువంటి వారికి యూట్యూబ్ వేదికగా మారింది. దీనిలో యూట్యూబ్ ఎన్నో విధాలైన ఆంక్షలు మార్గదర్శకాలు చేసిన ఇటువంటి వారి నుంచి ఇప్పటికి కూడా ప్రజలను యూట్యూబ్ రక్షించలేకపోతున్నది అందువల్ల మనమే వీటికి అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది డబ్బులు అనేవి ఊరికే రావు అని చెప్పే లలిత జ్యువెలరీ యజమాని మాటలు 100% నిజం అని గ్రహించాలి. Youtube wikipedia information
వారు చెప్పినట్టే నిజంగా ఊరికే డబ్బు వచ్చే ముందు వారే ధనవంతులు కావాలి వారు ఆ వీడియో చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది గమనించాలి. మన డబ్బు రెండింతలు అవుతుంది మూడింతలు అవుతుంది దీనిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు మీ అంతరాత్మను నమ్ముకుని మీకు దానిపై జ్ఞానం ఉంటేనే మంచి ఎక్స్పర్ట్స్ సలహాతోనే ఆర్థిక మేనేజ్మెంట్ కొనసాగించండి.
తర్వాతది
Health related problems :-
ఆరోగ్యపరంగా ప్రస్తుతం విస్తారంగా విస్తరించిన యూట్యూబ్ వల్ల ఎక్కడో గ్రామాల్లో నాటువైద్యం చేసే వారు కూడా యూట్యూబ్ ద్వారా పాపులర్ అవుతున్నారు. వీరి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ అన్ని సమయాల్లో వీరి సూచనలు పాటించడం అంత శ్రేయస్కరం కాదనే చెప్పాలి ఒక నొప్పుల్లోనే చాలా రకాలు ఉన్నాయి అవి ఏ రకమైన నొప్పులు ఎలా ఉన్నాయి.
ఏ అవయవానికి ఉన్నాయి అనేవి డాక్టర్ యొక్క పరీక్షల ద్వారా నిజనిర్ధారణ జరిగినప్పుడే నమ్మాలి. వారు సోషల్ మీడియాలో యూట్యూబ్లో చెప్పిన విధంగా చేస్తే కొన్నిసార్లు ప్రాణాల మీదికి కూడా లేకపోలేదు వీటిని కూడా చాలావరకు అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు చెప్పే సహజ వైద్యాలు కొన్ని తాత్కాలికమైన చిన్న చిన్న జబ్బులకు పని చేయవచ్చు కానీ పెద్ద పెద్ద జబ్బులు మాత్రం డాక్టర్ల వైద్య కు తప్పనిసరిగా సంప్రదించాలి వారి సూచనలతోనే మందులను వేసుకోవాలి అంతేకానీ తాత్కాలికమైన యూట్యూబ్ అన్న సలహాలు పాటిస్తే అవి పనిచేయకపోవచ్చు.
Educational issues: -
ఒకప్పుడు విద్య అనేది తరగతి గదిలోనే ఉండేది విస్తృతమైన యూట్యూబ్ ప్రపంచం ద్వారా విద్య కూడా యూట్యూబ్లోకి వచ్చింది దీంతో చాలామంది ఆన్లైన్ కోచింగ్ సెంటర్ల వారు యూట్యూబ్ ను ఒక వేదిక్కుగా చేసుకుని తమ విద్యాపరమైన వ్యాపారానికి కూడా కొనసాగిస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కొందరు యూట్యూబ్లో మంచిగా పాటలు చెప్పి తేరా కోచింగ్ సెంటర్ కి వెళ్ళాక వారే సరైన విధంగా ఉండకపోవడం మనం ప్రస్తుతం చాలా చోట్ల గమనించి ఉంటాం వీటిపై కూడా ఒక కన్నేసి ఉంచాలి అంతే కాకుండా యూట్యూబ్ ఛానల్ లో ఫేక్ జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా స్పెండ్ చేస్తున్నాయి వీటి మోసంలో పడే చాలా మంది తమ డబ్బును అన్ని కోల్పోతున్నారు. కాకుండా ప్పట్లో చాలామంది తమకు సరైన అవగాహన లేకున్నా కూడా ఏవో తమకు తెలిసినవే సరైనవి అనుకుంటూ యూట్యూబ్ ద్వారా పాటలు బోధిస్తున్నారు. అందువల్ల అటువంటి వారు చెప్పేవి నిజాలా కాదా అని నిర్ధారించుకోవలసిన అవసరం కూడా ఉంది వారు నిజంగా సబ్జెక్టులో ఎక్ష్ప్రెస్స్ మరియు మంచి విషయం పరిజ్ఞానం కలవారు అయితే వారిని అనుసరించవచ్చు వారు డబ్బు పరంగా ఆలోచిస్తూ ఎవరో తెలిసినవి చెబుతున్నారంటే మాత్రం మీరు చాలా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అంతేకాకుండా కొందరు అప్లియేట్ మార్కెటింగ్ చేయడానికి యూట్యూబ్ ను వేదికగా మార్చుకున్నారు ప్రమోట్ చేస్తున్నారు సరైన కంటెంట్ లేకుండా డబ్బు కోసం ఇలా ఫేక్ ప్రమోషన్స్ చేసే వారు కూడా ఉన్నారు కావున వారి నుంచి బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Resources
Images pixabay
Content: -My own thoughts and google Resources
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి