Sheeps,Goats కాసే వాళ్ళ Life's ఎందుకు spoil అవుతున్నాయి ?

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 50% పైనే వ్యవసాయం,  పశు పోషణ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం  వాటా దాదాపు 18% పైగానే ఉన్నది. దీనిలోనే పశు పోషణ కూడా ఇమిడి ఉన్నది. ఇక్కడ పశు పోషణ అనగానే చాలామంది ఆవులు గేదెలను అనుకుంటారు. నిజానికి పశు పోషన అంటే ఆవులు గేదెలే అయినా కూడా వాటిని కేవలం ఎక్కువమంది పాలకోసమే ఉపయోగిస్తున్నారు. అయితే వీటితోపాటు పశు పోషణలో మేకలు గొర్రెలు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.ప్రస్తుతం మన భారతదేశంలో ఈ మేకలు గొర్రెలను యాదవ వంశానికి చెందిన గొల్ల వారు అనేవారు వారి యొక్క ప్రధాన వృత్తిగా ఎంచుకొని వీటి పైనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి చరిత్రలో మరియు మన యొక్క ఇతిహాసాల్లో సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా వంశానికి చెందినట్టుగా మహాభారతంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు కూడా ఈ పశువుల మధ్య గడిపినట్లు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సాక్షాత్తు దేవాది దేవుడే పవిత్రంగా భావించే ఈ పశువులు ప్రస్తుతం మనం గమనిస్తున్న ఈ సమాజంలో ఏమవుతున్నాయో? మనం రోజువారి రోడ్ల పైన వాటిని కాసే వారి పరిస్థితిని మనం గమనించే ఉంటాం. ఇక్కడ ఈ ఆర్టికల్లో నేను ఆవులు గేదెల గురించి చెప్పడం లేదు. ఎందుకంటే ఆవులు గేదెల విషయంలో చాలామంది మంచి లాభాలే పొందుతున్నారు. ఎందుకంటే వాటి వల్ల వచ్చే పాల వల్ల ఎంతో కొంత ఆర్థికంగా ఆటో ఇటు నెట్టుకు రాగలుగుతున్నారు. అంతేకాకుండా ఆవులు గేదెల యొక్క ఆయు ప్రమాణం కూడా మంచిగానే ఉన్నది. వాటికి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా బలంగానే ఉన్నది. వాటికి చాలా అరుదైన సమయాల్లోనే కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. అందువల్ల వాటిపై పెద్దగా బెంగ అనేది లేదనే చెప్పవచ్చు. అంతేకాకుండా వాటికి మేత విషయంలోనూ కొండలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు కేవలం మన యొక్క పొలాల్లోనే వాటిని మేపుకోవచ్చు అంతేకాకుండా వరిగడ్డి వంటి కొన్ని రకాల పశుగ్రాసాలు వాటికి అందుబాటులో ఉన్నాయి. ఆవులు గేదల యొక్క పరిస్థితులను పక్కనపెట్టి ఇప్పుడు గొర్రెలు మేకలు కాసే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది. నేటి తరంలో వారి ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి. వారి కళ్ళలో ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయి. వీటికి పరిష్కారాలు లేవా? నేటి కాలంలో గొర్రెలు మేకలు కాసేవారు రోజురోజుకు ఎందుకు తగ్గిపోతున్నారు. కాలంలో గొర్రెలు మేకలు కాసే వారు కూడా తమ జీవనోపాధిగా వీటిని ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు అసలు లోపం ఎక్కడ ఉన్నది? వీళ్లను కాపాడే నాధుడే లేడా అన్న విషయాలన్నింటినీ ఈ ఆర్టికల్ లో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఇందులో మొదటిగా గొర్రెల కాపర్లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలేమిటో ఇప్పుడు గమనిద్దాం. నెంబర్ వన్
అంటువ్యాధులు :- ఎన్నో కష్టాలు పడి ఎండనక వాననక రాత్రనకా పగలనకా గొర్రెలే సర్వస్వం అనుకున్న వారికి ఈ అంటు వ్యాధులు అనేవి ఒక పిడుగు లాంటి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అంటూ వ్యాధులు వ్యాపించినప్పుడు చాలా నష్టం సంభావిస్తుంది.అంతేకాకుండా  చాలామంది గొర్రెల కాపరులు నిరక్షరాస్యులు. అంతేకాకుండా నేటి కాలంలో ప్రస్తుతం గ్రామీణ సమాజంలో ఇప్పటికీ సరైన పశువైద్యలు అందుబాటులో లేరు. పశువులకు సంబంధించిన వైద్యం మన రాష్ట్రంలో అంతగా అభివృద్ధి చెందలేదు. దీనివల్ల నిరంతరం ఎన్నో పశువులు అర్ధాంతరంగా మరణిస్తున్నాయి. దీంతో వాటిని కాసే కాపర్ల యొక్క హృదయాలు కన్నీళ్లు మయమవుతున్నాయి. ఇప్పటికీ కూడా గ్రామీణ సమాజంలో చాలా మందికి పశువుల్లో ఏ జబ్బుకు ఎలాంటి మందు వాడాలి? ఎలా వాడాలో కూడా సరైన అవగాహన లేదు. అంతేకాకుండా వీరు పశువైద్యలను సంప్రదిస్తే వారు కేవలం తమ స్వలాభం కోసమే చూస్తూ వారు ఏవో మందులు రాపియ్యడం వీళ్ళ  యొక్క జీవితాలతో ఆటాడుకోవడం జరుగుతున్నది. దీనివల్ల ఎంతో విలువైన పశుసంపదను వారి యొక్క జీవనోపాధిని కేవలం డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్లే వారు చాలా విధంగా కోల్పోతున్నారని కూడా చాలా మంది అభిప్రాయం. అంతేకాకుండా ఈ అంటి వ్యాధులు వ్యాపించినప్పుడు ఒకటి రెండిటికి ఈ ప్రభావం ఉంటే వారు కూడా అంతగా బాధపడాల్సిన అవసరం ఉండదు ఈ అంటూ వ్యాధుల కాలంలో చాలా ఎక్కువ పశువులపై దీని ప్రభావం ఉండటంతో వారు అప్పటిదాకా నమ్ముకున్న కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నది. ఇది ఒక విధంగా నోటి దగ్గరికి వచ్చిన ముద్దను బయటికి లాగినట్టు అన్నచందంగా వారి జీవితం తయారవుతున్నది. చుట్టుపక్కల నేను గమనించిన చాలామంది గొర్రెల కాపర్లు ఇప్పటికి కూడా ప్రతి చిన్న జబ్బుకు పెన్సిలిన్ మరియు టెర్ర మిషన్ లోనే వాడుతున్నారు. ఎటు వంటి జబ్బుకైనా కూడా నేటి కాలంలో వీరు తరచూ ఇవే మందులు వాడుతున్నారు. వీటి వల్ల కూడా అవి ఎక్కువవ్వడం మందు యొక్క పవర్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా వరకు పశువులు తీవ్ర అనారోగ్యానికి కూడా కొన్నిసార్లు గురవుతున్నాయని నేను గమనించిన ఒక విధమైన అంశం. ఇదే సమయంలో పశు వైద్యులు వారికి ఎలాంటి మందులు వాడాలి పశువులకు వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యాక్సిన్లు ఇవ్వాలి వంటి అంశాలు అన్నింటిపై ఒక విధమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా లాభపడే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు నేను గమనించిన వాటిలో వసు వైద్యులు ఇక్కడ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం నేను ఎక్కడా చూడలేదు. వారే కనుక నిజాయితీగా సిన్సియర్గా తమ యొక్క బాధ్యతను నిర్వహిస్తే చాలా మంది పశువుల యొక్క కాపరుల జీవితాలు మారుతాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వ్యాధులు ఎప్పుడూ ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అన్నదానిపై కూడా సరైన సమాచారం లేదు ప్రభుత్వాలు ఒక విధంగా శాస్త్రవేత్తలను పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
రెండవది 
వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం :-
  మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అతివృష్టి అనావృష్టి వంటి దీర్ఘకాలిక విపత్తుల వల్ల గొర్రెల కాపరులు చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియని అయోమయంలో ఉంటున్నారు. ఎండ ఎక్కువైతే అడవిలో ఎక్కువ దూరం వెళ్లడానికి చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా శరీరం నిర్జలీకరణ స్థితికి కూడా వెళ్లే పరిస్థితి ఉంది. ఇంకా గొర్రెలు కూడా అంతా యాక్టివ్గా నడిచే  పరిస్థితి ఉండదు. నేటి కాలంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వెళ్లాలంటేనే గొర్రెల కాపరులు చాలా భయపడిపోతున్నారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎండలను తట్టుకొని నిలబడుతూ తమ గొర్రెలకు రక్షణను కల్పిస్తూ నెట్టుకు రాగలుగుతున్నారు. ఇదే సమయంలో చాలామంది వడదెబ్బ వంటి వివిధ రకాల నిర్జలీకరణ స్థితిలోకి కూడా వెళ్లిపోయి తమ ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. ఇక అతివృష్టి సమయంలో తీవ్రమైన వర్షాలతో కూడా అలాంటి ఇబ్బందులే పడాల్సి వస్తున్నది. నేటి కాలంలో కాలంతో సంబంధం లేకుండా వస్తున్న తీవ్రమైన తుఫానులతో ఆ వర్షాలకు తడిచి పశువులు చాలా అనారోగ్యాలకు గురవుతున్నాయి. అంతేకాకుండా ఇదే సమయంలో గొర్రెలు మేకలకు బ్యాక్టీరియా ఫంగస్ వంటి జీవులు వేగంగా వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా వర్షాభావ పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా తీవ్రమైన చలి వర్షం వల్ల కూడా పశువుల కాపర్లు చాలా అనారోగ్యాలకు గురవుతూ తమ ప్రాణాల మీదికి కూడా తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. వర్షం పడ్డప్పుడు పశువుల దగ్గర చాలా మురికిగా ఉండడం ఆందోళనకరంగా తయారవడం మనశ్శాంతిని కూడా ఒక్కోసారి దూరం చేసే విధంగా అవుతున్నది. ప్రత్యేకంగా ఈ సమయంలో అంటువ్యాధులు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ సమయాలలో పశువుల కాపరులు ఎండను చలిని వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో సాహసంతో తమ పశువులకు రక్షణ కల్పిస్తున్నారు. అయినా కూడా వీటన్నింటినీ తట్టుకొని నిలిచిన చాలామందికి వీటిపై సరైన ఆదాయం లభించక తీవ్రమైన పేదరికంలోకి నెట్టబడుతున్నారు. ఒక విధంగా పశువుల కాయడం కూడా బొమ్మ బొరుసు లాగా తయారవుతుంది అన్న చందంగా నేటి కాలంలో వీరి పరిస్థితి మారింది. అంతేకాకుండా ఆదాయం కచ్చితంగా వస్తుంది అన్న గ్యారెంటీ అయితే మాత్రం లేదు. మరి అలా ఉంది వీరి యొక్క దారుణమైన జీవితం. మూడవది
 దళారుల బెడద:- పైన చెప్పిన రెండు కారణాలు ప్రకృతి సంబంధితంగా లేదా వారి యొక్క స్వయంకృతంగా సంభవించవచ్చు కానీ ఈ కారణం మాత్రం సమాజంలో ఉన్న ఒక విధమైన వ్యాపార శైలి వల్ల రూపుదిద్దుకుంటున్నది. సంవత్సరాలు ఎండనక వాననక ఎంతో కష్టంతో వాటిని  పెంచి పోషిస్తే చివరికి వాటి వల్ల వచ్చే ఆదాయం మధ్యలో ఈ దళారుల రూపంలో అప్పటికప్పుడు వచ్చి వారి నోటిలోని ముద్దను లాక్కున్నట్లు వారి ఆదాయాన్ని వీరు పొందుతున్నారు. ఇది కూడా వీరు ఎలాంటి శ్రమ లేకుండానే సులభంగా. ఈ దళారుల వ్యవస్థ అనేది ప్రాచీన కాలం నుండి కూడా ఒక ఆచారంగా కొనసాగుతున్నది. ఈ ఆచారం వల్లే నేటి తరంలో చాలామంది గొర్రెల కాపరులు తమ యొక్క ఆదాయాలను ఈ దళారులకు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గొర్రెల కాపరులను గమనించుకొని వారి బాగు కోసం ఈ దళారుల వ్యవస్థపై కఠినమైన ఆంక్షలు విధించాలని కోరుతున్నాను. అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఈ దళారుల మోసాలపై అవగాహన ఏర్పరచుకొని తమకు తాము గానే తమ పశువులను విక్రయించుకుంటున్నారు. ఇది రానున్న కాలంలో మరింతగా అభివృద్ధి చెందితే ఇంకా బాగుంటుంది.
తర్వాత నాలుగవది 
క్రూర మృగాల నుండి రక్షణ:- పైన చెప్పిన మూడు కారణాలు ఒక ఎత్తు అయితే ఇది మాత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పైన చెప్పిన కారణాలలో కొద్దిగా లాభము నష్టము సంభవించవచ్చు. కానీ ఈ నాలుగవ కారణం వల్ల మాత్రం వారి యొక్క యావదాస్తిని పూర్తిగా కొద్ది నిమిషాల్లోనే కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే అడవిలో క్రూర మృగాలు ఎప్పుడూ ఏ చోట ఎక్కడ ఉంటాయో ఎవరికీ తెలియదు. అవి ఎప్పుడు పశువుల పై దాడి చేస్తాయో కూడా ఒక అంచనాకు రాలేము. ఒకవేళ అవి కాని దాడి చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అంతేకాకుండా విపరీతమైన నష్టాలు కూడా చెవి చూడాల్సి వస్తుంది. చాలామంది గ్రామీణ వ్యక్తులు ఈ క్రూర మృగాల నుండి తమ పశువులను రక్షించలేక కూడా వాటిని అమ్ముకోవాల్సి వచ్చిందని కూడా వాపోతున్నారు. ఈ క్రూర మృగాలు ఒక్కసారి పశువులపై దాడి చేశాయి అంటే ఎన్ని పశువులు ఉంటే అన్నిటిపై కూడా దాడి చేస్తాయి దీంతో ఒకేసారి చాలా పశువులు ప్రాణాలు వదిలే అవకాశాలు ఉన్నాయి అందువల్లే వీటి నుండి రక్షించుకోవడం పశువుల కాపరులకు నిరంతరం అప్రమత్తత చాలా అవసరం. కొన్నిసార్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా దరిద్రం దాపురించిందంటే ఎన్నో పరిణామాలు  అనుభవించాల్సి  వస్తున్నది. ఈమధ్య మా గ్రామం సమీపంలో దాదాపు 20 పశువులను క్రూర మృగాలు చంపివేశాయి. ఆ సమయంలో వారి యొక్క బాధలు నా కళ్ళల్లో నుంచి నీళ్ళు తెప్పించాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఆర్టికల్ ను రాయడం జరిగింది. కా అడవి జంతువులు పక్కన పెడితే మన చుట్టుపక్కల ఉండే కుక్కలు కూడా కొన్నిసార్లు ఈ పశువులపై దాడి చేసే అవకాశం ఉన్నది అడవిలోనే కాకుండా గ్రామంలో ఇంటి దగ్గర కూడా వీటికి రక్షణ కల్పించాల్సి వస్తున్నది. దీంతో ఆటో అడవిలో ఇటు ఇంటి దగ్గర కూడా నిరంతరం వీటి రక్షణ కోసం పాకులాడాల్సి వస్తున్నది. అడవిలో పులులు, తోడేళ్లు ,నక్కలు,రోసు కుక్కలు వంటివి వీటి కోసం కాపు కాసి ఉంటాయి. అడవుల్లో ఇవైతే దగ్గర కొందరు దొంగలు చుట్టూ ఉండే కుక్కల నుండి కూడా రక్షించుకోవలసి వస్తున్నది. ఇలా నిరంతరం అప్రమత్తత అవసరం. ఈ అప్రమత్తత కూడా చాలా కష్టంతో కూడుకొని ఉన్నది.
ఇతర కారణాలు:- పైన చెప్పిన కారణాలే కాకుండా అనేక రకాలైన ఇతర కారణాలు కూడా గొర్రెల కాపరుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. అవి వాహనాల నుండి కూడా బస్సులను రక్షించుకోవలసి వస్తున్నది. ఒక వేల రోడ్డుపైన పశువులు వెళుతుంటే కొన్ని రకాల వాహనాలు కూడా వాటిని రోడ్డుపై అమాంతం ఢీకొట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇటీవల విజయవాడ దగ్గర గల హైవే రోడ్డు ప్రక్కన ఉన్న ఒక పశువుల షెడ్డులో ఉన్న సుమారు 100 గొర్రెలను ఒక లారీ హైవే రోడ్డు పై నుండి దూసుకు వెళ్లి మరి ఆ షెడ్యూల్ ఢీకొని దాదాపు 80 పశువులను హతమార్చింది. ఈ ఘటన నిజంగా చాలామంది కలలో నుండి నీళ్లను తెప్పిస్తున్నది. ఇలాంటి ఘటనలు మనం తరచూ వార్తల్లో అనేకం చూస్తూ ఉంటాం. ఇలా వాహనాల నుండి కూడా వీటికి ప్రమాదం పొంచి ఉంది. అంతేకాకుండా అడవుల్లో మరియు కొన్ని రకాల రోడ్ల వెంబడి కొందరు దొంగలు రౌడీలు   కాపరులను బెదిరిస్తూ పశువులను ఎత్తుకుపోవడం కూడా మనం తరచూ చూస్తున్నాం. అంతేకాకుండా అడవుల్లో  ఒంటరిగా ఉన్న పశువుల కాపరులపై కొన్ని సందర్భాల్లో కూర మృగాలు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా కొందరు దొంగలే దాడి చేసి పశువులను ఎత్తుకుపోవడం కూడా నేటి కాలంలో చాలా సహజంగా మారింది. వీటన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడాలంటే నిజంగా చాలా సాహస మనే చెప్పాలి. ఇంకా అడవుల్లో కొన్నిసార్లు పశువుల కాపర్లు నిద్ర పలాలు కూడా చేస్తారు. అంటే పశువులను అడవుల్లోనే ఉంచి వారు కూడా అక్కడే ఉండడం అలా ఉన్న సమయాల్లో వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ పశువుల పశువులతో పాటు నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలా నెగ్గించే సమయంలో కొన్నిసార్లు క్రిమి కీటకాల, విష కీటకాల బారిన కూడా పడాల్సి వస్తుంది. ఇలా నిద్రించాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. ఇంకా అడవిలో తనకు కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా లభించవు తన ఆకలిని చంపుకొని ఏదో దొరికిందే తింటూ కేవలం తన పశువుల కోసం తన యొక్క విలాసాలను సంతోషాలను కూడా వదిలి వేస్తున్నారు. ఈ సమయంలో ఎన్నో సంతోషాల నుండి ఆనందాల నుండి బంధుత్వాల నుండి దూరంగా ఉండాల్సి వస్తున్నది. అంతేకాకుండా ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో తమ వారి యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకునే  పరిస్థితి ఉండదు. ఎందుకంటే అడవుల్లో సెల్ ఫోన్స్ సిగ్నల్స్ అనేవి ఉండవు. ఇలా వారు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. పైన చెప్పిన విషయాలన్నీ నేను నా యొక్క అనుభవంతో నా కళ్ళ ముందు నేను చూసిన అనుభవించిన బాధలను బట్టే మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఒక యాదవ వంశం వ్యక్తిని. ఇంకా గొర్రెల కాపరిల కష్టాల గురించి చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. అవన్నీ మరొక పోస్ట్ ద్వారా తెలుసుకుందాం.


 Resources 
Images: -freepik,camera
Write: -my own thoughts
Theme:--Goats and Sheep's mans problem sad life's 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

God పై నమ్మకం కోల్పోయే కొన్ని Moments

God ఉన్నాడు అనడానికి నిదర్శనాలు

India's role in the world wars !